మిత్రులారా! కరోనాకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటం నిజంగా ప్రజలే నడిపించిన పోరాటం. భారతదేశంలో, ప్రజలు కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మీరు పోరాడుతున్నారు. శాసన వ్యవస్థ, పరిపాలనా యంత్రాంగం ప్రజలతో కలిసి పోరాడుతున్నాయి. అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న భారతదేశం వంటి పెద్ద దేశం పేదరికంతో నిర్ణయాత్మక పోరాటం చేస్తోంది. కరోనాతో పోరాడటానికి, గెలవడానికి దేశానికి ఈ ఏకైక మార్గమే ఉంది. ఈ రోజు, మొత్తం దేశం – దేశంలోని ప్రతి పౌరుడు, ప్రజలు, ఈ పోరాటంలో సైనికులుగా పాల్గొనడం, పోరాటానికి నాయకత్వం వహించడం మన అదృష్టం. మీరు ఎక్కడ పరిశీలించినా భారతదేశం చేసే యుద్ధం ప్రజలే నడిపిస్తున్న యుద్ధమని గ్రహిస్తారు. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విషయంలో చర్చ జరిగితే, ఈ పోరాటంలో పద్ధతులపై చర్చ జరిగితే, ప్రజలే నడిపిస్తోన్న భారతదేశం చేస్తున్న ఈ పోరాటం ఖచ్చితంగా చర్చకు వస్తుందని నేను నమ్ముతున్నాను. దేశవ్యాప్తంగా ప్రతిచోటా ప్రజలు ఒకరికొకరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పేదలకు ఆహారం, రేషన్ సదుపాయం, లాక్డౌన్ వ్యవస్థలో పాటించాల్సిన విధానాలు , ఆస్పత్రులు ఏర్పాటు, వైద్య పరికరాలను దేశంలో తయారు చేసే అంశం మొదలైన అనేక విషయాల్లో ఈరోజు దేశం మొత్తం ఒక లక్ష్యం, ఒక దిశ వెంట కలిసిమెలిసి వెళ్తోంది. చప్పట్లు, గంటలు, దీపం, కొవ్వొత్తి – ఇవన్నీ నవీన ఆలోచనలకు తావిచ్చాయి. ఈ విషయాల్లో ప్రజలు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాల్లో ఇతరులకు స్ఫూర్తినిచ్చారు. నగరమైనా, గ్రామమైనా – దేశంలో ఒక భారీ మహా యజ్ఞం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరూ సహకరించడానికి ఆసక్తిగా ఉన్నారు. మన రైతు సోదరులు, సోదరీమణులను చూడండి – ఒక వైపు, ఈ అంటువ్యాధి ప్రబలుతున్నా పగలు, రాత్రి తమ పొలాలలో కష్టపడి పనిచేస్తున్నారు. మరోవైపు ఆకలితో దేశంలో ఎవరూ నిద్రపోకూడదని కూడా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. కొందరు అద్దె మాఫీ చేస్తుంటే, మరికొందరు తమ పెన్షన్ లేదా ఇతరత్రా వచ్చిన డబ్బును PM CARES లో జమ చేస్తున్నారు. పొలంలోని అన్ని కూరగాయలను కొందరు దానం చేస్తున్నారు. మరికొందరు ప్రతిరోజూ వందలాది మంది పేద ప్రజలకు ఉచితంగా ఆహారం ఇస్తున్నారు. కొందరు మాస్కులు తయారు చేస్తున్నారు. కొందరు కూలీ సోదరులు, సోదరీమణులు తాము నిర్బంధంలో భాగంగా బస చేస్తున్న పాఠశాలకు రంగులు వేస్తున్నారు.
మిత్రులారా! ఇతరులకు సహాయం చేయడానికి మీలో- మీ హృదయం లోని ఏ మూలలోనైనా ఉన్న ఈ భావోద్వేగమే కరోనాకు వ్యతిరేకంగా, భారతదేశం చేసే ఈ పోరాటానికి బలాన్ని ఇస్తోంది. ఈ భావనే ఈ పోరాటాన్ని ప్రజలే నడిపించేలా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో ఇది ఒక మానసిక స్థితిగా మారి బలపడుతోంది. కోట్లాది ప్రజలు గ్యాస్ సబ్సిడీని వదిలివేయడం, లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు రైల్వే సబ్సిడీని వదిలివేయడం, స్వచ్ఛ భారత్ అభియాన్ నాయకత్వాన్ని తీసుకోవడం, మరుగుదొడ్లు నిర్మించడం వంటివి – ఇలాంటి లెక్కలేనన్ని విషయాలు మన మనస్సును దృఢంగా చేస్తాయి. దేశం కోసం ఏదైనా చేయటానికి ప్రేరణగా నిలుస్తాయి.
నా ప్రియమైన దేశవాసులారా! 130 కోట్ల మంది దేశవాసుల ఈ మనోభావానికి తల వంచి నమస్కరిస్తున్నాను. మీ ఆలోచన ప్రకారం, దేశం పట్ల మీకున్న ఆసక్తి మేరకు, మీ సమయానుసారం మీరు ఏదైనా చేసేందుకు వీలుగా ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా సిద్ధం చేసింది. ఈ వేదిక – covidwarriors.gov.in . మరోసారి చెప్తుుున్నాను – covidwarriors.gov.in | ఈ వేదిక ద్వారా ప్రభుత్వం అన్ని సామాజిక సంస్థల వాలంటీర్లను, పౌర సమాజ ప్రతినిధులను, స్థానిక పరిపాలనను అనుసంధానించింది. చాలా తక్కువ సమయంలో, 125 మిలియన్ల మంది ఈ పోర్టల్‌లో చేరారు. డాక్టర్, నర్సుల నుండి మన ASHA, ANM సోదరీమణులు, NCC, NSS భాగస్వాములు, వివిధ రంగాలకు చెందిన నిపుణులందరూ ఈ వేదికను తమ వేదికగా చేసుకున్నారు. ఈ వ్యక్తులు స్థానికంగా సంక్షోభ నివారణ ప్రణాళికలను రూపొందించడంలో, అమలు చేయడంలో చాలా సహాయం చేస్తున్నారు. మీరు కూడా covidwarriors.gov.in లో చేరి దేశానికి సేవ చేయవచ్చు. కోవిడ్ వారియర్ కావచ్చు.
మిత్రులారా! ప్రతి కష్టమైన పరిస్థితి, ప్రతి పోరాటం, కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. కొన్ని అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. కొన్ని గమ్యాలకు దిశానిర్దేశం చేస్తుంది. ఈ పరిస్థితిలో దేశవాసులందరూ చూపించిన సంకల్ప శక్తితో భారతదేశంలో కూడా కొత్త మార్పు ప్రారంభమైంది. మన వాణిజ్యం, మన కార్యాలయాలు, మన విద్యాసంస్థలు, మన వైద్య రంగం… ఇలా ప్రతి ఒక్కరూ కొత్త సాంకేతిక మార్పుల వైపు వేగంగా కదులుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో దేశంలోని ప్రతి ఆవిష్కర్త కొత్త పరిస్థితులకు అనుగుణంగా నవ నిర్మాణం చేస్తున్నట్టు అనిపిస్తుంది.
మిత్రులారా! దేశం ఒక జట్టుగా పనిచేసినప్పుడు లభించే ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రతి విభాగం, ప్రతి సంస్థ సమన్వయంతో ఉపశమనం కోసం పూర్తి వేగంతో పనిచేస్తున్నాయి. వైమానిక సిబ్బంది, రైల్వే ఉద్యోగులు రాత్రింబగళ్లు కష్టపడుతున్నారు. తద్వారా దేశవాసుల సమస్యలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ‘లైఫ్‌లైన్ ఉడాన్” అనే ప్రత్యేక పథకం ద్వారా దేశంలోని ప్రతి ప్రాంతానికి మందులను పంపిణీ చేస్తున్నట్టు మీలో చాలా మందికి తెలుసు. వైమానిక ఉద్యోగులు ఇంత తక్కువ సమయంలోనే దేశంలోని మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, దేశంలోని ప్రతి మూల మూలలో
కూ 500 టన్నులకు పైగా వైద్య సామాగ్రిని మీకు రవాణా చేశారు. అదేవిధంగా, రైల్వే సహచరులు కూడా నిరంతరం లాక్డౌన్లో పనిచేస్తున్నారు. తద్వారా దేశంలోని సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తున్నారు. ఈ పని కోసం భారతీయ రైల్వే 60 కి పైగా రైల్వే మార్గాల్లో 100 కి పైగా పార్శిల్ రైళ్లను నడుపుతోంది. అదేవిధంగా మన పోస్టల్ విభాగం వారు మందుల సరఫరాలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మన ఈ సహచరులందరూ నిజమైన కరోనా యోధులు.
మిత్రులారా! ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ‘ కింద, డబ్బును నేరుగా పేదల ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ‘వృద్ధాప్య పెన్షన్‘ మంజూరైంది. పేదలకు మూడు నెలల ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఈ పనులన్నిటిలో ప్రభుత్వంలోని వివిధ విభాగాల సిబ్బంది, బ్యాంకింగ్ రంగానికి చెందిన ఉద్యోగులు ఒక జట్టులాగా పగలు, రాత్రి పని చేస్తున్నారు. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాయని నేను ప్రశంసిస్తున్నాను. కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో స్థానిక పరిపాలన యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ప్రముఖమైనది. వారి కృషి ప్రశంసనీయం.
నా ప్రియమైన దేశ వాసులారా! దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలతో సంబంధం ఉన్న వారు ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్‌లో, కరోనా యోధులపై హింస, వేధింపులు, వారికి ఏదైనా రూపంలో గాయాలకు వ్యతిరేకంగా కఠినమైన శిక్ష విధించే నిబంధన ఉంది. దేశాన్ని కరోనా రహితంగా మార్చడానికి పగలు, రాత్రి పనిచేస్తున్న మన వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, సమాజ ఆరోగ్య కార్యకర్తలు మొదలైనవారిని రక్షించడానికి ఈ చర్య చాలా ముఖ్యమైనది.
నా ప్రియమైన దేశవాసులారా! మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో మన జీవితాన్ని, సమాజాన్ని, మన దగ్గర జరుగుతున్న సంఘటనలను తాజా కోణం నుండి చూసే అవకాశం లభించిందని మనమందరం భావిస్తున్నాం. సమాజ వైఖరిలో పెద్ద మార్పు జరిగింది. మన జీవితంతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి ప్రాముఖ్యత ఈరోజు మనకు తెలుసు. మన ఇళ్లలో పనిచేసే వ్యక్తులు, మన అవసరాలను తీర్చడానికి పనిచేసే సాధారణ కార్మికులు, పొరుగు దుకాణాలలో పనిచేసే వ్యక్తులు… మొదలైనవారి ప్రాముఖ్యతను అనుభవిస్తున్నాం. అదేవిధంగా అత్యవసర సేవలను అందించే వ్యక్తులు, అంగళ్లలో పనిచేసే మన సోదర సోదరీమణులు, మన పరిసరాల్లోని ఆటో డ్రైవర్లు, రిక్షా నడిపేవారు – వీరు లేకుండా మన జీవితం ఎంత కష్టమవుతుందో ఈ రోజు మనం అనుభవిస్తున్నాము.
ఈ రోజుల్లో లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో ప్రజలు తమ ఈ తోటివారిని జ్ఞాపకం చేసుకోవడమే కాదు – వారి గురించి ఎంతో గౌరవంగా రాస్తున్నారు. శుభ్రపరిచే కార్మికులపై ప్రజలు పూలు కురిపించే దృశ్యాలు దేశంలోని ప్రతి మూల నుండి వస్తున్నాయి. ఇంతకుముందు, మీరు బహుశా వారి పనిని కూడా గమనించలేదు. వారు వైద్యులు, స్వీపర్లు, ఇతర సేవా వ్యక్తులు కావచ్చు. ఇది మాత్రమే కాదు, మన పోలీసు వ్యవస్థ గురించి సామాన్య ప్రజల ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు, పోలీసుల గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రతికూలత తప్ప మరేమీ చూడలేకపోయేవాళ్ళం. ఈ రోజు మన పోలీసులు పేదలకు, అవసరాల్లో ఉన్న వారికి ఆహారం, మందులు ఇస్తున్నారు. సహాయం కోసం పోలీసులు వస్తున్న విధానం, POLICING లోని మానవ మరియు సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించింది. మన మనస్సును కదిలించింది, మన హృదయాన్ని తాకింది. సామాన్య ప్రజలు భావోద్వేగ రీతిలో పోలీసులతో నిమగ్నమయ్యే సందర్భం ఏర్పడింది. పోలీసులు దీనిని ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నారు. ఈ సంఘటనలు రాబోయే కాలంలో చాలా సానుకూల మార్పును తీసుకురాగలవన్న నమ్మకం నాకుంది. మనం ఎప్పుడూ ఈ సకారాత్మకతకు ప్రతికూల రంగులు అద్దవద్దు
మిత్రులారా! మనం తరచూ వింటుంటాం – ప్రకృతి, వక్రీకరణ, సంస్కృతి. ఈ పదాలను కలిసి చూడండి. దాని వెనుక ఉన్న భావోద్వేగాన్ని చూడండి. అప్పుడు మీరు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలు చూస్తారు. మనం మానవ స్వభావం గురించి మాట్లాడితే, ‘ఇది నాది‘, ‘నేను ఉపయోగిస్తాను‘ అనే భావన చాలా సహజంగా పరిగణించబడుతుంది. దీనీపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. మనం దానిని ‘ప్రకృతి‘ అని పిలవవచ్చు. కానీ ‘నాది కాదు‘, ‘నాకు అర్హత లేనిది‘ అనే వస్తువును మరొకరి నుండి లాక్కొని వాడతాను అనుకోవడం వికృతి.. ఈ రెండింటికి మించి, ప్రకృతి మరియు వక్రబుద్ధికి పైన, ఒక సంస్కృతి ఉంటుంది. మనస్సుతో ఆలోచించినప్పుడు లేదా ప్రవర్తించినప్పుడు, మనం ‘సంస్కృతి‘ని చూస్తాము. ఎవరైనా తన హక్కును, కష్టపడి సంపాదించిన వస్తువును, తనకు అవసరమైనదాన్ని మరొకరితో పంచుకోవడం, ఇతరుల అవసరాన్ని నెరవేర్చడం ‘సంస్కృతి‘. మిత్రులారా! కష్ట కాలంలోనే ఈ లక్షణాలు పరీక్షించబడతాయి.
మన విలువలకు అనుగుణంగా, మన సంస్కృతికి అనుగుణంగా భారతదేశం కొన్ని నిర్ణయాలు తీసుకుందని మీరు ఇటీవల చూసారు. సంక్షోభం ఉన్న ఈ సమయంలో మందుల అవసరం ప్రపంచంలో వివిధ దేశాలతో పాటు ధనిక దేశాలకు చాలా ఉంది. భారతదేశం ప్రపంచానికి మందులు ఇవ్వకపోతే, భారతదేశాన్ని ఎవరూ తప్పు పట్టరు. భారత దేశం ప్రాధాన్యత దాని పౌరుల ప్రాణాలను కాపాడటం అని ప్రతి దేశం అర్థం చేసుకుంటుంది. కానీ మిత్రులారా, భారతదేశం ప్రకృతి, వికృతిల ఆలోచనాధోరణికి మించి ఉండాలని నిర్ణయించుకుంది. భారతదేశం తన సంస్కృతి ప్రకారం నిర్ణయించింది. మేము భారతదేశ అవసరాల కోసం మా ప్రయత్నాలను పెంచడమే కాక, ప్రపంచం నలుమూలల నుండి వస్తున్న మానవాళిని రక్షించాలన్న పిలుపుపై కూడా పూర్తి దృష్టి పెట్టాము. ప్రపంచంలోని పేదలందరికీ మందులు అందజేయడానికి మేము చొరవ తీసుకున్నాం. మానవత్వం ప్రదర్శించాం. ఈ రోజు, నేను చాలా దేశాల అధిపతులతో ఫోన్లో మాట్లాడినప్పుడు, వారు ఖచ్చితంగా భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ ప్రజలు ‘థాంక్యూ ఇండియా, థాంక్స్ పీపుల్ ఆఫ్ ఇండియా’ అని చెప్పినప్పుడు, దేశానికి గర్వం పెరుగుతుంది. అదేవిధంగా, భారతదేశ ప్రజలు ఆయుర్వేదం, యోగాకు ఇచ్చే ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రత్యేకమైన రీతిలో చూస్తున్నారు. సోషల్ మీడియాలో చూడండి, ప్రతిచోటా రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి, ఆయుర్వేదం, భారతదేశ యోగా ఎలా చర్చించబడుతున్నాయి. కరోనా దృష్టికోణంలో, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సందేశాన్ని, మీరు ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన వేడి నీరు, కషాయాలను, ఇతర మార్గదర్శకాలను మీరు మీ దినచర్యలో చేర్చుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది.
మిత్రులారా, మన స్వంత శక్తులను, గొప్ప సంప్రదాయాన్ని గుర్తించడానికి మనం చాలాసార్లు నిరాకరించడం దురదృష్టం. ప్రపంచంలోని ఏ ఇతర దేశమైనా సాక్ష్యం ఆధారిత పరిశోధనల ఆధారంగా ఇదే పని చేసినప్పుడు. మన స్వంత ఫార్ములా మనకు బోధిస్తే, దాన్ని ఆచరిస్తాం. బహుశా, దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది – వందల సంవత్సరాల మన బానిసత్వం దీనికి కారణం. ఈ కారణంగా కొన్నిసార్లు మన స్వంత శక్తిని మనం నమ్మము. మన విశ్వాసం తక్కువగా కనిపిస్తుంది. అందువల్ల, మన దేశంలోని మంచి విషయాలను, మన సాంప్రదాయ సూత్రాలను పరిశోధనలు నిర్వహించే బదులు విస్మరిస్తాము, అవి హీనంగా కనిపిస్తాయి. భారతదేశ యువ తరం ఈ సవాలును స్వీకరించాలి. ప్రపంచం యోగాను సంతోషంగా అంగీకరించినట్లే, వేలాది సంవత్సరాల నాటి మన ఆయుర్వేద సూత్రాలను ప్రపంచం అంగీకరిస్తుంది. అవును! దీని కోసం, యువ తరం ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ప్రపంచానికి అర్ధమయ్యే శాస్త్రీయ భాషలోనే మనం వివరించాలి. ఏదైనా చేసి చూపించాలి.
మిత్రులారా! కోవిడ్ –19 కారణంగా మన పని విధానం, మన జీవన విధానం, మన అలవాట్లలో చాలా సానుకూల మార్పులు సహజంగా జరుగుతున్నాయి. మీరు కూడా గ్రహించి ఉంటారు. ఈ సంక్షోభం మన అవగాహనను, వివిధ అంశాలపై మన చైతన్యాన్ని మేల్కొల్పింది. మన చుట్టూ మనం చూస్తున్న ప్రభావం మొదట – మాస్క్ ధరించి, ముఖాన్ని కప్పి ఉంచడం. కరోనా కారణంగా, మారుతున్న స్థితిలో మాస్క్ కూడా మన జీవితంలో భాగమవుతోంది. మన చుట్టూ ఉన్న చాలామందిని మాస్క్ లో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఇప్పుడు ఇదే జరుగుతోంది. అవును! మాస్క్ ఉపయోగించే వారందరూ అనారోగ్యంతో ఉన్నారని దీని అర్థం కాదు. నేను దీని గురించి మాట్లాడేటప్పుడు పాత విషయాలు గుర్తొస్తాయి. మీరందరూ కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఎవరైనా పండ్లు కొంటున్నట్లు కనిపిస్తే, చుట్టుపక్కల ప్రజలు ఖచ్చితంగా అడిగేవారు – ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అని. అంటే, పండును అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే తింటారనే నమ్మకం ఉండేది. అయితే, కాలం మారిపోయింది. ఈ అవగాహన కూడా మారిపోయింది. అదేవిధంగా మాస్క్ పై అవగాహన ఇప్పుడు మారబోతోంది. మీరు చూస్తారు. మాస్క్ ఇప్పుడు నాగరిక సమాజానికి చిహ్నంగా మారుతుంది. మీరు అనారోగ్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవలసి వస్తే, ఇతరులను కూడా కాపాడటానికి, మీరు ముసుగు ధరించాలి. ముఖాన్ని కప్పుకోవాలి.
మిత్రులారా! బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల కలిగే హాని ఏమిటో ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయంలో మన సమాజంలో మరో పెద్ద అవగాహన వచ్చింది. ఎక్కడైనా ఉమ్మివేయడం తప్పు అలవాట్లలో ఒక భాగం. ఇది పరిశుభ్రతకు, ఆరోగ్యానికి తీవ్రమైన సవాలుగా ఉంది. ఒక విధంగా, ఈ సమస్య గురించి మనకు ఎప్పటినుంచో తెలుసు, కానీ, ఈ సమస్య సమాజాన్ని అంతం చేసే స్థాయిని గతంలో చేరలేదు. ఇప్పుడు ఈ చెడు అలవాట్లను దూరం చేసేందుకు సరైన సమయం. “ఎన్నడూ చేయకపోవడం కంటే ఆలస్యం ఉత్తమం” అని కూడా అంటారు. కాబట్టి, ఆలస్యం కావచ్చు, కానీ, ఇప్పుడు, ఈ ఉమ్మివేయడమనే అలవాటును వదిలివేయాలి. ఈ విషయాలు ప్రాథమిక పరిశుభ్రత స్థాయిని పెంచుతాయి. కరోనా కూడా సంక్రమణ చెందకుండా నిరోధించడానికి సహాయపడతాయి.
నా ప్రియమైన దేశవాసులారా, ఈ రోజు నేను మీతో ‘మన్ కీ బాత్‘ గురించి మాట్లాడుతున్నప్పుడు, అక్షయ-తృతీయ పవిత్ర పర్వదినం కూడా ఉంది. మిత్రులారా, ‘క్షయం‘ అంటే విధ్వంసం. ఎప్పటికీ నాశనం కానిది, అంతం కానిది అక్షయం. . మనమందరం ఈ పండుగను ప్రతి సంవత్సరం మన ఇళ్లలో జరుపుకుంటాం.. కాని ఈ సంవత్సరం దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నేటి కష్ట సమయాల్లో, మన ఆత్మ, మన భావన అక్షయమని గుర్తుచేసే రోజు ఇది. ఈ రోజు మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని వ్యాధులు ఎదుర్కోవలసి వచ్చినా – వాటితో పోరాటం కొనసాగుతుందని గుర్తుచేస్తుంది. కృష్ణుడు, సూర్యదేవుడి ఆశీర్వాదాలతో పాండవులు అక్షయ పాత్ర పొందిన రోజు ఇది అని నమ్ముతారు. అక్షయ పాత్ర అంటే ఆహారం ఎప్పటికీ ముగియని పాత్ర. మన అన్నదాతలు రైతులు ఈ పరిస్థితిలో దేశం కోసం, మనందరి కోసం, ఈ స్ఫూర్తితో కృషి చేస్తారు. వారి కృషి కారణంగా ఈ రోజు మనందరికీ- దేశంలో పునరుత్పాదక ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా మన జీవితాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మన పర్యావరణం, అడవులు, నదులు, మొత్తం పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ గురించి కూడా ఆలోచించాలి. మనం ‘పునరుత్పాదక‘ంగా ఉండాలనుకుంటే, మొదట మన భూమి పునరుత్పాదకంగా ఉండేలా చూసుకోవాలి.
అక్షయ-తృతీయ పండుగ కూడా దాతృత్వ శక్తికి ఒక సందర్భం అని మీకు తెలుసా! స్వచ్ఛ హృదయ భావనతో మనం ఏది ఇచ్చినా అది ముఖ్యమైనది. మనం ఏమి ఇస్తామో, ఎంత ఇస్తామో ముఖ్యం కాదు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో, మన చిన్న ప్రయత్నాలు మన చుట్టూ ఉన్న చాలా మందికి భారీ సహాయకారిగా మారతాయి. మిత్రులారా, జైన సంప్రదాయంలో ఇది చాలా పవిత్రమైన రోజు. మొదటి తీర్థంకరుడు రిషభదేవ్ జీవితంలో ఇదో ఒక ముఖ్యమైన రోజు. ఈ విధంగా, జైన సమాజం దీనిని ఒక పండుగగా జరుపుకుంటుంది. అందువల్ల ఈ రోజున ప్రజలు ఏదైనా శుభకార్యాలను ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడం సులభం. ఈ రోజు క్రొత్తదాన్ని ప్రారంభించే రోజు కాబట్టి, మనమందరం కలిసి, మన ప్రయత్నాల ద్వారా, మన భూమిని పునరుత్పాదకమైనదిగా, నశించనిదిగా మార్చగలమా? మిత్రులారా, ఈ రోజు బసవేశ్వరుడి జయంతి. బసవేశ్వరుని జ్ఞాపకాలు, సందేశాలను పదేపదే తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి నాకు అవకాశం లభించడం నా అదృష్టం. బసవేశ్వర జన్మదినం సందర్భంగా బసవేశ్వరుడి అనుయాయులందరికీ అభినందనలు.
మిత్రులారా, పవిత్ర రంజాన్ మాసం కూడా ప్రారంభమైంది. చివరిసారి రంజాన్ జరుపుకున్నప్పుడు, ఈసారి రంజాన్ ఇంత పెద్ద ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ, ఇప్పుడు ఈ ఇబ్బంది ప్రపంచం మొత్తం ఏర్పడింది. ఈ రంజాన్ ని సంయమనం, సద్భావన, సున్నితత్వం మరియు సేవలకు చిహ్నంగా మార్చడానికి మనకు అవకాశం ఉంది. ఈసారి, ఈద్ రాకముందే ప్రపంచం కరోనా నుండి విముక్తి పొందాలని, మునుపటిలా ఉత్సాహంతో ఈద్ జరుపుకోవాలని గతంలో కంటే ఎక్కువగా ప్రార్థిస్తున్నాము. రంజాన్ ఈ రోజుల్లో, స్థానిక పరిపాలన మార్గదర్శకాలను అనుసరించి, కరోనాకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని బలోపేతం చేస్తామని నాకు నమ్మకం ఉంది. రహదారుల్లో, వీధుల్లో, మార్కెట్లలో భౌతిక దూరం నియమాలను పాటించడం ఇప్పటికీ చాలా ముఖ్యం. రెండు గజాల భౌతిక దూరం విషయంలో, ఇళ్ల నుండి బయటకి రాగూడదనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మత పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి, ఈసారి కరోనా భారతదేశంతో సహా పండుగలను జరుపుకునే విధానాన్ని మార్చింది. ఇటీవల బిహు, బైసాకి, పుతండు, విషూ, ఒడియా నూతన సంవత్సరం మొదలైన పర్వదినాలు వచ్చాయి. . ప్రజలు ఈ పండుగలను ఇంటి లోపల ఉండి, చాలా సరళ విధానాలతో, సమాజం పట్ల శ్రేయో దృక్పథంతో ఎలా జరుపుకుంటారో చూశాము. సాధారణంగా ఈ పండుగలను స్నేహితులు కుటుంబాలతో పూర్తి ఉత్సాహంతో జరుపుకునేవారు. ఇంటి నుండి బయటకు వెళ్లి తమ ఆనందాన్ని పంచుకునేవారు. కానీ ఈసారి అందరూ సంయమనంతో ఉన్నారు. లాక్డౌన్ నియమాలను అనుసరించారు. ఈసారి మన క్రైస్తవ మిత్రులు కూడా ఇంట్లో ‘ఈస్టర్‘ జరుపుకున్నట్లు చూశాము. మన సమాజం, మన దేశం పట్ల ఈ బాధ్యతను నెరవేర్చడం ఈ రోజు చాలా ముఖ్యం. అప్పుడే మనం కరోనా వ్యాప్తిని ఆపగలుగుతాము. కరోనా వంటి ప్రపంచ మహమ్మారిని మనం ఓడించగలుగుతాము.
నా ప్రియమైన దేశవాసులారా, ఈ ప్రపంచ మహమ్మారి సంక్షోభం కాలంలో మీ కుటుంబ సభ్యునిగా, మీరందరూ కూడా నా స్వంత కుటుంబ సభ్యులుగా భావించి కొన్ని సూచనలు చేయడం నా బాధ్యత. మితిమీరిన ఆత్మవిశ్వాసంలో చిక్కుకోవద్దు. కరోనా ఇంకా మా నగరానికి, మా గ్రామానికి, మా వీధిలోకి, మా కార్యాలయంలోకి చేరలేదు కాబట్టి ఇకపై రాదు అనే ఆలోచనను దూరం చేయండి. చూడండి, ఎప్పుడూ అలాంటి తప్పు చేయవద్దు. ప్రపంచ అనుభవం మనకు చాలా చెబుతోంది. అప్రమత్తత ప్రమాదాన్ని దూరం చేస్తుంది. గుర్తుంచుకోండి, ఈ విషయాలన్నిటిలో మన పూర్వీకులు మాకు బాగా మార్గనిర్దేశం చేశారు. మన పూర్వీకులు చెప్పారు –
‘అగ్ని: శేషం. రుణ: శేషం,
వ్యాధి: శేషం తథైవచ |
పునః ్పు్పున ప్రవర్దెత్
తస్మాత్ శేషమ్ న కారయేత్ ||
అంటే చిన్నగా మొదలై పెద్దవైన మంటలు, అప్పులు, అనారోగ్యం తేలికగా తీసుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది. వాటికి పూర్తి చికిత్స చాలా ముఖ్యం. అందువల్ల, అత్యుత్సాహంతో, స్థానిక స్థాయిలో, ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. నేను మరోసారి చెప్తున్నాను. – రెండు గజాలు దూరం ఉండండి, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. “రెండు గజాల దూరం- ఆరోగ్యానికి అవసరం. మీకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తరువాతి ‘మన్ కి బాత్‘ సందర్భంగా మనం కలిసినప్పుడు, ఈ గ్లోబల్ మహమ్మారి నుండి విముక్తి పై కొన్ని వార్తలు ప్రపంచం నలుమూలల నుండి రావాలి, మానవజాతి ఈ కష్టాల నుండి బయటపడాలి. ఈ ప్రార్థనతో మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
Here is #MannKiBaat April 2020. https://t.co/tkteUgjck9
— Narendra Modi (@narendramodi) April 26, 2020
Today's #MannKiBaat takes place when we are in the midst of a 'Yuddh.'
— PMO India (@PMOIndia) April 26, 2020
India's fight against COVID-19 is people-driven. Every Indian is a soldier in this fight. pic.twitter.com/mb1zR7sCvw
Look around, you will see how India has taken up a people-drive battle against COVID-19. #MannKiBaat pic.twitter.com/g4BdiLjdEu
— PMO India (@PMOIndia) April 26, 2020
People are rising to the occasion to help each other. #MannKiBaat pic.twitter.com/0doYOxzhyd
— PMO India (@PMOIndia) April 26, 2020
We are all in this together! #MannKiBaat pic.twitter.com/nJeTEIkcx5
— PMO India (@PMOIndia) April 26, 2020
Our hardworking farmers ensure no one is hungry.
— PMO India (@PMOIndia) April 26, 2020
People are contributing to PM-CARES. #MannKiBaat pic.twitter.com/xHSGFo3XZh
Saluting the people of India. #MannKiBaat pic.twitter.com/2Fr1UHLpzZ
— PMO India (@PMOIndia) April 26, 2020
Be it our businesses, office culture, education, medical sector..everyone is adapting to new changes in a post-Coronavirus world.
— PMO India (@PMOIndia) April 26, 2020
There is a strong desire to innovate in various areas. #MannKiBaat pic.twitter.com/Mde9MzV2zJ
India is working as a team. #MannKiBaat pic.twitter.com/HP8zQmYBmG
— PMO India (@PMOIndia) April 26, 2020
Among the topmost priorities is to help the poor and vulnerable. #MannKiBaat pic.twitter.com/CEnb0VxdEE
— PMO India (@PMOIndia) April 26, 2020
There is great appreciation for the Epidemic Diseases (Amendment) Ordinance, 2020. #MannKiBaat pic.twitter.com/DxL4GRnj9l
— PMO India (@PMOIndia) April 26, 2020
COVID-19 has changed how we view things.
— PMO India (@PMOIndia) April 26, 2020
I am so happy to see the immense appreciation for the working of sanitation workers, our police forces.
The appreciation for doctors, nurses, healthcare workers is exceptional. #MannKiBaat pic.twitter.com/38AieFphm5
Prakruti.
— PMO India (@PMOIndia) April 26, 2020
Vikruti.
Sanskriti. #MannKiBaat pic.twitter.com/nPiNRgOjgJ
India took a few decisions, which were guided by our ethos. #MannKiBaat pic.twitter.com/xvORt5KEiP
— PMO India (@PMOIndia) April 26, 2020
Today, when world leaders tell me- Thank you India, thank you people of India, I feel very proud.
— PMO India (@PMOIndia) April 26, 2020
India is caring for its own citizens and India is contributing towards creating a healthier planet. #MannKiBaat pic.twitter.com/826hAZBYG6
Do what you can to improve immunity.
— PMO India (@PMOIndia) April 26, 2020
Keep in mind that our traditional systems offer great methods to do so.
Let us make these systems popular and share them in a language in which the world understands. #MannKiBaat pic.twitter.com/Dgee12zDFX
Among the welcome changes in the post-Coronavirus era is the awareness on the need to wear masks.
— PMO India (@PMOIndia) April 26, 2020
A mask is something we will have to keep wearing in the times to come. It does not mean the person wearing a mask is unwell, it is just a wise precaution. #MannKiBaat pic.twitter.com/YtLqJoj0Gf
We in India always knew that spitting in public places is wrong. Yet, it continued in places.
— PMO India (@PMOIndia) April 26, 2020
Now is the best time to ensure we do not spit.
This will increase basic hygiene and strengthen the fight against COVID-19. #MannKiBaat pic.twitter.com/8xG2ZWbEtw
Greetings on #AkshayaTritiya. #MannKiBaat pic.twitter.com/5i6UU3IJSY
— PMO India (@PMOIndia) April 26, 2020
Tributes to Bhagwan Basaveswara. #MannKiBaat pic.twitter.com/85Cng7UJYC
— PMO India (@PMOIndia) April 26, 2020
While celebrating Ramzan the previous time, no one would have thought that there would be so many difficulties during Ramzan this time.
— PMO India (@PMOIndia) April 26, 2020
This time, let us pray that the world may be freed from the Coronavirus by the time of Id. pic.twitter.com/N0mMdxcCMy
We have to continue being careful and taking the right precautions. #MannKiBaat pic.twitter.com/iHMva9sjpD
— PMO India (@PMOIndia) April 26, 2020
आप सबको अक्षय तृतीया की हार्दिक शुभकामनाएं।आइए, हम मिलकर अपने प्रयासों से अपनी धरती को ‘अक्षय’ और ‘अविनाशी’ बनाने का संकल्प लें।
— Narendra Modi (@narendramodi) April 26, 2020
यह पर्व 'दान की शक्ति' का भी एक अवसर होता है। ऐसे में हमारा छोटा सा प्रयास भी लोगों के लिए बड़ा संबल बन सकता है। pic.twitter.com/St1DOBMgks
India’s fight against COVID-19 is people driven.
— Narendra Modi (@narendramodi) April 26, 2020
Proud of our 130 crore citizens who have risen to the occasion and are doing whatever they can to free our nation from the Coronavirus menace. #MannKiBaat pic.twitter.com/vvs1xD9T6w
Now there is:
— Narendra Modi (@narendramodi) April 26, 2020
Realisation on the need to wear masks, including homemade options.
Awareness on the need to end spitting, especially in public places. #MannKiBaat pic.twitter.com/oKsnL3AU9P
Ramzan this year is taking place while we are in the midst of the battle against COVID-19.
— Narendra Modi (@narendramodi) April 26, 2020
Let’s take the right precautions today so that the coming Id-Ul-Fitr can be marked in the same way as it has been done earlier. #MannKiBaat pic.twitter.com/gVtIHKrkuv
Let’s further popularise our traditional systems that can improve immunity as well as health. #MannKiBaat pic.twitter.com/GSgi1R3N7I
— Narendra Modi (@narendramodi) April 26, 2020
India cherishes the role of all those working on the frontline, protecting people and saving lives.
— Narendra Modi (@narendramodi) April 26, 2020
The Epidemic Diseases (Amendment) Ordinance, 2020 has been hailed by people of all sections of society. #MannKiBaat pic.twitter.com/lnqKmGFk4r
प्रकृति, विकृति और संस्कृति, इन शब्दों के पीछे के भाव को देखें तो जीवन को समझने का एक नया द्वार खुलता है।
— Narendra Modi (@narendramodi) April 26, 2020
भारत ने प्रकृति, विकृति की सोच से परे अपनी संस्कृति के अनुरूप फैसला लिया।
हमने देश की जरूरतों के साथ ही दुनियाभर से आ रही मानवता की रक्षा की पुकार को भी ध्यान में रखा। pic.twitter.com/IEdxBfkbAS