Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్‌కు ప్రధానమంత్రి నివాళులు


మహావీర్ జయంతి ఈ రోజుఈ సందర్భంగా భగవాన్ మహావీర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారుభగవాన్ మహావీర్ సదా అహింసకూసత్యానికీకరుణకూ ప్రాధాన్యాన్నిచ్చారనీఆయన ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రజలకు శక్తిని ప్రసాదిస్తున్నాయనీ శ్రీ మోదీ అన్నారుప్రాకృత భాషకు ప్రభుత్వం కిందటేడాది ప్రాచీన భాష హోదాను ఇచ్చిందనీఈ నిర్ణయానికి ప్రశంసలు లభించాయనీ ఆయన అన్నారు.
‘‘
ఎక్స్‌’’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘
మనమందరం భగవాన్ మహావీర్‌కు ప్రణామం చేద్దాంఅహింససత్యంకరుణ ముఖ్యమని ఆయన చెప్పేవారుఆయన ఆదర్శాలు ప్రపంచమంతటా అసంఖ్యాక మంది ప్రజలకు శక్తినిస్తున్నాయిఆయన బోధనలను జైన సముదాయం చక్కగా సంరక్షించడంతోపాటు బహుళ ప్రజాదరణకు పాత్రమయ్యేటట్లు శ్రద్ధ వహించిందివారు భగవాన్ మహావీర్ నుంచి ప్రేరణను పొందిజీవనంలోని విభిన్న రంగాల్లో రాణించడమే కాకుండా సామాజిక శ్రేయానికి తమ వంతు తోడ్పాటును కూడా అందించారు.
భగవాన్ మహావీర్ కన్న కలలను నిజం చేయడానికి మా ప్రభుత్వం సదా కృషి చేస్తూ ఉంటుందికిందటి సంవత్సరంమేం ప్రాకృత భాషకు ప్రాచీన హోదాను ఇచ్చాం… ఈ నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి.’’‌

 

**‌*