Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహారాష్ట్ర పూర్వముఖ్య మంత్రి శ్రీ మనోహర్ జోశీ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


మహారాష్ట్ర పూర్వ ముఖ్య మంత్రి శ్రీ మనోహర్ జోశీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీ మనోహర్ జోశీ 2002 వ సంవత్సరం నుండి 2004 వ సంవత్సరం వరకు లోక్ సభ స్పీకర్ గా కూడా ఉన్నారు. మహారాష్ట్ర కు ముఖ్య మంత్రి గా శ్రీ మనోహర్ జోశీ రాష్ట్రం యొక్క ప్రగతి కై అలుపెరుగక కృషి చేశారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన పార్లమెంటరీ ప్రక్రియల ను మరింత చైతన్య భరితం అయినటువంటివి గా మరియు ఎక్కువ మంది సభ్యులు సభా కార్యకలాపాల లో పాలుపంచుకొనే విధం గా చూడడం కోసం శ్రీ మనోహర్ జోశీ లోక్ సభ స్పీకర్ గా తన పదవీ కాలం లో పాటుపడ్డారు అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

 

‘‘శ్రీ మనోహర్ జోశీ గారు కన్నుమూశారని తెలిసి దు:ఖించాను. ఆయన చిరకాల అనుభవం కలిగిన నేతల లో ఒకరు; ప్రజా సేవ లో ఆయన సంవత్సరాల తరబడి నిమగ్నం అయ్యారు; మరి మ్యూనిసిపల్ స్థాయి తో పాటు రాష్ట్ర స్థాయి లో, ఇంకా జాతీయ స్థాయి లో విభిన్నమైనటువంటి బాధ్యత లను నిర్వర్తించారు. మహారాష్ట్ర కు ముఖ్య మంత్రి గా రాష్ట్ర ప్రగతి కోసం ఆయన అలుపెరుగక శ్రమించారు. కేంద్ర మంత్రి గా గుర్తుంచుకోదగ్గ సేవల ను కూడా ఆయన అందించారు. లోక్ సభ కు స్పీకర్ గా ఆయన ఉన్న కాలం లో, మన పార్లమెంటరీ ప్రక్రియల ను మరింత హుషారైనటువంటివి గా, సభ కార్యకలాపాల లో ఎక్కువ మంది సభ్యులు భాగం పంచుకొనే విధం గా పాటుపడ్డారు. ఒక చట్ట సభ సభ్యుని గా ఆయన కనబరచినటువంటి శ్రద్ధ కు గాను మనోహర్ జోశీ గారి ని ఎప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. నాలుగు విధాలైన చట్ట సభల లో సేవల ను అందించిన గౌరవం ఆయన కు దక్కింది. ఆయన యొక్క కుటుంబాని కి మరియు ఆయన ను సమర్థించే వారికి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST