Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాత్మ జ్యోతిబా ఫులే కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి


గొప్ప సామాజిక సంస్కరణ వాది, దార్శనికుడు మరియు రచయిత అయిన మహాత్మ జ్యోతిబా ఫులే కు ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు. సామాజిక న్యాయం యొక్క గట్టి సమర్థకుడు గాను, అశేష ప్రజానీకాని కి ఆశాకిరణం గాను మహాత్మ ఫులే కు విస్తృతమైన ఆదరణ ఉంది; ఆయన సామాజిక సమానత్వం, మహిళ ల సశక్తీకరణ మరియు విద్య కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం అలుపెరుగక కృషి చేశారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి తన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో గొప్ప ఆలోచన పరుడు అయిన జ్యోతిబా ఫులే గారి ని గురించి తన భావాల ను వెల్లడి చేశారు. ఆ కార్యక్రమం లో మహాత్మ ఫులే బాలిక ల కోసం పాఠశాలల ను ప్రారంభించారని, అంతే కాక ఆడశిశు హత్యల కు వ్యతిరేకం గా గళమెత్తారని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నీటి ఎద్దడి పరిష్కారం అయ్యేందుకు ఉద్యమాల ను కూడా ఆయన నడిపారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో –

‘‘సామాజిక న్యాయం యొక్క గట్టి సమర్థకుడు గాను, అశేష ప్రజానీకాని కి ఆశాకిరణం గాను మహాత్మ ఫులే కు విస్తృతమైన ఆదరణ ఉంది; ఆయన యొక్క బహుపార్శ్వయుక్త వ్యక్తిత్వం మరియు ఆయన సామాజిక సమానత్వం, మహిళల సశక్తీకరణ, ఇంకా విద్య కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం అలుపెరుగక కృషి చేశారు. ఆయన జయంతి నాడు ఆయన కు ఇదే శ్రద్ధాంజలి.’’

‘‘ఈ రోజు న మహాత్మ ఫులే జయంతి; మరి కొన్ని రోజుల లోనే అంటే ఈ నెల 14వ తేదీ నాడు మనం అంబేడ్ కర్ జయంతి ని జరుపుకోనున్నాం. కిందటి నెల #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఇరువురికి శ్రద్ధాంజలి ని సమర్పించాను. మహాత్మ ఫులే మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్ కర్ లకు వారి మహత్తరమైనటువంటి తోడ్పాటు కు గాను భారతదేశం ఎప్పటికీ కృతజ్ఞతల ను తెలియజేసుకొంటూ ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.