Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కోసం ఆలోచనలను మరియు సూచనల ను ఆహ్వానించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 సెప్టెంబర్ 25వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు ప్రసారం కావలసి ఉన్న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) కోసం ఆలోచనల ను మరియు సూచనల ను వెల్లడి చేయవలసిందంటూ ప్రజల ను ఆహ్వానించారు. ప్రజలు వారి వారి ఆలోచనల ను MyGov లో, Namo App లో వెల్లడి చేయవచ్చును; లేదా 1800-11-7800 నంబరు కు డయల్ చేసి సందేశాన్ని రికార్డు చేయవచ్చును. ఎవరైనా వ్యక్తి 1922 కు మిస్ డ్ కాల్ ఇవ్వవచ్చును. దానితో వారికి వచ్చే ఎస్ఎమ్ఎస్ లో ఉండే లింకు ద్వారా నేరు గా పరధాన మంత్రి కి తమ తమ సూచనల ను పంపవచ్చును.

MyGov ఆహ్వానం తాలూకు లింకు ను శేర్ చేస్తూ, ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘భారతదేశం నలు మూలల నుండి లభిస్తున్నటువంటి వివిధ రకాలైన సూచనల తో మరియు ప్రేరణదాయకమైనటువంటి సామూహిక ప్రయాసల తో #MannKiBaat (‘మనసులో మాట’ కార్యక్రమం) సుసంపన్నం అయింది. తత్ఫలితం గా మన సమాజం లో సకారాత్మక మార్పు లు చోటు చేసుకొన్నాయి. ఎప్పటి మాదిరిగానే, నేను ఈ నెల లో 25వ తేదీ నాడు జరుగనున్న ఎపిసోడ్ కోసం మీ సూచనల ను గురించి తెలుసుకోవాలనే కుతూహలం తో ఉన్నాను.’’ అని పేర్కొన్నారు.