Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మన్ కీ బాత్’ కార్యక్రమం యొక్క2024 జూన్ ఎపిసోడ్ కోసం ఆలోచనలను మరియు సూచనలను ఆహ్వానించిన ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ


 

ఎన్నికల కారణం గా కొద్ది విరామం తరువాత ఆకాశవాణి లో మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క రాబోయే ఎపిసోడ్ విషయమై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల లో మన్ కీ బాత్కార్యక్రమం జూన్ 30 వ తేదీ న ఆదివారం ఉంటుందని ఆయన తెలిపారు.

 

ప్రజలు మన్ కీ బాత్(మనసు లో మాట కార్యక్రమం) యొక్క 111 వ ఎపిసోడ్ కోసం వారి వారి ఆలోచనల ను, సూచనల ను మైగవ్ (MyGov) ఓపెన్ ఫోరమ్, నమో ఏప్ (NaMo App ) లలో వ్రాయడం గాని లేదా 1800 11 7800 నంబరు కు ఒక సందేశాన్ని రికార్డు చేయడం ద్వారా గాని వెల్లడి చేయవలసిందిగా శ్రీ నరేంద్ర మోదీ కోరారు.

 

శ్రీ నరేంద్ర మోదీ సామాజిక మాధ్యం ఎక్స్లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ –

‘‘ఎన్నికల కారణం గా కొన్ని నెలల విరామం తరువాత, #MannKiBaat (మనసులో మాట కార్యక్రమం) మళ్ళీ వచ్చేసింది అని ప్రకటిస్తున్నందుకు సంతోషం గా ఉంది. ఈ నెల లో ఈ కార్యక్రమం జూన్ 30 వ తేదీ ఆదివారం నాడు నిర్వహించడం జరుగుతుంది. దీని కోసం మీ మీ ఆలోచనల ను, సూచనల ను ఇవ్వవలసింది గా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మీ ఆలోచనల ను MyGov (మైగవ్) ఓపెన్ ఫోరమ్, NaMo App (నమో ఏప్) లకు వ్రాయడం గాని, లేదా 1800 11 7800 నంబరు కు డయల్ చేసి మీ యొక్క సందేశాన్ని రికార్డు చేయడం గాని చేయగలరు’’ అని ఆ సందేశం లో పేర్కొన్నారు.