Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (ఎం.ఎస్.సి.ఎస్) చట్టం, 2002 కింద జాతీయ స్థాయి మల్టీ-స్టేట్ కో ఆపరేటివ్ ఎగుమతి సొసైటీ ఏర్పాటును ఆమోదించిన – కేంద్ర మంత్రివర్గం


గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఎం.సి.సి.ఎస్) చట్టం, 2002 కింద జాతీయ స్థాయి మల్టీస్టేట్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ సొసైటీని ఏర్పాటు చేసి, ప్రోత్సహించడానికి ఆమోదించింది. సంబంధిత మంత్రిత్వ శాఖల మద్దతుతో ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కేంద్ర వాణిజ్య శాఖ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖల ఎగుమతి సంబంధిత విధానాలు, పథకాలు, ఏజెన్సీల ద్వారా సహకార సంస్థలు, సంబంధిత సంస్థలు ఉత్పత్తి చేసే అన్ని వస్తువులు, సేవల ఎగుమతులను చేపట్టేందుకు మొత్తం ప్రభుత్వ విధానంను అనుసరించడం ద్వారా సొసైటీ ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

 

 

ఎగుమతులను నిర్వహించడానికి, ప్రోత్సహించడానికి ఒక అనుసంధాన సంస్థ గా పని చేయడం ద్వారా ప్రతిపాదిత సొసైటీ సహకార రంగం నుంచి ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ సహకార సంస్థల ఎగుమతి సామర్థ్యాన్ని వెల్లడించడంలో ఇది సహాయపడుతుంది. భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖల ఎగుమతులకు సంబంధించిన వివిధ పథకాలు, విధానాల ప్రయోజనాలనుమొత్తం ప్రభుత్వ విధానంద్వారా కేంద్రీకృత పద్ధతిలో పొందడంలో సహకార సంస్థలకు కూడా ప్రతిపాదిత సొసైటీ సహాయం చేస్తుంది. మెరుగైన ధరలను సాధించడం ద్వారా సభ్యులు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే సహకార సంఘాల సమ్మిళిత వృద్ధి నమూనా ద్వారా, అదేవిధంగా, వారి వస్తువులు, సేవల ఎగుమతి తో పాటు, సొసైటీ ద్వారా ఉత్పత్తి అయిన మిగులు నుంచి పంపిణీ చేసిన డివిడెండ్ ద్వారా, “సహకార్సేసమృద్ధిలక్ష్యాన్ని సాధించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

 

 

ప్రతిపాదిత సొసైటీ ద్వారా చేసి అధిక ఎగుమతులు వివిధ స్థాయిలలో సహకార సంస్థల ద్వారా వస్తువులు, సేవల ఉత్పత్తిని పెంచుతాయి, తద్వారా సహకార రంగంలో మరింత ఉపాధికి దారి తీస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వస్తువులను ప్రాసెస్ చేసి, సేవలను మెరుగుపరచడం ద్వారా కూడా అదనపు ఉపాధి లభిస్తుంది. సహకార రంగంలో ఉత్పత్తుల ఎగుమతి పెరిగితే, “మేక్ ఇన్ ఇండియాలక్ష్యం నెరవేరుతుంది. తద్వారా అది ఆత్మ-నిర్భర్-భారత్‌” కు దారి తీస్తుంది.

 

 

*****