Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహిళలకు సాధికారత కల్పనలో కృత్రిమ మేధ పాత్రను వివరించిన వ్యాసాన్ని పంచుకొన్న ప్రధానమంత్రి


మహిళలకు సాధికారతను కల్పించడంలో కృత్రిమ మేధ (ఏఐ) పోషిస్తున్న పాత్రపై మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రీ ఠాకూర్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పంచుకున్నారు. ‘‘కృత్రిమ మేధ (ఏఐ) వారికి చాలా ఉపయోగకరంగా ఉండడంతోపాటు కొత్త కొత్త అవకాశాలను అందించడంలో కూడా సహాయకారిగా ఉంటోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

‘‘మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ (@savitrii4bjp) జీ మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలకు సాధికారత కల్పించడంలో కృత్రిమ మేధ (ఏఐ) పోషిస్తున్న పాత్రను వివరిస్తూ ఒక వ్యాసాన్ని రాశారు. ఏఐ వారికి చాలా ఉపయోగకరంగా ఉండడంతోపాటు కొత్త కొత్త అవకాశాలను అందించడంలో కూడా సహాయకారిగా ఉంటోంది. మన మహిళాశక్తికి అంకితం చేసిన ఈ వ్యాసాన్ని చదవండి..’’