Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లాయింగ్‌తో ప్రధానమంత్రి భేటీ

మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లాయింగ్‌తో ప్రధానమంత్రి భేటీ


బ్యాంకాక్‌లో ఈ రోజు బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లాయింగ్‌తో  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఇటీవల సంభవించిన భూకంపం సృష్టించిన విధ్వంసం పట్ల శ్రీ మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో మయన్మార్ సోదర, సోదరీమణులకు భారత్ తరఫున సాయాన్ని అందిస్తామంటూ మరో సారి హామీనిచ్చారు. భారతదేశం, మయన్మార్ ద్వైపాక్షిక సంబంధాలపై, ముఖ్యంగా సంధాన రంగం, సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన రంగంతో పాటు మరిన్ని రంగాలలో రెండు దేశాల సంబంధాలపై నేతలిద్దరూ చర్చించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘బ్యాంకాక్‌లో బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లాయింగ్‌‌తో నేను సమావేశమయ్యాను. మయన్మార్‌లో ఇటీవల భూకంపం సంభవించిన కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లినందుకు మరోసారి నా సంతాపాన్ని తెలియజేశాను. ఈ కష్ట కాలంలో మయన్మార్‌లోని సోదర, సోదరీమణులకు అండగా నిలబడడానికి భారత్ శాయశక్తులా సాయపడుతోంది.

మేం భారత్, మయన్మార్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై, ముఖ్యంగా సంధానం, సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన రంగంతోపాటు మరిన్ని రంగాల్లో రెండు దేశాల సంబంధాలపై కూడా చర్చించాం’’ అని పేర్కొన్నారు.

***