Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహా సాధువు మ‌రియు క‌వి శ్రీ క‌బీర్ కు సంత్ క‌బీర్ న‌గ‌ర్ లో శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

మహా సాధువు మ‌రియు క‌వి శ్రీ క‌బీర్ కు సంత్ క‌బీర్ న‌గ‌ర్ లో శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

మహా సాధువు మ‌రియు క‌వి శ్రీ క‌బీర్ కు సంత్ క‌బీర్ న‌గ‌ర్ లో శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి

మహా సాధువు మ‌రియు క‌వి శ్రీ క‌బీర్ కు సంత్ క‌బీర్ న‌గ‌ర్ లో శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని సంత్ క‌బీర్ న‌గ‌ర్ జిల్లా లో గ‌ల మ‌గ్ హ‌ర్ ను ఈ రోజు సంద‌ర్శించారు.

మ‌హా సాధువు మ‌రియు క‌వి శ్రీ క‌బీర్ 500వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా సంత్ క‌బీర్ స‌మాధి వ‌ద్ద ఆయ‌న పుష్పాంజ‌లి ని ఘటించారు. సంత్ క‌బీర్ మ‌జార్ వ‌ద్ద చాద‌ర్ ను కూడా స‌మ‌ర్పించారు. సంత్ క‌బీర్ గుహ‌ ను సంద‌ర్శించి, సంత్ క‌బీర్ ప్ర‌బోధాల‌ను మ‌రియు ఆలోచ‌న‌ల‌ను చాటి చెప్ప‌నున్న సంత్ క‌బీర్ అకాడెమీ కి శంకు స్థాప‌న సూచ‌కంగా ఒక ఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించారు.

ఒక జ‌న స‌భ లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, మ‌హా సాధువు శ్రీ క‌బీర్ కు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించ‌డం ద్వారా కొన్ని సంవ‌త్స‌రాలుగా త‌న లోపల ఉన్నటువంటి ఒక కోరిక నెర‌వేరింద‌ని తెలిపారు. సంత్ క‌బీర్, గురు నాన‌క్ ల‌తో పాటు బాబా గోర‌ఖ్‌ నాథ్ ఆధ్యాత్మిక చ‌ర్చ‌ లో పాలుపంచుకొన్న ప్ర‌దేశ‌మే మ‌గ్ హ‌ర్ అని చ‌రిత్ర చెబుతోంది.

దాదాపు 24 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మాణ‌మ‌య్యే సంత్ క‌బీర్ అకాడెమీ సంత్ క‌బీర్ యొక్క వార‌స‌త్వం, అలాగే ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ప్రాంతీయ మాండ‌లికాలు, ఇంకా జాన‌ప‌ద క‌ళ‌లను ప‌రిర‌క్షించేందుకు ఒక సంస్థ‌ ను ఏర్పాటు చేస్తుందని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

భార‌త‌దేశం యొక్క ఆత్మ సారానికి సంత్ క‌బీర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. సంత్ క‌బీర్ కులాల యొక్క అడ్డుగోడల‌ను ఛేదించారని, సామాన్యులు, గ్రామీణ భార‌తీయులు మాట్లాడే భాష‌ లో ఆయ‌న సంభాషించే వార‌ని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

భార‌త‌దేశం లోని వివిధ ప్రాంతాలలో ఆయా కాల‌ల‌కు అనుగుణంగా సాధువులు, సంతులు ఆవిర్భ‌వించి స‌ంఘం లోని చెడు ల‌ను పార‌దోల‌డంలో సమాజానికి మార్గ‌ాన్ని చూపారని ప్ర‌ధాన మంత్రి అన్నారు. భార‌త‌దేశం లోని వేరు వేరు ప్రాంతాల‌లో వివిధ శ‌కాల‌లో ఆవిర్భ‌వించిన సాధువుల పేర్ల‌ను ప్రధాన మంత్రి వల్లె వేస్తూ, ఈ క్రమంలో బాబా సాహెబ్ ఆంబేడ్క‌ర్ గురించి చెబుతూ భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క పౌరుడికీ రాజ్యాంగం ద్వారా స‌మాన‌త్వం ల‌భించేట‌ట్లుగా శ్రద్ధ వహించార‌ని పేర్కొన్నారు.

రాజ‌కీయ అవకాశ వాదానికి వ్య‌తిరేకంగా ప్ర‌ధాన మంత్రి ఒక బ‌ల‌మైన ప్ర‌క‌ట‌న‌ను చేస్తూ, ప్ర‌జ‌ల భావాల‌ను మ‌రియు బాధ‌ల‌ను అర్ధం చేసుకున్న వారే ఆద‌ర్శ‌ప్రాయ‌మైన పాల‌కులు అని పలికిన సంత్ క‌బీర్ ప్ర‌బోధాన్ని జ్ఞ‌ప్తికి తెచ్చారు. ప్ర‌జ‌ల మ‌ధ్య వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శించిన సామాజిక వ్య‌వ‌స్థ‌ల‌ను అన్నింటినీ సంత్ క‌బీర్ తూర్పార‌బ‌ట్టార‌ని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భంగా స‌మాజం లోని పేద‌లకు, అణ‌గారిన వ‌ర్గాల వారికి సాధిక‌రిత‌ ను ఇచ్చే కేంద్ర ప్ర‌భుత్వ వివిధ ప‌థ‌కాల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి చెప్పుకొచ్చారు. వీటిలో జ‌న్ ధ‌న్ యోజ‌న, ఉజ్జ్వ‌ల యోజ‌న‌, బీమా ప‌థ‌కాలు, మ‌రుగుదొడ్ల నిర్మాణం మ‌రియు ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌నాల బ‌దిలీ ల వంటివి ఉన్నాయి. ర‌హ‌దారులు, రైల్వేలు, ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్ ల వంటి వేరు వేరు అవ‌స్థాప‌న రంగాల‌లో పెరుగుద‌ల‌ను గురించి కూడా ఆయ‌న వివరించారు. భార‌త‌దేశం లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి ఫ‌లాల‌ను అందుకొనేట‌ట్లుగా కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

‘న్యూ ఇండియా’ యొక్క దార్శ‌నిక‌త‌కు ఒక స్వ‌రూపాన్ని ఇవ్వ‌డంలో స‌ంత్ క‌బీర్ ప్ర‌బోధాలు తోడ్ప‌డుతాయ‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

***