Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాత్మా గాంధీ జయంతి నేపథ్యంలో ఆయనకు ప్రధానమంత్రి నివాళి


   హాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“గాంధీ జయంతి నేపథ్యంలో మహాత్మునికి శిరసాభివందనం చేస్తున్నాను. ఆయన నిత్యసత్యాలైన ఆయన ప్రబోధాలు మన మార్గంలో సదా వెలుగులు ప్రసరిస్తూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మహాత్ముని ప్రభావం ఐక్యత, కరుణల స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేలా యావత్‌ మానవాళికి సదా ఉత్తేజమిస్తుంది. ఆయన కలల సాకారానికి మనం అవిశ్రాంతంగా కృషి చేద్దాం. మహాత్ముడు కలలుగన్న మార్పువైపు పయనించేలా యువతలో ఐక్యత, సామరస్యాలను ప్రోది చేయడంలో ఆయన బోధనలు ఉత్ప్రేరకంగా నిలుస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST