Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన్ కీ బాత్ తాజా కార్యక్రమంలో స్థూలకాయ సమస్య నివారణ దిశగా సామూహిక కార్యాచరణకు ప్రధానమంత్రి పిలుపు


ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో ఈ సమస్యపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారువంట నూనె వినియోగాన్ని తగ్గించడానికి ప్రముఖులను ఆయన నామినేట్ చేశారుఆ పది మందిని వారు మరో పది మందిని దీని కోసం నామినేట్ చేయాల్సిందిగా కూడా ఆయన  విజ్ఞప్తి చేశారు.

‘‘ఎక్స్‌’’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా రాశారు:  

‘‘నిన్నటి #MannKiBaat కార్యక్రమంలో నేను ప్రస్తావించిన ప్రకారంశరీరం లావెక్కడం అనే సమస్యతో పోరాడడానికీఆహారంలో నూనెల వినియోగంపై అవగాహనను పెంచడానికీ ఈ కింది వ్యక్తులను నేను నామినేట్ చేయదలచుకొన్నానువారు వారి వంతుగా తలా పది మంది చొప్పున నామినేట్ చేయాలని కూడా వారిని నేను కోరుతున్నాను. అలా చేస్తే మన ఉద్యమం మరింత విస్తరిస్తుంది.

శ్రీ ఆనంద్ మహీంద్ర (@anandmahindra)

శ్రీ నిరహువా (@nirahua1)

మను భాకర్ (@realmanubhaker)

మీరాబాయి చాను (@mirabai_chanu)

శ్రీ మోహన్‌లాల్ (@Mohanlal)

శ్రీ నందన్ నిలేకనీ (@NandanNilekani)

శ్రీ ఉమర్ అబ్దుల్లా (@OmarAbdullah)

శ్రీ మాధవన్ (@ActorMadhavan)

శ్రేయ ఘోషాల్ (@shreyaghoshal)

శ్రీమతి సుధామూర్తి (@SmtSudhaMurty)

రండిమనమంతా కలసి భారత్‌ను మరింత ఆరోగ్యంగాఫిట్‌గా ఉండేటట్లు తీర్చిదిద్దుదాం.

#FightObesity”