Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ తో ప్రధానమంత్రి సమావేశం


2019 నవంబర్ 3వ తేదీన జరిగే ఆసియన్ – భారత సదస్సు నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ అంగ్ సాన్ సూ కీ ని కలిశారు. ఇటీవల, 2017 సెప్టెంబర్ లో తమ మయాన్మార్ పర్యటనను, 2018 జనవరిలో ఆసియాన్- ఇండియా స్మారక సమ్మిట్ సందర్భంగా మయాన్మార్ స్టేట్ కౌన్స్ లర్ భారత దేశ పర్యటనను – ఇరువురు నాయకులు గుర్తు చేస్తుకుంటూ, రెండు దేశాల మధ్య కీలక భాగస్వామ్యంలో ప్రగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

భారతదేశం అనుసరిస్తున్న “లుక్ ఈస్ట్ విధానం” మరియు “నైబర్ హుడ్ ఫస్ట్ విధానం” లలో భాగస్వామిగా ఉన్న మయన్మార్ పట్ల భారతదేశ ప్రాధాన్యతను ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా, రహదారులు, నౌకాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణంతో సహా, మయన్మార్ కు మయన్మార్ ద్వారా ఆగ్నేయాసియా దేశాలకు భౌతికంగా రాకపోకల మెరుగుదలకు భారత దేశ నిరంతర నిబద్దతను ఆయన నొక్కి చెప్పారు. మయాన్మార్ కు చెందిన పోలీసు, సైనిక, పౌర అధికారులు, ఉద్యోగులతో పాటు, ఆదేశ విద్యార్థులు, పౌరుల సామర్ధ్య విస్తరణకు భారతదేశం తన మద్దతు కూడా కొనసాగిస్తుంది. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు భాగస్వామ్య పునాదులు విస్తరించడంలో సహాయపడతాయనీ, అందువల్ల ఇరుదేశాల మధ్య విమాన మార్గాల అనుసంధానాన్ని స్వాగతిస్తున్నామనీ, కంబోడియా, లాయోస్, మయన్మార్, వియత్నామ్ లతో కూడిన సి ఎల్ ఎమ్ వి కూటమి కోసం భారత ప్రభుత్వం 2019 నవంబర్ లో యాంగన్ లో ఒక వ్యాపార కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రణాళికతో సహా మయన్మార్ లో భారతీయ వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుందనీ ఇద్దరు నాయకులు అంగీకరించారు.

భారతదేశంతో భాగస్వామ్యానికి తమ ప్రభుతం ఇచ్చిన ప్రాముఖ్యాన్ని స్టేట్ కౌన్స్ లర్ డా సూ కెయి పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్య విస్తరణకు అందిస్తున్న నిరంతర మద్దత్తు అందిస్తున్నందుకు, మయాన్మార్ లో అభివృద్ధిని బలపరుస్తున్నందుకు ఆమె భారతదేశాన్ని ప్రశంసించారు.

తమ భాగస్వామ్య నిరంతర విస్తరణకు సరిహద్దులో స్థిరమైన, శాంతియుత పరిస్థితులు ఒక ముఖ్యమైన భూమికను పోషిస్తాయని ఇరువురు నాయకులు అంగీకరించారు. భారత-మయన్మార్ సరిహద్దులో తిరుగుబాటుదారులు చొరబడడానికి అవకాశం లేకుండా మయాన్మార్ అందజేస్తున్న సహకారానికి భారతదేశం ఇస్తున్న విలువను ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

ముందుగా తయారుచేసిన 250 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ గృహాలు నిర్మించే భారతదేశ మొట్ట మొదటి ప్రాజెక్ట్ పూర్తి చేసి, వాటిని ఈ జులై నెలలో మయన్మార్ ప్రభుత్వానికి అందజేసిన అనంతరం, రఖినే లో పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ – ఈ రాష్ట్రంలో మరిన్ని సామాజిక, ఆర్ధిక ప్రాజెక్టులు చేపట్టడానికి భారతదేశ సన్నద్ధతను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. నిరాశ్రయులైన వారు బంగ్లాదేశ్ నుండి త్వరగా, సురక్షితంగా, స్థిరంగా తిరిగి రఖినీ లోని వారి ఇళ్లకు రావడం, ఆ ప్రాంతం ప్రయోజనాలు, నిరాశ్రయులైన ప్రజల ప్రయోజనాలు, మూడు పొరుగు దేశాలైన భారతదేశం, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల ప్రయోజనాల కోసమేనని, ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

ఇరుదేశాల ప్రాధమిక ప్రయోజనాల కోసం, సహకారానికి దోహదపడే అన్ని విషయాలలో పటిష్టమైన సంబంధాలను గుర్తించి, వచ్చే ఏడాదిలో ఉన్నత స్థాయి సంప్రదింపుల వాతావరణాన్ని కొనసాగించాలని ఇద్దరు నాయకుల అంగీకరించారు.