Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహా కుంభమేళా భారతదేశ నిత్య నూతన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, నమ్మకాన్ని, సామరస్యాన్ని పెంపొందించే ఉత్సవం: ప్రధానమంత్రి


మహా కుంభమేళా 2025 ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ లోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారుభారతీయ విలువలనుసంస్కృతిని ఆదరించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని శ్రీ మోదీ పేర్కొన్నారుమహా కుంభమేళా కాలానికి అతీతమైన భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందనినమ్మకాన్నిసామరస్యాన్ని పెంపొందించే ఉత్సవమని అన్నారు

భారతీయ విలువలుసంస్కృతిని ప్రేమించే కోట్లాది ప్రజలకు ఇది ఒక ప్రత్యేకమైన రోజు!  ప్రయాగరాజ్‌లో మహా కుంభ్ 2025 ప్రారంభం అయిందివిశ్వాసంభక్తిసంస్కృతుల పవిత్ర సంగమంలో అసంఖ్యాక ప్రజలను ఏకం చేస్తోందిమహా కుంభ్ భారతదేశ నిత్యమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూవిశ్వాసం సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది”.

ప్రయాగరాజ్‌లో అనేక మంది వచ్చి పుణ్యస్నానం చేసి ఆశీర్వాదాలు పొందుతుండటం చూసి నాకు ఆనందంగా ఉందిఈ ఆధ్యాత్మిక ఉత్సవం యాత్రికులకుపర్యాటకులకు అద్భుతమైన అనుభవం అందించాలని కోరుకుంటున్నాను”.  

పవిత్ర పుణ్యక్షేత్రమైన ప్రయాగ్ రాజ్ లో నేటి నుంచి పుష్య పౌర్ణమి సందర్భంగా పవిత్ర స్నానంతో మహా కుంభమేళా ప్రారంభమైందిమన విశ్వాసంసంస్కృతితో ముడిపడి ఉన్న ఈ దివ్య సందర్భంలో భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నానుభారతీయ ఆధ్యాత్మిక ఈ సంప్రదాయ గొప్ప పండుగ మీ జీవితాల్లో కొత్త శక్తిని ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు

 

***