Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 12 వ భాగం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 12 వ భాగం లో పాల్గొని ప్రసంగిస్తూ, దేశం లో సామూహిక ప్రయాస ల ద్వారా కరోనా పై భీకర పోరు కొనసాగుతోందన్నారు. కోవిడ్ విశ్వమారి తో జరుపుతున్నటువంటి ఈ యొక్క పోరాట క్రమం లో భాగం గా ఆర్థిక వ్యవస్థ లోని ఒక ప్రధాన విభాగాని కి తలుపుల ను తెరచిన నేపథ్యం లో మరింత జాగరూకులుగా, అప్రమత్తం గా ఉండాలంటూ ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు.

శ్రామిక్ ప్రత్యేక రైళ్ళు, ప్రత్యేక రైళ్ల తో పాటు సాధారణ రైలు సేవ లు కూడా తగిన ముందు జాగ్రత్త చర్యల తో పునఃప్రారంభం అయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు. విమాన సేవ లు మళ్లీ మొదలయ్యాయి, పరిశ్రమ సైతం సాధారణ స్థితి కి చేరుకుంటోంది అని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల లో ఎటువంటి కట్టడి లేకపోవడం అనేది ఉండకూడదని ప్రధాన మంత్రి హెచ్చరిక చేశారు. ‘‘దో-గజ్-కీ-దూరీ’’ ని (ఒక మనిషి కి, మరో మనిషి కి నడుమ రెండు గజాల ఎడం ఉంచుకోవడాన్ని) పాటించాలని, ఫేస్ మాస్క్‌ లను ధరించాలని, సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండాలని ఆయన సూచించారు. ఎన్నో కష్టాల కు ఓర్చిన అనంతరం, పరిస్థితి ని చక్కదిద్ధేందుకు దేశం ఎంతో నేర్పరితనం తో తీసుకొన్న నిర్ణయాల ఫలితం వ్యర్థం కాకూడదు అని ఆయన నొక్కి వక్కాణించారు.

మన ప్రజలు చాటిన సేవా స్ఫూర్తి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. అది అతి పెద్ద బలం అని ఆయన అభివర్ణించారు. ‘‘సేవా పరమో ధర్మః’’ అనే సూక్తి మనకు తెలిసిందే; సేవ చేయడం లోనే ఆనందం ఉంది, సేవ లోనే సంతృప్తి ఉంది అని ఆయన అన్నారు. దేశ వ్యాప్తం గా ఉన్న వైద్య సేవల సిబ్బంది కి తన ప్రగాఢ శుభకామనల ను వ్యక్తం చేశారు. దేశం లోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, రక్షకభట బలగం మరియు ప్రసార మాధ్యమాల సిబ్బంది లోని సేవా భావాన్ని ప్రధాన మంత్రి కొనియాడారు. ఈ సంక్షోభ కాలం లో మహిళా స్వయం సహాయక సమూహాలు చేసిన విశిష్ట కృషి ని కూడా ఆయన ప్రశంసించారు.

తమిళ నాడు కు చెందిన కె.సి.మోహన్, అగర్ తలా కు చెందిన గౌతమ్ దాస్, పఠాన్‌ కోట్‌ కు చెందిన దివ్యాంగుడు రాజు ల వంటి సామాన్య పౌరులు ఈ సంకట కాలం లో ఇతరులకు సహాయం చేయడానికని తమ వద్ద పరిమితమైనటువంటి వనరులే ఉన్నప్పటికీ జంకక ముందంజ వేశారని ప్రధాన మంత్రి సోదాహరణం గా వివరించారు. మహిళల స్వయం సహాయ సమూహాల యొక్క నిరంతర శ్రమ ను గురించిన లెక్కలేనన్ని కథ లు దేశం నలుమూలల నుండి తెర మీదకు వస్తున్నాయి అని కూడా ఆయన అన్నారు.

ఈ విశ్వమారి ని ఎదుర్కోవడం లో చాలా చురుకైనటువంటి పాత్ర ను పోషించిన వ్యక్తుల ప్రయత్నాల ను కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు. నాసిక్‌ కు చెందిన రాజేంద్ర యాదవ్ శానిటైజేషన్ మశీన్‌ ను రూపొందించి ఆయన యొక్క ట్రాక్టర్‌ కు జత పరచారు అంటూ దీనిని ఒక ఉదాహరణ గా ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ‘దో-గజ్-కి-దూరీ’ ని పాటించడానికి చాలా మంది దుకాణదారులు వారి దుకాణాల్లో పెద్ద పైపు లైన్ లను నెలకొల్పారని ఆయన తెలిపారు.

మహమ్మారి కారణం గా ప్రజలు పడ్డ యాతన లు మరియు క్లేశాల ను గురించి కార్యక్రమ శ్రోతల కు ప్రధాన మంత్రి వివరిస్తూ, కరోనా వైరస్ సమాజం లో అన్ని వర్గాల వారి ని బాధించింది, అయితే అల్ప సౌకర్యాలు మాత్రమే ప్రాప్తించిన శ్రామికులు మరియు కార్మికులు మాత్రం కరోనా వైరస్ కారనం గా అత్యంత ప్రభావితులు గా మిగిలారు అని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుండి ప్రతి ఒక్క విభాగం మరియు ప్రతి ఒక్క సంస్థ పూర్తి స్థాయి వేగం తో సహాయ కార్యక్రమాల లో చేతి తో చేయి వేసి మరీ పనిచేస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. వారు పడుతున్న బాధలు ఎటువంటివి అన్నది యావత్తు దేశం అర్థం చేసుకొందని, ఆ బాధల తో మమేకం అయిందని, కేంద్రం మొదలుకొని రాష్ట్రాలు, స్థానిక పాలక సంస్థ ల వరకు ప్రతి ఒక్కరూ 24 గంటలూ పాటుపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్ల లోను, బస్సుల లోను లక్షలాది మంది శ్రామికుల ను సురక్షితం గా వారి వారి గమ్యస్థానాల కు చేరవేయడం కోసం, మరి వారి ఆహారం పట్ల శ్రద్ధను వహిస్తూ ప్రతి ఒక్క జిల్లా లో వారికి క్వోరన్టీన్ కై తగిన ఏర్పాట్లు చేయడం లో ఉదారం గా నిమగ్నమైన ప్రజల ను ఆయన ప్రశంసించారు.

ప్రస్తుత పరిస్థితుల లో ఒక క్రొత్త పరిష్కారాన్ని రూపొందించడం తక్షణావసరం అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఈ దిశ గా ప్రభుత్వం అనేక చర్యల ను తీసుకొందని ఆయన అన్నారు. కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు గ్రామ ఉపాధి, స్వతంత్రోపాధి, ఇంకా చిన్న తరహా పరిశ్రమల కు విస్తారమైన అవకాశాల ను కల్పించాయని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం దేశాన్ని ఈ దశాబ్దం లో ఉన్నతోన్నతమైనటువంటి శిఖరాల కు తీసుకుపోతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

కరోనా ప్రపంచవ్యాప్త వ్యాధి ప్రబలిన ప్రస్తుత కాలం లో, ప్రతి చోట ప్రజలు యోగ ను గురించి, ఆయుర్వేదాన్ని గురించి మరింత అధికం గా తెలుసుకోదలుస్తూ, దానిని ఒక జీవన పంథా గా స్వీకరించాలనుకొంటున్నారని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘సముదాయం, రోగనిరోధక శక్తి మరియు ఏకత్వం’’ల కోసం యోగ ను అనుసరించాలి అని ఆయన వాదించారు. కరోనా ప్రపంచవ్యాప్త వ్యాధి విజృంభిస్తున్న ప్రస్తుత కాలం లో, యోగ మరింత ముఖ్యమైంది గా మారింది, ఎందుకంటే ఈ వైరస్ శ్వాస ను పీల్చుకొనే వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది అని ఆయన అన్నారు. యోగ లో, శ్వాసకోశ వ్యవస్థ ను బలోపేతం చేసే అనేక రకాలైన ప్రాణాయామాలు ఉన్నాయి. యోగ వల్ల ప్రయోజనకరమైన ప్రభావాలు ఉన్నట్లు చాలా కాలం నుండే గమనించడం జరిగింది అని ఆయన అన్నారు.

దీనికి తోడు, ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ వీడియో బ్లాగ్ పోటీ ‘మై లైఫ్, మై యోగా కోసం ప్రజలు వారి యొక్క వీడియోల ను పంచుకోవలసిందంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ పోటీ లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి, మరి రాబోయే అంతర్జాతీయ యోగ దినోత్సవం లో పాలుపంచుకోవాలి అంటూ ప్రధాన మంత్రి అభ్యర్థించారు.

ప్రపంచవ్యాప్త వ్యాధి తో పోరు సలపడం లో ప్రభుత్వ ప్రయత్నాల ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. అలాగే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం యొక్క లబ్ధిదారుల సంఖ్య ఒక కోటి కి పైబడినట్లు ఆయన వెల్లడిస్తూ అందుకు గర్వం గా ఉందన్నారు. విశ్వమారి నేపథ్యం లో రోగుల కు చికిత్స చేసిన వైద్యులు, నర్సులు మరియు వైద్య సిబ్బంది తో పాటు ‘ఆయుష్మాన్ భారత్’ యొక్క లాభితుల కు కూడా ఆయన అభినందనలు తెలిపారు.

ఒకానొక సమయం లో మనం కరోనావైరస్ తో సమరం చేస్తూనే, అమ్ఫాన్ తుఫాను వంటి విపత్తుల తో సైతం పోరాడవలసి వచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు. అమ్ఫాన్ పెనుతుఫాను వేళ పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ల ప్రజలు ఎంతటి ధైర్య సాహసాల తో పోరు లో పాలుపంచుకొన్నదీ ఆయన ప్రస్తావించి, అందుకు గాను వారి ని శ్లాఘించారు. ఆ రాష్ట్రాల లో రైతుల కు వాటిల్లిన నష్టాల కు గాను ఆయన సహానుభూతి ని వ్యక్తం చేశారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, మరి వారు చూపిన దృఢత్వం, సంకల్పాన్ని చాటిన రీతి కొనియాడదగినవి అని ఆయన అన్నారు.

తుఫాను విపత్తు కు అదనం గా, దేశం లోని అనేక ప్రాంతాలు మిడతల దండు దాడుల ప్రభావాని కి లోనయ్యాయి అని శ్రీ మోదీ అన్నారు. సంకట కాలం లో దేశవ్యాప్తం గా సామాన్య మానవుడు నిత్యావసర వస్తువుల కొరత ను ఎదుర్కోనక్కరలేకుండా ప్రభుత్వం ఏ విధం గా ఉదారం గా పనిచేస్తున్నదీ ఆయన నొక్కి పలికారు. కేంద్రం మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విభాగం లేదా పరిపాలన విభాగం వరకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి, రైతుల కు సాయపడడానికి మరియు ఈ సంక్షోభం కారణం గా పంట నష్టాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు ఆధునిక సాంకేతిక మెలకువల అండదండల ను తీసుకోవడం లో నిమగ్నం అయ్యారు అంటూ ప్రధాన మంత్రి వివరించారు.

నీటి ని సైతం ఆదా చేయవలసిన బాధ్యత ను గ్రహించడం కూడా వర్తమాన తరాని కి ఆవశ్యకం అని ప్రధాన మంత్రి నొక్కి వక్కాణించారు. వాన నీటి ని కాపాడుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది, మరి ప్రతి ఒక్కరు జల సంరక్షణ కోసం పాటు పడాలి అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ‘పర్యావరణ దినం’ సందర్భం లో కొన్ని మొక్కల ను నాటడం ద్వారా మరియు ప్రకృతి తో అనునిత్యం సంబంధాన్ని పెనవేసుకొనేందుకు తగిన సంకల్పాలు చేసుకోవడం ద్వారా ప్రకృతి కి సేవ చేయవలసింది గా కూడా దేశ ప్రజల ను ఆయన అభ్యర్థించారు. లాక్ డౌన్ జీవన వేగాన్ని మందగింపచేసినప్పటికీ, అది ప్రకృతి ని ఉచిత రీతి న దర్శించేందుకు ఒక అవకాశాన్ని ప్రసాదించిందని, ఈ కాలం లో వన్య మృగాలు మరింత గా బయట కు రావడం మొదలుపెట్టాయని ఆయన అన్నారు.

తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం గాని లేదా ఉదాసీనం గా ఉండటం గాని ఒక ఐచ్ఛికం కాకూడదు అని చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. కరోనా తో పోరాటాన్ని ఇప్పటికీ ఇంకా అంతే తీవ్రమైందిగా ఎంచవలసి ఉంది అని ఆయన అన్నారు.