Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మయన్మార్‌, థాయిలాండ్‌లలో భూకంపం ఆందోళన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి


 

మయన్మార్థాయిలాండ్‌లలో ఈ రోజు ఉదయం పెను భూకంపం సంభవించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విపత్తు వల్ల ప్రభావితులైన వారి భద్రతక్షేమం కోసం ఆయన ప్రార్థించారుఈ కఠిన సమయంలో మయన్మార్థాయిలాండ్‌ ప్రభుత్వాలకుప్రజలకు అన్ని విధాలుగా సహాయాన్ని అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన హామీనిచ్చారు.
 

‘‘ఎక్స్‌’’లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘నేను మయన్మార్థాయిలాండ్‌లలో వచ్చిన భూకంపం పట్ల ఆందోళన చెందుతున్నానునేను అందరి భద్రతక్షేమం కోసం ప్రార్థిస్తున్నానుభారత్ అన్ని విధాలుగా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందిఈ విషయంలో సర్వసన్నద్ధంగా ఉండాల్సిందిగా మా అధికారులకు సూచించాంమయన్మార్థాయిలాండ్ ప్రభుత్వాలతో మాట్లాడాల్సిందిగా విదేశాంగ శాఖను ఆదేశించాను’’ అని ఆ సందేశంలో పేర్కొన్నారు.‌

 

 

***

MJPS/SR