Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మరో మైలురాయిని సాధించిన శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను అభినందించిన ప్రధానమంత్రి


మరో మైలు రాయిని సాధించినందుకు శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు. దేశీయంగా రూపుదిద్దుకున్న గుజరాత్లోని అతిపెద్ద, 700 ఎం.డబ్ల్యుఇ కక్రాపార్ అణువిద్యుత్ కేంద్రం
మూడో యూనిట్ పూర్తి సామర్థ్యంతో న కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెడుతూ, ‘‘ఇండియా మరో మైలు రాయిని అధిగమించింది.
దేశీయ పరిజ్ఞానంతో గుజరాత్ లో రూపుదిద్దుకున్న అతిపెద్ద 700 ఎం.డబ్ల్యు.ఇ కక్రాపార్ అణువిద్యుత్ ప్లాంట్ యూనిట్ 3 పూర్తి స్థాయి సామర్ధ్యంతో తన కార్యకలాపాలు ప్రారంభించింది.  ఇందుకు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నా అభినందనలు ”అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.

***