Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మన్ కీ బాత్’ కోసం సలహాలను ఆహ్వానించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 28న జరుగనున్న ‘మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమానికి పౌరుల నుంచి సలహాలను ఆహ్వానించారు.

 

సమాజం లో పరివర్తనను తీసుకురావాలన్న ఉద్దేశంతో జరుగుతున్న సామూహిక ప్రయత్నాల గురించి అనేక మంది యువజనులు ప్రముఖంగా పేర్కొంటున్నారని, ఈ విషయం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఇంతవరకు సూచనలను, సలహాలను వెల్లడించని వారు తమ ఆలోచనలను మైగవ్ (MyGov) లో గాని, లేదా నమో ఏప్ (NaMo App) ద్వారా గాని తెలియజేయాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘ఈ నెలలో 28న ఆదివారం జరుగనున్న #MannKiBaat (‘మనసులో మాట’) కార్యక్రమం కోసం అనేక సూచనలు, సలహాలు నా దృష్టికి వస్తున్నాయి.  చాలా మంది యువజనులు, మరీ ముఖ్యంగా మన సమాజం లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జరుగుతున్న సామూహిక ప్రయత్నాలను గురించి ప్రముఖంగా పేర్కొంటూ ఉండడం చూస్తే నాకు సంతోషం కలుగుతోంది.  మీరు మీ మీ సలహాలను, సూచనలను  మైగవ్ (MyGov) లో గాని, లేదా నమో ఏప్ (NaMo App) ద్వారా గాని పంపవచ్చు; లేదా 1800-11-7800 నంబరుకు కాల్ చేసి మీ సందేశాన్ని రికార్డు చేయవచ్చు.’’

 

 

 

***

DS/ST