Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘మన్‌ కీ బాత్‌ 2.0’లో ప్రధాన మంత్రి 9వ ప్రసంగం


అనేక మంది భారతీయుల కు స్ఫూర్తి ని ఇచ్చే ఒక ఉదంతాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ‘మన్‌ కీ బాత్‌ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం)లో 9వ ప్రసంగం సందర్భం గా ప్రస్తావించారు. బిహార్‌ లోని పూర్ణియా ప్రాంతం దేశం లోని ప్రజల కు ఒక స్ఫూర్తి కాగలదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతం దశాబ్దాలు గా వరద బీభత్సం తో అల్లాడుతున్నదని పేర్కొన్నారు. ఫలితం గా అక్కడ వ్యవసాయం గానీ, ఇతర ఆదాయ వనరుల అన్వేషణ గానీ కనాకష్టమైందని తెలిపారు. లోగడ పూర్ణియా ప్రాంత మహిళ లు పట్టుపరుగు ల పెంపకం ద్వారా ఎంతో కొంత ఆర్జించేవారని ఆయన చెప్పారు. అయితే, వారి వద్ద పట్టుగూళ్ల ను తక్కువ ధరకు కొనే వ్యాపారులు వాటి నుండి దారాన్ని తీసి భారీ లాభాలు ఆర్జించే వారని తెలిపారు. ఈ పరిస్థితుల నడుమ పూర్ణియా మహిళల లో కొందరు భిన్న మార్గం లో వెళ్లాలని నిర్ణయించుకొని, ప్రభుత్వం సాయం తో పట్టు ఉత్పత్తి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకొన్నారని వివరించారు. నేడు వారు పట్టు ఉత్పత్తి తో పాటు పట్టుగూళ్ల నుండి దారాన్ని తీసి, వాటి తో నేసిన చీరల ను విక్రయిస్తూ భారీ గా గడిస్తున్నారని ఆయన తెలిపారు.

దక్షిణ అమెరికాలోని ఎండెస్ పర్వతశ్రేణుల లో అత్యంత ఎత్తయిన ఎకోన్ కాగువా శిఖరాన్ని కేవలం 12 ఏళ్ల వయసులోనే అధిరోహించిన బాలిక కామ్య కార్తికేయన్‌ స్ఫూర్తిదాయక కథనాన్ని కూడా ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు. దాదాపు 7 వేల మీటర్ల ఎత్తయిన ఈ శిఖరాన్ని జయించిన ఆమె, ఇప్పుడు ‘మిశన్‌ సాహస్‌’ పేరిట అన్ని ఖండాలలో అత్యంత ఎత్తయిన పర్వతాల ను అధిరోహించే దీక్ష ను చేపట్టిందని ఆయన వెల్లడించారు. శరీర దృఢత్వం దిశ గా అందరిలో సానుకూల దృక్పథాన్ని కల్పించడం లో ఆమె కృషి ని ఆయన అభినందించారు. ఈ నేపథ్యం తో కామ్య చేపట్టిన ‘మిశన్‌ సాహస్‌’ విజయంతం కావాలంటూ ఆమె కు శుభాకాంక్షలు తెలిపారు. భారత భౌగోళిక ప్రదేశం దేశం లో సాహస క్రీడల కు అనేక అవకాశాలు కల్పిస్తున్నదని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. అదే కాలం లో ఆయా ప్రదేశాల లో తమకు అభిరుచి గల సంబంధిత సాహస క్రీడల లో పాల్గొంటూ సాహసాల తో జీవితాన్ని మమేకం చేసుకోవాలని ప్రజల కు పిలుపునిచ్చారు.

కేరళ లోని కొల్లమ్ లో నివసించే 105 సంవత్సరాల భాగీరథి అమ్మ విజయ గాథను కూడా ప్రధాన మంత్రి వివరించారు. చిన్న వయస్సు లో ఆమె తన తల్లి ని, భర్త ను కోల్పోయినట్లు ఆయన చెప్పారు. అయితే, 105 ఏళ్ల వయస్సు లో ఆమె మళ్లీ పాఠశాల కు వెళ్లడం ప్రారంభించింది! ఇంత వయసు మీద పడిన తరువాత కూడా చదువుకోవడాన్ని కొనసాగించిన భాగీరథి అమ్మ 4వ తరగతి పరీక్ష ను వ్రాసి, ఫలితాల కోసం ఆదుర్దా తో ఎదురుచూడటాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఈ పరీక్షలో 75 శాతం మార్కులు సాధించిన ఆమె విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తానని ప్రకటించారని తెలిపారు. భాగీరథి అమ్మ వంటి వారే దేశాని కి బలం, మన అందరి కి
స్ఫూర్తి ప్రదాత అని ఆయన అన్నారు.

మొరాదాబాద్‌లోని హమీర్‌పుర్‌ లో నివసించే సల్ మాన్‌ ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఆయన పుట్టుక తో దివ్యాంగుడు, క్లిష్ట పరిస్థితి ని ఎదుర్కొంటున్నా ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోలేదని చెప్పారు. ఆ మేరకు సొంత వ్యాపారాన్ని ప్రారంభించడమే గాక తన వంటి దివ్యాంగుల కు సహాయపడాలని కూడా నిర్ణయించుకున్నాడని తెలిపారు. ఆ మేరకు తన గ్రామం లో డిటర్జెంట్‌, స్లిప్పర్ల తయారీ ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఆ తరువాత అనతి కాలం లో మరో ౩౦ మంది దివ్యాంగులు కూడా ఆయన తో కలిశారని చెప్పారు.

ఇదే విధం గా గుజరాత్‌లోని కచ్ఛ్ ప్రాంతం లో గల అజ్ రక్‌ గ్రామస్థులు ప్రదర్శించిన పట్టుదల ను కూడా ఆయన వివరించారు. ఆ ప్రాంతాన్ని 2001లో భూకంపం అతలాకుతలం చేశాక అనేక మంది గ్రామస్థులు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఇస్మాయిల్‌ ఖత్రీ అనే వ్యక్తి మాత్రం గ్రామంలోనే తన సంప్రదాయ అద్దకం కళ ‘అజ్ రక్‌ ప్రింట్‌’ను కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు. ఈ కళ లో వినియోగించే ప్రకృతి సహజ రంగులు అతి కొద్ది కాలం లో అందరి ని ఆకట్టుకొన్నాయి. దాంతో గ్రామం ప్రజలంతా తమ సంప్రదాయ హస్తకళ కొనసాగింపు లో భాగస్వాములు అయ్యారు.

దేశ ప్రజలంతా ఇటీవల మహా శివరాత్రి పర్వదినాన్ని భక్తిశ్రద్ధల తో నిర్వహించుకోవడం పై ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. అందరి కి ఈశ్వర కృప నిరంతరం కొనసాగాలని, ఆ సాంబశివుడు అందరి ఆకాంక్షల ను తీర్చాలని ఈ పర్వదినం సందర్భం గా ఆకాంక్షించారు. అందరూ శక్తిమంతులు, ఆరోగ్యవంతులై దేశం పట్ల తమ కర్తవ్యాన్ని నెరవేర్చే సంకల్పాన్ని తీసుకోవాలంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.

రాబోయే రోజుల్లో హోలీ పండుగ, ఆ తర్వాత గుడీ- పడ్ వా సంబరాలను చేసుకుంటామని ప్రధాన మంత్రి గుర్తుచేశారు. అలాగే నవరాత్రి ఉత్సవాలు కూడా వసంత రుతువు తో ముడిపడి ఉంటాయని పేర్కొన్నారు. అటుపైన రామ- నవమి కూడా వస్తుందని, దేశంలో సామాజిక అల్లిక లో పండుగ లు, వేడుక లు విడదీయలేని భాగం అని పేర్కొన్నారు. ప్రతి పండుగ లో ఒక సామాజిక సందేశం అంతర్లీనం గా ఉంటుందని, సమాజానికే కాక యావత్తు దేశాని కి ఏకత తాలూకు స్ఫూర్తి ని పంచుతుందని వివరించారు.

**********