ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్రాయిచ్ లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. మహారాజా సుహేల్దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య కళాశాల భవనాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం చరిత్ర అంటే అది వలసవాద శక్తులు లేదా వలసవాద మనస్తత్వం కలిగి ఉన్న శక్తులు రాసిన చరిత్ర ఒక్కటే కాదని పేర్కొన్నారు. సామాన్య ప్రజానీకం జానపద గాథలలో పెంచి పోషించుకొంటూ వచ్చినటువంటి, తరాల తరబడి ముందుకు తీసుకుపోతున్నటువంటిదే భారతదేశ చరిత్ర అని ఆయన అన్నారు. భారతదేశం కోసం, భారతీయత కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన వారికి చరిత్ర పుస్తకాల లో ఇవ్వవలసినంత గౌరవాన్ని ఇవ్వడం జరుగలేదు అంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ అపసవ్యాలను, భారతదేశ చరిత్ర రచయిత ల ద్వారా దేశ చరిత్ర నిర్మాతల కు జరిగిన అన్యాయాన్ని మనం మన స్వాతంత్య్ర 75వ సంవత్సరం లోకి ప్రవేశించనున్న ఈ తరుణం లో ప్రస్తుతం సవరించడం జరుగుతున్నదని ఆయన అన్నారు. వారి తోడ్పాటు ను ఈ దశ లో గుర్తు కు తెచ్చుకోవడం అధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
తొలి ప్రధాని నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ తోడ్పాటు ను ఎర్ర కోట నుంచి అండమాన్ నికోబార్ వరకు ఘనం గా జరుపుకోవడం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని ఏర్పాటు చేయడం ద్వారా సర్ దార్ పటేల్ తోడ్పాటు ను స్మరించుకోవడం, ‘పంచ్ తీర్థ్’ ద్వారా డాక్టర్ ఆంబేడ్ కర్ తోడ్పాటు ను స్మరించుకోవడం వంటి ఉదాహరణల ను గురించి ప్రధాన మంత్రి తన ప్రసంగం లో ప్రస్తావించారు. ‘‘వేరు వేరు కారణాల వల్ల గుర్తింపునకు నోచుకోని వ్యక్తులు లెక్కించలేనంత మంది ఉన్నారు. చౌరీ చౌరా పరాక్రమశాలుల విషయం లో ఏమి జరిగిందో మనం మరచిపోగలమా?’’ అంటూ ప్రధాన మంత్రి ప్రశ్నించారు.
భారతీయత ను పరిరక్షించడానికి మహారాజా సుహేల్ దేవ్ అందించిన తోడ్పాటు ను సైతం అదే విధంగా అలక్ష్యం చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. పాఠ్య పుస్తకాల లో మహారాజా సుహేల్ దేవ్ ను అలక్ష్యం చేసినప్పటికీ కూడాను అవధ్, తరాయీ, పూర్వాంచల్ జానపద గాథల ద్వారా ఆయన ప్రజల మనస్సుల లో సజీవం గా కొలువుదీరి ఉన్నారన్నారు. ఒక సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి పాలకునిగా, అభివృద్ధి ప్రధానమైన దృష్టి కలిగినటువంటి పాలకునిగా ఆయన అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. మహారాజా సుహేల్ దేవ్ స్మారక చిహ్నం రాబోయే తరాల కు ప్రేరణ ను అందించగలదన్న ఆశభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. వైద్య కళాశాల ను ఏర్పాటు చేయడం, వైద్య సౌకర్యాల ను విస్తరించడం అనేవి ఈ ఆకాంక్షభరిత జిల్లా ప్రజల తో పాటు సమీప ప్రాంతాల ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయని ఆయన అన్నారు. మహారాజా సుహేల్ దేవ్ స్మారకార్థం ఒక స్టాంపు ను రెండు సంవత్సరాల కిందటే ప్రధాన మంత్రి విడుదల చేశారు.
బసంత్ పంచమి సందర్భం లో ప్రజల కు శ్రీమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వసంతం మహమ్మారి తాలూకు నైరాశ్యాన్ని వెనుక కు నెట్టివేసి, భారతదేశానికి కొత్త ఆశ ను తీసుకు వచ్చిందన్నారు. సరస్వతి మాత భారతదేశం లో జ్ఞానాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే పరిశోధనలు, నూతన ఆవిష్కరణల ద్వారా దేశ నిర్మాణం లో తలమునకలు గా ఉన్న ప్రతి ఒక్క పౌరుడి ని/ పౌరురాలిని దీవిస్తారన్న ఆకాంక్ష ను ఆయన వ్యక్తం చేశారు.
గడచిన కొన్ని సంవత్సరాల లో చరిత్ర, విశ్వాసం, ఆధ్యాత్మికత లకు సంబంధించి నిర్మాణం జరిగినటువంటి కట్టడాల అతి పెద్ద లక్ష్యమల్లా పర్యటన ను ప్రోత్సహించడమేనని ప్రధాన మంత్రి అన్నారు. అటు పర్యటనలు, ఇటు తీర్థయాత్ర ల పరంగా చూసినప్పుడు ఉత్తర్ ప్రదేశ్ సైతం సంపన్నమైందే, మరి దీని తాలూకు అవకాశాలు కూడా అనంతంగా ఉన్నాయి అని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటన రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు గాను భగవాన్ రాముడు, శ్రీ కృష్ణుడు, భగవాన్ బుద్ధుడు ల జీవనానికి సంబంధించిన స్థలాలైన అయోధ్య, చిత్రకూట్, మథుర, వృందావన్, గోవర్ధన్, కుశీనగర్, శ్రావస్తి మొదలైన ప్రదేశాల ను తీర్చిదిద్దుతూ, రామాయణ సర్క్యూట్, స్పిరిట్యువల్ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్ లను అభివృద్ధిపర్చడం జరుగుతోందన్నారు. ఈ ప్రయాస లు అన్నీ కూడా ఫలితాల ను ఇవ్వడం మొదలు పెట్టాయి, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి గరిష్ట సంఖ్య లో పర్యటకుల ను ఉత్తర్ ప్రదేశ్ ఆకట్టుకొంటోందన్నారు. విదేశీ యాత్రికుల ను ఆకర్షించడం లో దేశం లో అగ్రగామి మూడు రాష్ట్రాల సరసన ఉత్తర్ ప్రదేశ్ సైతం చేరింది అని ఆయన అన్నారు.
యాత్రికుల కు అవసరమైన సదుపాయాల తో పాటే అధునాతన సంధానాన్ని కూడా ఉత్తర్ ప్రదేశ్ లో అభివృద్ధిపర్చడం జరుగుతోందని ప్రధాన మంత్రి చెప్పారు. అయోధ్య విమానాశ్రయం, కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం రాబోయే కాలం లో ఇటు దేశీయ యాత్రికుల కు, అటు విదేశీ యాత్రికుల కు ఎంతో ఉపయోగకరం గా రుజువు చేసుకొంటాయి అని కూడా ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో చిన్న, పెద్ద విమానాశ్రయాలు కలుపుకొని డజను దాకా నిర్మాణం లో ఉన్నాయి, వాటిలో చాలా వరకు పూర్వాంచల్ లోనే ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు.
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే, బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్ వే, గంగా ఎక్స్‌ప్రెస్ వే, గోరఖ్ పుర్ లింక్ ఎక్స్‌ప్రెస్ వే, బలియా లింక్ ఎక్స్‌ప్రెస్ వే ల వంటి ఆధునికమైన, విశాలమైన రహదారుల ను ఉత్తర్ ప్రదేశ్ అంతటా నిర్మించడం జరుగుతోంది, ఇది ఒక రకం గా ఆధునిక ఉత్తర్ ప్రదేశ్ లో నవీన మౌలిక సదుపాయాల కల్పన కు ఆరంభమే అని ప్రధాన మంత్రి వివరించారు. రెండు పెద్ద డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లకు కూడలి గా ఉత్తర్ ప్రదేశ్ ఉందని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన ఈ రాష్ట్రం లో పరిశ్రమల ను నెలకొల్పడానికి ఇన్ వెస్టర్ లను ఉత్సాహపరిచిందన్నారు. దీనితో పరిశ్రమల కు, అదే మాదిరి గా యువత కు మెరుగైన అవకాశాలు అందించినట్లు అవుతోందని ఆయన అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కరోనా ను పరిష్కరించిన తీరు ను ప్రధాన మంత్రి కొనియాడారు. తిరిగి వచ్చిన శ్రామికుల కు ఉపాధి ని అందించినందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. గత మూడు, నాలుగేళ్ళు గా ఉత్తర్ ప్రదేశ్ చేస్తూ వచ్చిన ప్రయత్నాలు కరోనా కు వ్యతిరేకం గా కూడా ఎంతగానో తోడ్పడ్డాయి అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి కారణం గా పూర్వాంచల్ లో మెనింజైటిస్ సమస్య చాలా వరకు తగ్గిపోయిందన్నారు. గత ఆరు సంవత్సరాల లో ఉత్తర్ ప్రదేశ్ లో వైద్య కళాశాల ల సంఖ్య 14 నుంచి 24 కు పెరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. అంతేకాకుండా గోరఖ్ పుర్ లో, బరేలీ లో ఎఐఐఎమ్ఎస్ తాలూకు పనులు జరుగుతున్నాయన్నారు. ఇవి కాక 22 నూతన వైద్య కళాశాల ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. పూర్వాంచల్ కోసం వారాణసీ లో ఆధునిక కేన్సర్ ఆసుపత్రి సదుపాయాన్ని కూడా అందించడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్క కుటుంబాని కి మంచినీటి సరఫరా కై ఉద్దేశించిన యుపి జల్ జీవన్ మిశన్ సైతం ప్రశంసనీయమైనటువంటి కృషి ని కనబరుస్తోందన్నారు. శుద్ధమైన తాగునీరు ఇంటికి చేరుకొందీ అంటే గనక అది ఎన్నో రోగాల ను తగ్గిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
మెరుగైన విద్యుత్తు, నీరు, రోడ్లు, ఆరోగ్య సదుపాయాల ప్రత్యక్ష ప్రయోజనాన్ని ఉత్తర్ ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల కు చెందిన రైతులు, పేద ప్రజలు అందుకొంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు. ‘పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లో సుమారు 2.5 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల లో డబ్బు ను నేరు గా జమ చేయడం జరిగిందన్నారు. ఈ రైతు కుటుంబాలు ఒకప్పుడు ఒక బస్తా ఎరువు ను కొనడానికి కూడా ఇతరుల వద్ద నుంచి అప్పు ను తీసుకోక తప్పని స్థితి ఉండేది అని అయన చెప్పారు. సాగునీటి కోసం విద్యుత్తు ను వినియోగించుకోవడానికి ఇక్కడి రైతులు రాత్రంతా మేల్కొనివుండవలసి వచ్చేది అని ఆయన చెప్తూ, తన ప్రభుత్వం విద్యుత్తు సరఫరా ను మెరుగు పరచడం ద్వారా అలాంటి సమస్యల ను తీర్చివేసిందన్నారు.
వ్యవసాయ భూముల ను సుసంఘటితం చేయడానికి, దాని ద్వారా ఒక్కో రైతు సాగు చేసే ప్రాంతం కుంచించుకుపోయే సమస్య ను పరిష్కరించడానికి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్‌పిఒ స్) చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి చెప్పారు. 1- 2 బీఘా ల నేల ను కలిగివున్న 500 రైతు కుటుంబాలు సంఘటితం అయ్యాయంటే గనక అప్పుడు వారు 500- 1000 బీఘా భూమి కలిగిన రైతుల కంటే మరింత శక్తిమంతం అవుతారు అని ఆయన చెప్పారు. అదే విధం గా కాయగూరలు, పండ్లు, పాలు, చేపలు, ఇంకా ఆ తరహా అనేక వ్యాపారాలతో సంబంధం కలిగివున్న చిన్న రైతుల ను ప్రస్తుతం ‘కిసాన్ రైల్’ ద్వారా పెద్ద బజారుల తో జోడించడం జరుగుతోంది అని కూడా ఆయన చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ సంస్కరణ లు సైతం చిన్న రైతులకు, సన్నకారు రైతుల కు ప్రయోజనం కలిగించేవేనని, ఈ సాగు చట్టాల విషయం లో సకారాత్మకమైన ప్రతిస్పందన దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతోందని ఆయన అన్నారు.
వ్యవసాయ చట్టాల కు వ్యతిరేకంగా అన్ని రకాలైన తప్పుడు సమాచారం వ్యాప్తి లోకి వస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. విదేశీ కంపెనీల ను దేశం లోకి పిలిపించడం కోసం చట్టాల ను చేసిన వారు భారతీయ కంపెనీల పేరు తో రైతుల ను భయపెడుతున్నారు అని ఆయన అన్నారు. ఈ అసత్యాలు, ప్రచారం తాలూకు గుట్టు రట్టు అయింది అని అయన అన్నారు. కొత్త చట్టాల కు శాసన రూపం ఇచ్చిన తరువాత కిందటి సంవత్సరం తో పోల్చి చూసినప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో ధాన్య సేకరణ రెట్టింపు అయిందన్నారు. యోగి ప్రభుత్వం ఇప్పటికే ఒక లక్ష కోట్ల రూపాయల ను చెరకు రైతుల కోసం విడుదల చేసిందన్నారు. చక్కెర మిల్లుల కు రైతుల కు చెల్లింపులు చేసేందుకు వీలు గా రాష్ట్ర ప్రభుత్వాల కు వేల కొద్దీ కోట్ల రూపాయల ను కేంద్రం ఇచ్చిందన్నారు. చెరకు రైతుల కు సకాలం లో చెల్లింపు జరిగేటట్లు చూడటానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పాటుపడుతూనే ఉంటుంది అని ఆయన అన్నారు.
రైతు జీవితాన్ని, గ్రామీణ జీవితాన్ని మెరుగుపర్చడం కోసం సాధ్యమైన ప్రతి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది అంటూ ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. ‘స్వామిత్వ పథకం’ అనేది ఒక పల్లెవాసి ఇంటి ని చట్టవిరుద్ధం గా ఆక్రమించుకొనేందుకు అవకాశం లేకుండా చేస్తుంది అని ఆయన చెప్పారు. ఈ పథకం లో భాగంగా ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లోని దాదాపు 50 జిల్లాల లో డ్రోన్ ల ద్వారా సర్వేక్షణ లను నిర్వహించడం జరుగుతోందన్నారు. రమారమి 12 వేల గ్రామాల లో డ్రోన్ సర్వేక్షణ పని పూర్తయిందని, ఇంతవరకు2 లక్షల కు పైగా కుటుంబాలు సంపత్తి కార్డుల ను అందుకొన్నాయని, ఈ కుటుంబాలు ఇంకా అన్ని రకాలైన భయాల నుంచి విముక్తం అయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ కారణం గా రైతు కు చెందిన భూమి ని వ్యవసాయ సంస్కరణ చట్టాల ద్వారా అన్యాయం గా ఆక్రమించుకొంటార్న వదంతి ని ఎవరైనా ఎలా నమ్ముతారు అని ప్రధాన మంత్రి నొక్కి వక్కాణించారు. ప్రతి ఒక్క పౌరునికి/ పౌరురాలికి సాధికారిత ను కల్పించాలనేదే మా లక్ష్యం గా ఉంది. దేశాన్ని ‘ఆత్మనిర్భర్’ గా తీర్చిదిద్దాలనేది మా వాగ్ధానం గా ఉంది. మరి ఈ కార్య భారాన్ని నెరవేర్చడానికి మేము అంకితం అయ్యాం అని ఆయన అన్నారు. గోస్వామి తులసీదాస్ రచించిన రాంచరిత్ మానస్ లో నుంచి కొంత భాగాన్ని ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. ఆయన ఉదాహరించిన ఆ పంక్తుల కు అర్థం ఏమిటి అంటే.. సరి అయినటువంటి ఉద్దేశ్యం తో చేపట్టే పని ఏదైనా, మరి అలాగే ఒకరి హృదయం లో భగవాన్ రాముడు కొలువై ఉన్నారంటే, అప్పుడు ఆ కార్యం సఫలం అవుతుంది.. అని భావం.
****
A tribute to the great Maharaja Suheldev. https://t.co/emgua921lP
— Narendra Modi (@narendramodi) February 16, 2021
इतिहास की किताबों में भले ही महाराजा सुहेलदेव के शौर्य और पराक्रम को सही स्थान नहीं मिला, लेकिन पूर्वांचल की लोकगाथाओं में, लोगों के हृदय में वे हमेशा बने रहे।
— Narendra Modi (@narendramodi) February 16, 2021
इतिहास लिखने के नाम पर जो अन्याय किया गया, उसे अब आज का भारत सुधार रहा है, गलतियों से देश को मुक्त कर रहा है। pic.twitter.com/3DYDzVxrXx
उत्तर प्रदेश में जिस प्रकार आज आधुनिक इंफ्रास्ट्रक्चर पर काम चल रहा है, उससे राज्य में उद्योग लगाने के लिए देश और दुनिया के निवेशक उत्साहित हैं। pic.twitter.com/iGedgTwlwf
— Narendra Modi (@narendramodi) February 16, 2021
छोटे और सीमांत किसानों के जीवन में समृद्धि और खुशहाली लाने के लक्ष्य के साथ आज सरकार कृषि क्षेत्र में अनेक महत्वपूर्ण कार्य कर रही है। pic.twitter.com/n2BnbTEZNu
— Narendra Modi (@narendramodi) February 16, 2021