మధ్య ప్రదేశ్ లోని ఇందౌర్ లో ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్’ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు. మధ్య ప్రదేశ్ లో ఉన్న అనేక పెట్టుబడి అవకాశాల ను ఈ శిఖర సమ్మేళనం చాటిచెబుతోంది.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మొదట ఇన్ వెస్టర్ లకు మరియు నవ పారిశ్రామికవేత్తల కు సాదర స్వాగత వచనాల ను పలికారు. అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని నిర్మించడం లో మధ్య ప్రదేశ్ యొక్క పాత్ర ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘విశ్వాసం మొదలుకొని ఆధ్యాత్మికవాదం నుండి పర్యటన వరకు; అలాగే వ్యవసాయం మొదలుకొని విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి వరకు తీసుకుంటే మధ్య ప్రదేశ్ ఒక అపురూపమైన గమ్యస్థానం గా ఉంది’’ అని ఆయన అన్నారు. భారతదేశం యొక్క ‘అమృత కాలం’ తాలూకు స్వర్ణ యుగం ఆరంభమైపోయింది మరి అభివృద్ధి చెందినటువంటి ఒక భారతదేశాన్ని నిర్మించడం కోసం మనం అందరం కలిసికట్టు గా శ్రమిస్తున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రపంచం లో ప్రతి ఒక్క సంస్థ మరియు నిపుణుడు భారతదేశం పౌరుల పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడం పట్ల ప్రధాన మంత్రి ప్రసన్నత ను వెలిబుచ్చుతూ ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందిన భారతదేశాన్ని గురించి మాట్లాడుకొంటూ ఉంటామో అప్పుడు అది కేవలం మన ఆకాంక్షే కాదు, ఇది భారతదేశం లో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సంకల్పం గా ఉంది’’ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.
ప్రపంచ సంస్థ లు వ్యక్తం చేస్తున్న బరోసా కు సంబంధించిన ఉదాహరణల ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఐఎమ్ఎఫ్ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఒక ఉజ్వలమైన బిందువు గా భావిస్తోంది, అలాగే ప్రపంచ సవాళ్ళ ను పరిష్కరించడం లో అనేక ఇతర దేశాల తో పోలిస్తే భారతదేశం మెరుగైన స్థితి లో ఉంది అని ప్రపంచ బ్యాంకు ఇప్పటికే పేర్కొంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశాని కి గల బలమైన స్థూల ఆర్థిక పునాదుల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఈ సంవత్సరం లో జి-20 కూటమి లో భారతదేశం అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ల సరసన నిలబడుతుంది అని ఒఇసిడి చెప్పింది అని వెల్లడించారు. మోర్గన్ స్టేన్ లీ ని ప్రధాన మంత్రి ఉట్టంకిస్తూ, భారతదేశం రాబోయే 4- 5 సంవత్సరాల లో ప్రపంచం లోని మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచే దిశ లో సాగుతున్నది అన్నారు. వర్తమాన దశాబ్దం ఒక్కటే కాకుండా యావత్తు శతాబ్ది భారతదేశాని ది అంటూ మెక్ కిన్ సే ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) ప్రకటించారు అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ‘‘సంస్థ లు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ను పరిశీలిస్తున్న విశ్వసనీయమైన స్వరాల కు భారతదేశం పట్ల ఇది వరకు లేనటువంటి నమ్మకం ఏర్పడింది’’ అని ప్రధాన మంత్రి చెప్తూ, ‘‘గ్లోబల్ ఇన్ వెస్టర్ లు సైతం ఇదే తరహా ఆశాభావాన్ని కలిగివున్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఇన్ వెస్టర్ లలో చాలా మంది భారతదేశాన్ని వారి యొక్క పెట్టుబడి గమ్యస్థానం గా ఎంచుకొంటున్నారన్న ఒక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్యాంకు సర్వేక్షణ లో తేలినట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు. ‘‘ప్రస్తుతం భారతదేశం అందుకొంటున్న ఎఫ్ డిఐ రికార్డుల ను ఛేదించే స్థాయి లో నమోదు అవుతోంది. మా మధ్య కు మీరు రావడం సైతం ఇదే భావన ను సూచిస్తోంది’’ అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. దేశం పట్ల వ్యక్తం అవుతున్నటువంటి బలమైన ఆశావాదం తాలూకు ఖ్యాతి శక్తివంతమైన ప్రజాస్వామ్యం, యువత సంఖ్య అధికం గా ఉన్న దేశ జనాభా మరియు భారతదేశం లోని రాజకీయ స్థిరత్వం.. వీటిదే అని ఆయన అన్నారు. భారతదేశం నిర్ణయాలు జీవించడం లో సౌలభ్యాన్ని, వ్యాపార నిర్వహణ లో సౌలభ్యాన్ని పెంపొందింప చేస్తున్నాయి అని ఆయన నొక్కి చెప్పారు.
ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, 2014 వ సంవత్సరం నాటి నుండి భారతదేశం ‘రిఫార్మ్, ట్రాన్స్ ఫార్మ్ ఎండ్ పెర్ ఫార్మ్’ (‘సంస్కరించు, మార్పు చేయు మరియు చాటిచెప్పు) అనే మార్గాన్ని అనుసరిస్తూ పెట్టుబడి కి ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానం గా మారింది అని తెలియ జేశారు. ‘‘వంద సంవత్సరాల లో ఒకసారి తలెత్తే సంకటం ఎదురైనప్పటికీ కూడాను మేం సంస్కరణ ల మార్గం లో సాగిపోతున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
గడచిన ఎనిమిది సంవత్సరాల లో సంస్కరణ ల స్థాయి మరియు వేగం నిరంతరాయం గా వృద్ధి చెందుతూ వచ్చినట్లు ప్రధాన మంత్రి పేర్కొంటూ, ‘‘ఒక స్థిరమైన ప్రభుత్వం, ఒక నిర్ణయాత్మక శక్తి కలిగిన ప్రభుత్వం, సరి అయినటువంటి ఉద్దేశ్యాల తో సాగే ప్రభుత్వం అభివృద్ధి ని మునుపు ఎన్నడూ ఎరుగనంత వేగం గా చేసి చూపిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. బ్యాంకింగ్ రంగం లో మూలధన పునర్ వ్యవస్థీకరణ మరియు పాలన సంబంధి సంస్కరణల ను గురించి ఉదాహరిస్తూ, ఐబిసి వంటి ఆధునిక పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, జిఎస్ టి రూపం లో ‘వన్ నేశన్, వన్ ట్యాక్స్ ’ వంటి ఒక వ్యవస్థ ను నెలకొల్పడం, కార్పొరేట్ టాక్స్ ను ప్రపంచ దేశాల లో స్పర్థాత్మకమైంది గా తీర్చిదిద్దడం, సావ్ రిన్ వెల్థ్ ఫండ్స్ ను మరియు పెన్షన్ ఫండ్స్ ను పన్ను పరిధి లో నుండి మినహాయించడం, అనేక రంగాల లో 100 శాతం ఎఫ్ డిఐ ని ఆటోమేటిక్ రూట్ గుండా అనుమతించడం, స్వల్ప ఆర్థిక పొరపాటుల ను అపరాధాల పరిధి నుండి తప్పించడం, ఆ తరహా సంస్కరణ ల ద్వారా పెట్టుబడి మార్గం లో ఎదురయ్యే ఆటంకాల ను తొలగించడం గురించి ప్రస్తావించారు. భారతదేశం తన ప్రైవేటు రంగం యొక్క బలం పైన సమానమైన రీతి లో ఆధారపడుతూ ఉన్న సంగతి ని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటు రంగం యొక్క ప్రవేశాని కి అనువు గా రక్షణ, గనులు మరియు అంతరిక్షం ల వంటి పలు వ్యూహాత్మక రంగాల తలుపుల ను తెరవడం జరిగిందని ఆయన తెలియ జేశారు. డజన్ ల సంఖ్య లో ఉన్న శ్రమ చట్టాల ను 4 కోడ్ లుగా క్రోడీకరించడమైందని, ఇది ఒక ప్రధానమైన చర్య అని కూడా ఆయన చెప్పారు. నియమాల ను అనుసరించడం లో ఉన్న ఇబ్బందుల ను తగ్గించడం కోసం కేంద్రం స్థాయి లో, రాష్ట్రాల స్థాయి లో ఇదివరకు ఎన్నడూ లేని స్థాయి లో ప్రయాస లు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు గా 40,000 నియమాల పాలన సంబంధి అగత్యాల ను గత కొన్నేళ్ళ లో రద్దు చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. ‘‘నేశనల్ సింగిల్ విండో సిస్టమ్ ను మొదలుపెట్టడం తో, ఈ వ్యవస్థ లో ఇంతవరకు ఇంచుమించు 50 వేల అనుమతుల ను ఇవ్వడమైంది’’ అని ప్రధాన మంత్రి చెప్పారు.
పెట్టుబడి అవకాశాల లో వృద్ధి కి కారణమయ్యేటటువంటి నవీన మరియు బహుళ విధ మౌలిక సదుపాయాల కల్పన పథకాల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, రాజమార్గాల నిర్మాణం తాలూకు వేగం అనేది గడచిన 8 సంవత్సరాల లో రెండింత లు అయింది; అంతేకాదు, దేశం లో కార్యకలాపాల ను మొదలుపెట్టిన విమానాశ్రయాల సంఖ్య కూడా పెరిగింది అని ప్రధాన మంత్రి వివరించారు. భారతదేశం లో నౌకాశ్రయాల సరకుల హ్యాండిలింగ్ సామర్థ్యం తో పాటు టర్న్ అరౌండ్ టైము కూడా ఇదివరకు ఎన్నడు లేనంత గా మెరుగుపడిన విషయాన్ని కూడా ప్రధాన మంత్రి వివరించారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎక్స్ ప్రెస్ వేస్, లాజిస్టిక్స్ పార్క్ స్.. ఇవి అన్నీ న్యూ ఇండియా యొక్క గుర్తింపు గా మారుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ గతిశక్తి ని గురించి ఆయన మాట్లాడుతూ, అది భారతదేశం లో మౌలిక సదుపాయాల నిర్మాణాని కి గాను ఉద్దేశించిన ఒక జాతీయ వేదిక. నేశనల్ మాస్టర్ ప్లాన్ అనే రూపాన్ని అది సంతరించేసుకొంది అని ఆయన అన్నారు. దీని లో ప్రభుత్వాల కు, ఏజెన్సీల కు మరియు ఇన్వెస్టర్ లకు సంబంధించిన నవీకరించిన సమాచారం లభ్యమవుతోంది అని కూడా ఆయన చెప్పారు. ‘‘భారతదేశాన్ని ప్రపంచం లో అత్యంత స్పర్థాత్మకత కలిగిన లాజిస్టిక్స్ బజారు గా తీర్చిదిద్దాలి అనే ధ్యేయం తో మేం మా యొక్క నేశనల్ లాజిస్టిక్స్ పాలిసీ ని అమలు లోకి తీసుకు వచ్చాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
దేశం లో డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, స్మార్ట్ ఫోన్ డేటా వినియోగం లో, గ్లోబల్ ఫిన్ టెక్ లో మరియు ఐటి-బిపిఎన్ అవుట్ సోర్సింగ్ డిస్ట్రిబ్యూశన్ లో భారతదేశం ఒకటో స్థానం లో ఉంది అని వెల్లడించారు. భారతదేశం ప్రపంచం లో మూడో అతి పెద్ద విమానయానం మరియు ఆటో బజారు గా కూడా ఉంది అని ఆయన అన్నారు. ప్రపంచ వృద్ధి తాలూకు తదుపరి దశ కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఒక పక్క భారతదేశం ప్రతి గ్రామాని కి ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ను అందిస్తోంది, మరోపక్క 5జి నెట్ వర్క్ ను శరవేగం గా విస్తరింప చేస్తోంది కూడా అని తెలిపారు. 5జి, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, ఇంకా ఆర్టిషిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ల అండ తో ప్రతి ఒక్క పరిశ్రమ కు, వినియోగదారు కు కొత్త అవకాశాల ను కల్పించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. మరి దీనితో భారతదేశం లో వృద్ధి తాలూకు గతి వేగవంతం అవుతుంది అని ఆయన చెప్పారు.
తయారీ జగతి లో భారతదేశం యొక్క బలం చాలా వేగం గా వృద్ధి చెందుతున్న అంశాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించి, దీని తాలూకు ఖ్యాతి ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకాల కు దక్కుతుందన్నారు. పిఎల్ఐ స్కీముల లో భాగం గా 2.5 లక్షల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రోత్సాహకాల ను ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ పథకానికి ప్రపంచం అంతటా తయారీదారు సంస్థల లో మంచి ఆదరణ లభిస్తుండడాన్ని గురించి ప్రధాన మంత్రి పేర్కొంటూ, ఇంతవరకు మధ్య ప్రదేశ్ లో వేరు వేరు రంగాల లో వందల కోట్ల రూపాయల పెట్టుబడి తో 4 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. మధ్య ప్రదేశ్ ను ఒక పెద్ద ఔషధ నిర్మాణ నిలయం గాను, వస్త్ర ఉత్పత్తి కేంద్రం గాను నిలబెట్టడం లో పిఎల్ఐ స్కీము కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘పిఎల్ఐ స్కీము నుండి గరిష్ఠ ప్రయోజనాన్ని అందుకోవలసింది గా మధ్య ప్రదేశ్ కు విచ్చేస్తున్న ఇన్వెస్టర్ లకు నేను వి జ్ఞప్తి చేస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
గ్రీన్ ఎనర్జీ కి సంబంధించి భారతదేశాని కి ఉన్నటువంటి ఆకాంక్షల ను గురించి ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, గ్రీన్ హైడ్రోజన్ మిశన్ కు ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే ఆమోదాన్ని తెలిపిందని, ఈ మిశన్ తో దాదాపు గా 8 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడి అవకాశాల కు ఆస్కారం ఉందన్నారు. ఇది పెట్టుబడుల ను ఆకర్షించడానికి భారతదేశాని కి లభించిన ఒక అవకాశం మాత్రమే కాక గ్రీన్ ఎనర్జీ పరం గా ప్రపంచం లో ఉన్న డిమాండు ను తీర్చడాని కి సంబంధించిన అవకాశం కూడాను అని ఆయన అన్నారు. ఈ మహత్వాకాంక్ష భరిత మిశన్ లో ఇన్వెస్టర్ లు వారి భూమిక ఏమిటన్నది గుర్తెరగాలి. ఎందుకంటే ఈ ఉద్యమం లో భాగం గా వేల కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాల ను ఇవ్వజూపడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, పోషణ, నైపుణ్యాలు మరియు నవీన ఆవిష్కరణ లు వంటి రంగాల లో అనేకమైన అవకాశాలు ఉన్నాయి. మరి భారతదేశం తో చేతులు కలిపి ఒక నవీనమైనటువంటి గ్లోబల్ సప్లయ్ చైన్ ను నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని సూచిస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
Come and invest in Madhya Pradesh! My remarks at the Global Investors’ Summit being held in Indore. https://t.co/BLbKGUoZmZ
— Narendra Modi (@narendramodi) January 11, 2023
We are all working together to build a developed India. pic.twitter.com/8ssHZpJTfv
— PMO India (@PMOIndia) January 11, 2023
Institutions and credible voices that track the global economy have unprecedented confidence in India. pic.twitter.com/AsSpDEEWHA
— PMO India (@PMOIndia) January 11, 2023
Optimism for India is driven by strong democracy, young demography and political stability.
Due to these, India is taking decisions that boost ease of living and ease of doing business. pic.twitter.com/oVlaBIuGrF
— PMO India (@PMOIndia) January 11, 2023
India’s focus on strengthening multimodal infrastructure is opening up new possibilities of investment in the country. pic.twitter.com/TggFcQDkUm
— PMO India (@PMOIndia) January 11, 2023
Come, invest in India! pic.twitter.com/QjSKrOf8Z8
— PMO India (@PMOIndia) January 11, 2023
*****
DS/TS
Come and invest in Madhya Pradesh! My remarks at the Global Investors' Summit being held in Indore. https://t.co/BLbKGUoZmZ
— Narendra Modi (@narendramodi) January 11, 2023
We are all working together to build a developed India. pic.twitter.com/8ssHZpJTfv
— PMO India (@PMOIndia) January 11, 2023
Institutions and credible voices that track the global economy have unprecedented confidence in India. pic.twitter.com/AsSpDEEWHA
— PMO India (@PMOIndia) January 11, 2023
Optimism for India is driven by strong democracy, young demography and political stability.
— PMO India (@PMOIndia) January 11, 2023
Due to these, India is taking decisions that boost ease of living and ease of doing business. pic.twitter.com/oVlaBIuGrF
India's focus on strengthening multimodal infrastructure is opening up new possibilities of investment in the country. pic.twitter.com/TggFcQDkUm
— PMO India (@PMOIndia) January 11, 2023
Come, invest in India! pic.twitter.com/QjSKrOf8Z8
— PMO India (@PMOIndia) January 11, 2023