పంచాయతీ రాజ్ జాతీయ దినం సందర్భం లో మధ్య ప్రదేశ్ లోని రీవా లో ఈ రోజు న జరిగిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు గా 17,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రాజెక్టుల కు ఆయన శంకుస్థాపన చేయడం తో పాటుగా వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు కూడాను.
విద్యవాసిని మాత కు మరియు ధైర్య సాహసాల గడ్డ కు ప్రధాన మంత్రి ప్రణామాన్ని ఆచరించి జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తన ఇంతకు ముందటి సందర్శనల ను మరియు స్థానిక ప్రజల ఆప్యాయత ను ఆయన స్మరించుకొన్నారు. దేశవ్యాప్తం గా 30 లక్షల కు పైగా పంచాయతీ ప్రతినిధులు వర్చువల్ మాధ్యం ద్వారా ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవడాన్ని ప్రధాన మంత్రి గమనించి, అది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క ధైర్యయుక్త చిత్రాన్ని ఆవిష్కరించిందన్నారు. ఇక్కడ కు విచ్చేసిన ప్రతి ఒక్క వ్యక్తి తాలూకు పని పరిధి వేరు వేరు గా ఉండవచ్చు గాని ప్రతి ఒక్కరు దేశాని కి సేవలు అందిస్తుంచడం ద్వారా పౌరుల కు సేవ చేయాలనే ఉమ్మడి లక్ష్యం కోసమే పాటుపడుతున్నారని ఆయన అన్నారు. పల్లెల కు మరియు పేదల కు ప్రభుత్వం అమలుజరప తలపెట్టిన పథకాల ను పంచాయతీ లు పూర్తి సమర్పణ భావం తో సాకారం చేస్తుండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
పంచాయతీ స్థాయి లో సార్వజనిక సేకరణ నిమిత్తం ఇ-గ్రామ్ స్వరాజ్, ఇంకా జిఇఎమ్ పోర్టల్ ఏర్పాటు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అది పంచాయతీ ల పనితీరు ను సులభతరం చేస్తుందన్నారు. 35 లక్షల స్వామిత్వ సంపత్తి కార్డుల పంపిణీ ని గురించి మరియు మధ్య ప్రదేశ్ అభివృద్ధి కి గాను 17,000 వేల కోట్ల రూపాయల విలువైన రేల్ వే స్, గృహ నిర్మాణం, నీరు మరియు ఉద్యోగ కల్పన సంబంధి పథకాల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
స్వాతంత్య్రం తాలూకు అమృత కాలం లో, అభివృద్ధి చెందినటువంటి ఒక భారతదేశాన్ని ఆవిష్కరించాలి అనే స్వప్నాన్ని సాకారం చేసే దిశ లో ప్రతి ఒక్క పౌరుడు/పౌరురాలు అత్యంత సమర్పణ భావం తో శ్రమిస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు. అభివృద్ధి చెందినటువంటి ఒక దేశాన్ని నిర్మించడం కోసం భారతదేశం లోని గ్రామాల లో సామాజిక వ్యవస్థ ను, ఆర్థిక వ్యవస్థ ను మరియు పంచాయతీ రాజ్ వ్యవస్థ ను అభివృద్ధి పరచడాని కి ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసి ఉంటుందని ఆయన నొక్కిచెప్తూ, పంచాయతీ ల పై భేదభావాన్ని ప్రదర్శించిన మునుపటి ప్రభుత్వాల కు భిన్నం గా ఒక బలమైన వ్యవస్థ ను ఏర్పాటు చేయడం తో పాటుగా దాని పరిధి ని విస్తరింప జేయడాని కి కూడానున వర్తమాన ప్రభుత్వం అలుపెరుగక కృషి చేస్తోందన్నారు. 2014 వ సంవత్సరాని కంటే క్రితం ఇదివరకటి ప్రభుత్వాల కృషి లో లోపాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఆర్థిక సంఘం 70,000 కోట్ల కంటే తక్కువ మొత్తాన్ని మంజూరు చేసింది, దేశం యొక్క సువిశాలత్వాన్ని లెక్క లోకి తీసుకొన్నప్పుడు అది చాలా చిన్న మొత్తం, అయితే 2014 వ సంవత్సరం తరువాత ఈ గ్రాంటు ను 2 లక్షల కోట్ల కు పైచిలుకు కు పెంచడం జరిగిందని తెలియ జేశారు. 2014 వ సంవత్సరం కంటే క్రిందటి దశాబ్ద కాలం లో కేవలం 6,000 పంచాయతీ భవనాల ను నిర్మించడం జరగగా, వర్తమాన ప్రభుత్వం గడచిన 8 సంవత్సరాల లో 30,000కు పైగా పంచాయతీ భవనాల ను నిర్మించిందని ఆయన తెలియ జేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత 2 లక్షల కు పైగా గ్రామ పంచాయతీ లకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ లభించిందని, అంతకు పూర్వం ఈ ఆప్టికల్ ఫైబర్ సదుపాయం జతపడ్డ గ్రామ పంచాయతీలు 70 కి లోపే ఉండేవని కూడా ఆయన వెల్లడించారు. భారతదేశాని కి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఇదివరకటి ప్రభుత్వాలు, ప్రస్తుత పంచాయతీ రాజ్ వ్యవస్థ పట్ల విశ్వాస లోపాన్ని కలిగివుండేవని కూడా ఆయన అన్నారు. ‘భారతదేశం పల్లెల లోనే మనుగడ సాగిస్తుంద’ని చెప్పిన గాంధీ మహాత్ముని పలుకుల ను ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ఇదివరకటి హయాం ఆయన ఆదర్శాల పట్ల కనబరచిన శ్రద్ధ ఎంత మాత్రం లెక్క లోకి రాదని, తత్ఫలితం గా పంచాయతీ రాజ్ కొన్ని దశాబ్దుల తరబడి నిర్లక్ష్యాని కి లోనైందన్నారు. ప్రస్తుతం పంచాయతీ లు బారతదేశం యొక్క అభివృద్ధి కి ప్రాణవాయువు గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘పంచాయతీ లు సమర్థం గా కృషి చేయడాని కి గ్రామ పంచాయత్ వికాస్ యోజన తోడ్పడుతోంది’ని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
గ్రామాల కు మరియు నగరాల కు మధ్య అంతరాన్ని భర్తీ చేయడాని కి ప్రభుత్వం నిర్విరామం గా కృషి చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. డిజిటల్ రెవటూశన్ తో ముడిపడ్డ ప్రస్తుత కాలం లో పంచాయతీల ను స్మార్ట్ గా తీర్చిదిద్దడం జరుగుతోంది. పంచాయతీ లు చేపట్టే ప్రాజెక్టుల లో సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం జరుగుతోందని ఆయన వివరించారు. అమృత్ సరోవర్ అభియాన్ లో భాగం గా స్థలాల ఎంపిక తో పాటు ప్రాజెక్టు ను పూర్తి చేయడం వంటి అంశాలు అన్నీ కూడా సాంకేతిక విజ్ఞానం యొక్క అండదండల ను తీసుకొని ముందుకు పోతున్న విషయాన్ని ఒక ఉదాహరణ గా ప్రధాన మంత్రి పేర్కొన్నారు. పంచాయతీ స్థాయి లో సార్వజనిక సేకరణ నిమిత్తం జిఇఎమ్ (GeM) పోర్టల్ ను ఉపయోగించుకోవడం అనేది పంచాయతీల కు సేకరణ ను సులభం గా మరియు పారదర్శకమైంది గా మార్చివేయనుందని ఆయన అన్నారు. స్థానిక కుటీర పరిశ్రమ లు వాటి అమ్మకాల కు గాను ఒక బలమైన బాట ను కనుగొన గలుగుతాయని ప్రధాన మంత్రి అన్నారు.
పిఎమ్ స్వామిత్వ పథకం లో సాంకేతిక విజ్ఞానం యొక్క ప్రయోజనాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ఈ పథకం పల్లెల లో సంపత్తి హక్కుల రూపురేఖల ను మార్చివేస్తోంది. వివాదాల ను మరియు వ్యాజ్యాల ను తగ్గిస్తోందని ఆయన తెలియ జేశారు. డ్రోన్ సంబంధి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి పక్షపాతాని కి తావు లేని విధం గా సంపత్తి దస్తావేజు పత్రాలు ప్రజల కు లభించే అవకాశం ఏర్పడుతోందని ఆయన అన్నారు. దేశం లోని 75 వేల పల్లెల లో సంపత్తి కార్డు సంబంధిత పనులు పూర్తి అయ్యాయి అని ఆయన తెలియ జేశారు. ఈ దిశ లో మంచి పని ని చేసినందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు.
ఛింద్ వాడా అభివృద్ధి విషయం లో అలక్ష్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, తప్పు ను కొన్ని రాజకీయ పక్షాల యొక్క ఆలోచన విధానం పై మోపారు. స్వాతంత్య్రం అనంతర కాలం లో గ్రామీణ ప్రాంతాల మౌలిక అవసరాల ను ఉపేక్షించడం ద్వారా పాలక పక్షాలు పల్లెల్లోని పేద ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశాయని ఆయన అన్నారు.
पंचायती राज संस्थाएं लोकतंत्र की भावना को बढ़ावा देने के साथ हमारे नागरिकों के विकास की आकांक्षाओं को पूरा करती हैं। https://t.co/WJVhhWnj36
— Narendra Modi (@narendramodi) April 24, 2023
देश की ढाई लाख से अधिक पंचायतों को, राष्ट्रीय पंचायती राज दिवस की बहुत-बहुत शुभकामनाएं: PM @narendramodi pic.twitter.com/srdROkwBdW
— PMO India (@PMOIndia) April 24, 2023
आजादी के इस अमृतकाल में, हम सभी देशवासियों ने विकसित भारत का सपना देखा है और इसे पूरा करने के लिए दिन रात मेहनत कर रहे हैं। pic.twitter.com/tyHuErJ10j
— PMO India (@PMOIndia) April 24, 2023
2014 के बाद से, देश ने अपनी पंचायतों के सशक्तिकरण का बीड़ा उठाया है और आज इसके परिणाम नजर आ रहे हैं। pic.twitter.com/NPv7TTTw5E
— PMO India (@PMOIndia) April 24, 2023
डिजिटल क्रांति के इस दौर में अब पंचायतों को भी स्मार्ट बनाया जा रहा है। pic.twitter.com/XKhh2XKN2l
— PMO India (@PMOIndia) April 24, 2023
देश के गावों को जब बैंकों की ताकत मिली है, तो खेती-किसानी से लेकर व्यापार कारोबार तक, सब में गांव के लोगों की मदद हो रही है। pic.twitter.com/jPYn6wifQA
— PMO India (@PMOIndia) April 24, 2023
विकसित भारत के लिए देश की हर पंचायत, हर संस्था, हर प्रतिनिधि, हर नागरिक को जुटना होगा। pic.twitter.com/UEK7dmhIGX
— PMO India (@PMOIndia) April 24, 2023
हमारी पंचायतें, प्राकृतिक खेती को लेकर जनजागरण अभियान चलाएं। pic.twitter.com/bmdW1L1rbt
— PMO India (@PMOIndia) April 24, 2023
आजादी के अमृतकाल में हम अपने गांवों की सामाजिक, आर्थिक और पंचायती व्यवस्था को हर तरह से सशक्त करने में जुटे हैं, ताकि विकसित भारत का सपना साकार हो सके। pic.twitter.com/xb7pGjX3r8
— Narendra Modi (@narendramodi) April 24, 2023
डिजिटल क्रांति के इस दौर में अब पंचायतों को भी स्मार्ट बनाया जा रहा है। आज जिस Integrated e-GramSwaraj और GeM Portal का शुभारंभ हुआ है, उससे पंचायतों के माध्यम से होने वाली खरीद की प्रक्रिया बेहद सरल, सुलभ और पारदर्शी बनेगी। pic.twitter.com/LBMoNwsAso
— Narendra Modi (@narendramodi) April 24, 2023
आजादी के बाद सबसे लंबे समय तक सरकार चलाने वाली कांग्रेस ने ग्रामीण क्षेत्रों के विकास को सबसे निचले पायदान पर रखा। लेकिन 2014 के बाद हमने जिस प्रकार गांव के लोगों के हितों को सर्वोच्च प्राथमिकता दी, आज उसके अनेक उदाहरण सामने हैं। pic.twitter.com/P478LIB6it
— Narendra Modi (@narendramodi) April 24, 2023
बीते 9 वर्षों में मध्य प्रदेश सहित देशभर के गांवों में महिला सशक्तिकरण और रोजगार-स्वरोजगार के लिए हमारी सरकार ने जो अभूतपूर्व कदम उठाए हैं, उनकी आज हर तरफ चर्चा हो रही है। pic.twitter.com/mZLf0yiwSB
— Narendra Modi (@narendramodi) April 24, 2023
प्राकृतिक खेती को लेकर आज देश में व्यापक स्तर पर प्रयास हो रहे हैं। इस सिलसिले में पंचायतों से मेरा एक आग्रह है… pic.twitter.com/KJY983BovU
— Narendra Modi (@narendramodi) April 24, 2023