Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహాత్మాగాంధీ పుణ్యతిథి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ,ఈ రోజు మహాత్మాగాంధీ పుణ్యతిథి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. అమరవీరుల దినం సందర్భంగా ప్రధానమంత్రి, దేశ రక్షణకు అసమాన ధైర్యసాహసాలతో పాటుపడుతూ అమరులైన వారందరికీ నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇస్తూ,

బాపూజీని వారి పుణ్యతిథి సందర్భంగా సంస్మరించుకుంటున్నాను.వారి మహోన్నత ఆశయాలను మనందరి సమష్ఠి క్రుషితో మరింత ప్రచారంలోకి తీసుకురావాలి. అలాగే ఈరోజు అమరవీరుల దినం.దేశ రక్షణకు అసమాన ధైర్యసాహసాలతో పాటుపడి అమరులైన వారందరికీ నివాళులర్పిస్తున్నాను. వారి సేవలు, వారి ధైర్యసాహసాలు ఎల్ల వేళలా స్మరించుకుంటాము అని ప్రధానమంత్రి తమ సందేశంలో తెలిపారు.

 

***

***

DS/SH