Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు- 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు- 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం


మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారూముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారూఇతర ప్రముఖులూసోదరీ సోదరులారా!  

ముందుగా నేను ఇక్కడికి రావడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరుతున్నాను. 10, 12వ తరగతి విద్యార్థులకు ఈ రోజు పరీక్షలున్నాయని నిన్న నేనిక్కడికి వచ్చినప్పుడు తెలిసిందివారి పరీక్షల సమయంరాజ్ భవన్ నుంచి నేను బయలుదేరే సమయం ఒకేసారి ఉన్నాయిభద్రతా కారణాల దృష్ట్యా రోడ్లను మూసేస్తే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు పడతారువారికి అసౌకర్యం కలగకుండా విద్యార్థులంతా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నాకే రాజ్ భవన్ నుంచి బయలుదేరాలని నిర్ణయించుకున్నానుఅందుకే ఆలస్యమైందిఅలా కావాలనే నేను నా ప్రయాణాన్ని 15-20 నిమిషాలు ఆలస్యం చేశానుఇది మీకు కొంత అసౌకర్యాన్ని కలిగించిందినన్ను మన్నించాలని మరోసారి మీ అందరినీ కోరుతున్నాను

మిత్రులారా,

భోజరాజు పాలించిన ఈ పవిత్ర నగరానికి మిమ్మల్ని స్వాగతించడం నాకు గర్వకారణంవివిధ పరిశ్రమలుఅనేక రంగాలకు చెందిన చాలామంది సహచరులు నేడిక్కడ సమావేశమయ్యారు. ‘వికసిత మధ్యప్రదేశ్’ నుంచి ‘వికసిత భారత్’ దిశగా సాగుతున్న ప్రస్థానంలో ఈ కార్యక్రమానికి విశేష ప్రాధాన్యముందిఈ బృహత్కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మోహన్ గారికిఆయన బృందానికి నా హృదయపూర్వక అభినందనలు.

మిత్రులారా,

ప్రపంచం యావత్తూ భారత్ పట్ల ఇంత ఆశావహంగా ఉండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారిసామాన్యులుఆర్థిక నిపుణులుపలు దేశాలులేదా అంతర్జాతీయ సంస్థలు… ఏవైనా కావచ్చు – అందరికీ భారత్ పై భారీ అంచనాలున్నాయికొన్ని వారాలుగా చేసిన వ్యాఖ్యలు భారత్ లోని పెట్టుబడిదారులందరిలో ఉత్సాహాన్ని పెంచాయికొన్నేళ్లలో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని కొన్ని రోజుల కిందటే ప్రపంచ బ్యాంకు పేర్కొన్నదిప్రపంచ భవిష్యత్తు భారత్ లోనే ఉన్నదని ఓఈసీడీ కీలక ప్రతినిధి వ్యాఖ్యానించారువాతావరణ మార్పులపై పనిచేసే ఐక్యరాజ్యసమితి సంస్థ ఇటీవల భారత్ ను సౌరశక్తిలో అగ్రగామిగా పేర్కొన్నదిఅనేక దేశాలు మాటలకే పరిమితమవుతుండగాభారత్ ఫలితాలను సాధిస్తోందని కూడా ఈ సంస్థ పేర్కొన్నదిఅంతర్జాతీయ ఏరోస్పేస్ సంస్థలకు అద్భుతమైన సరఫరా శ్రేణీ నిలయంగా భారత్ ఎదుగుతున్న తీరును తాజా నివేదిక వివరిస్తోందిఅంతర్జాతీయంగా సరఫరా శ్రేణిలో ఎదురవుతున్న సవాళ్లకు భారత్ ను పరిష్కారంగా చాలా మంది భావిస్తున్నారుభారతదేశంపై ప్రపంచానికి విశ్వాసం పెరుగుతున్నదని చాటే అనేక ఉదాహరణలను నేను చెప్పగలనుఇది భారత్ లోని ప్రతీ రాష్ట్ర విశ్వాసాన్ని కూడా శక్తిమంతం చేస్తోందినేడు మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న ఈ ప్రపంచ సదస్సులో ఆ సానుకూలత స్పష్టంగా వ్యక్తమవుతోంది.

మిత్రులారా,

జనాభా పరంగా మధ్యప్రదేశ్ దేశంలో అయిదో అతిపెద్ద రాష్ట్రంవ్యవసాయంలో అగ్ర రాష్ట్రాలలో ఒకటిఖనిజ వనరులలో మొదటి అయిదు రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ఒకటిగా ఉందిరాష్ట్రానికి జవసత్వాలనిస్తూ నర్మదామాత మధ్యప్రదేశ్ కు ఆశీస్సులు అందిస్తోందిజీడీపీలో కూడా దేశంలోని అయిదు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించగల సామర్థ్యంఅపారమైన అవకాశాలు ఇక్కడ ఉన్నాయి.

మిత్రులారా,

విప్లవాత్మకమైన మార్పుల దిశగా గత రెండు దశాబ్దాలుగా కొత్త శకంలో మధ్యప్రదేశ్ పయనిస్తోందిఒకప్పుడు విద్యుత్నీటి సరఫరాలో పెద్ద సవాళ్లనే రాష్ట్రం ఎదుర్కొన్నదిశాంతిభద్రతల పరిస్థితీ దారుణంగా ఉండి పారిశ్రామికాభివృద్ధి కష్టతరమైందిఅయితే గత 20 ఏళ్లుగా ప్రజల మద్దతుతో మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టి సారించిందిరెండు దశాబ్దాల కిందట మధ్యప్రదేశ్ లో పెట్టుబడులకు పెట్టుబడిదారులు వెనుకాడేవారుకానీనేడు దేశంలో అత్యధిక పెట్టుబడుల గమ్యస్థానంగా ఈ రాష్ట్రం నిలిచిందిఒకప్పుడు ఇక్కడ రోడ్లు సరిగా లేక బస్సు ప్రయాణం కూడా కష్టంగా ఉండేదికానీ నేడుదేశంలో ఎలక్ట్రిక్ వాహన విప్లవంలో ముందువరుసలో నిలిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. 2025 జనవరి నాటికి 90% వృద్ధిని నమోదు చేస్తూ.. రాష్ట్రంలో దాదాపు లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయికొత్త ఉత్పాదక రంగాలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మధ్యప్రదేశ్ వేగంగా ఎదుగుతోందనడానికి ఇది నిదర్శనంఈ సంవత్సరాన్ని పరిశ్రమలుఉపాధి సంవత్సరంగా ప్రకటించిన మోహన్ గారికిఆయన బృందానికి నా అభినందనలు.

మిత్రులారా,

గత దశాబ్దకాలంలో భారత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో దూసుకుపోతోందిదీనివల్ల మధ్యప్రదేశ్ ఎంతో ప్రయోజనం పొందిందని నేను నమ్మకంగా చెప్పగలనుదేశంలోని రెండు అతిపెద్ద నగరాలను కలిపే ఢిల్లీ – ముంబయి ఎక్స్ ప్రెస్ రహదారి ఎక్కువ భాగం మధ్యప్రదేశ్ గుండా వెళ్తోందిఅంటేఓవైపు ముంబయి ఓడరేవులను వేగంగా చేరుకోవడంతోపాటు ఉత్తర భారత మార్కెట్లతో కూడా మధ్యప్రదేశ్ అనుసంధానమవుతోందిప్రస్తుతం మధ్యప్రదేశ్ లో లక్షల కిలోమీటర్లకు పైగా రోడ్లున్నాయిరాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్లను ఆధునిక ఎక్స్ ప్రెస్ రహదారులతో అనుసంధానం చేస్తున్నారుమధ్యప్రదేశ్ లో రవాణా రంగంలో వేగవంతమైన వృద్ధికి ఇది నిదర్శనం.

మిత్రులారా,

విమాన రవాణా విషయానికొస్తే గ్వాలియర్జబల్పూర్ విమానాశ్రయాల టెర్మినళ్లను విస్తరించాంఅంతటితో మేం ఆగిపోలేదు… విస్తృతమైన మధ్యప్రదేశ్ రైల్వే వ్యవస్థను కూడా ఆధునికీకరిస్తున్నాంరాష్ట్రంలో 100 శాతం రైల్వేల విద్యుదీకరణ జరిగిందిభోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ దాని రూపురేఖలతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిందిఈ నమూనాను అనుసరించి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మధ్యప్రదేశ్ లోని 80 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నాం.

మిత్రులారా,

గత దశాబ్దంలో భారత ఇంధన రంగంలో అపూర్వమైన వృద్ధి నమోదైందిముఖ్యంగా హరిత ఇంధనం విషయంలో ఊహకందని విజయాన్ని దేశం సాధించిందిగత పదేళ్లలో ఇంధన రంగంలో 70 బిలియన్ డాలర్లకు పైగాఅంటే రూ. 5 ట్రిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టాందీంతో గత ఏడాది కాలంలోనే పర్యావరణ హిత ఇంధన రంగంలో పది లక్షలకు పైగా ఉద్యోగాలు లభించాయిఇంధన రంగంలో ఈ అసాధారణమైన వృద్ధి వల్ల మధ్యప్రదేశ్ కూడా విశేషమైన ప్రయోజనాలు పొందిందినేడు దాదాపు 31,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో మధ్యప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉందిఇందులో 30% పర్యావరణ హిత ఇంధన వనరుల నుంచి లభిస్తోందిదేశంలోని అతిపెద్ద సోలార్ పార్కులలో రేవా సోలార్ పార్క్ ఒకటిఇటీవలే ఓంకారేశ్వర్ లో తేలియాడే సోలార్ ప్లాంటును ప్రభుత్వం ప్రారంభించిందిఅంతేకాకుండామధ్యప్రదేశ్ ను పెట్రోకెమికల్స్ లో ప్రధాన కేంద్రంగా నిలపడానికి దోహదం చేసే బినా రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్సులో ప్రభుత్వం రూ. 50,000 కోట్ల పెట్టుబడి పెట్టిందిఆధునిక విధానాలుప్రత్యేక పారిశ్రామిక అవస్థాపన ద్వారా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేయూతనిస్తోందిరాష్ట్రంలో ఇప్పటికే 300కు పైగా పారిశ్రామిక మండళ్లున్నాయిపీఠంపూర్రాట్లాందేవాస్ లలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో భారీ పెట్టుబడి జోన్లు ఏర్పాటవుతున్నాయివీటిద్వారా పెట్టుబడిదారులందరికీ అత్యధిక రాబడులు లభించేలా అపారమైన అవకాశాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోంది.

మిత్రులారా,

పారిశ్రామికాభివృద్ధికి నీటి భద్రత ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసుఇందుకోసం ఓ వైపు జలసంరక్షణపై దృష్టి సారిస్తూనే మరోవైపు నదుల అనుసంధానం అనే బృహత్తర కార్యక్రమంతో ముందుకెళ్తున్నాంఈ కార్యక్రమం ద్వారా ప్రధానంగా మధ్యప్రదేశ్ వ్యవసాయంపరిశ్రమలు లబ్ధి పొందనున్నాయికెన్బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు పనులు రూ. 45,000 కోట్ల పెట్టుబడితో ఇటీవల ప్రారంభమయ్యాయిఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో ఉత్పాదకత పెరుగుతుందిమధ్యప్రదేశ్ లో నీటి నిర్వహణను కూడా ఇది గణనీయంగా బలోపేతం చేస్తుందిఇలాంటి కార్యక్రమాలు ఆహార శుద్ధివ్యావసాయిక పరిశ్రమలుటెక్స్ టైల్ రంగాల్లో రాష్ట్రానికి అపారమైన అవకాశాలను అందిస్తాయి.  

మిత్రులారా,

మధ్య ప్రదేశ్‌లో డబల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాకఅభివృద్ధి వేగం కూడా రెట్టింపయిందిరాష్ట్రాన్నిదేశాన్ని అభివృద్ధి చేయడానికి మధ్య ప్రదేశ్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం భుజం భుజం కలిపి పనిచేస్తోందిఎన్నికలప్పుడుమేంమా మూడో పదవీకాలంలో మూడింతలు వేగంగా పనిచేస్తామని నేను అన్నానుఈ ఏడాదిలో తొలి 50 రోజుల్లో ఇప్పటికే ఈ వేగాన్ని మనం చూశాంఈ నెలలోనేమా బడ్జెటును ప్రవేశపెట్టాంఈ బడ్డెటులోభారత్ వృద్ధికి అవసరమయ్యే ప్రతి ఒక్క ఉత్ప్రేరకానికీ మేం శక్తిని అందించాంమా పన్ను చెల్లింపుదారుల్లో అతి పెద్ద వర్గం మధ్యతరగతిఅంతేకాదు సేవలకూతయారీకీ గిరాకీని కల్పిస్తోంది ఈ వర్గంమధ్యతరగతికి సాధికారతను కల్పించడానికి ఈ బడ్జెటులో మేం అనేక చర్యలు తీసుకొన్నాంమేం 12 లక్షల రూపాయల వరకు ఆదాయానికి పన్ను లేకుండా చేయడంతోపాటు పన్ను శ్లాబులలో మార్పులు చేశాంబడ్జెటు తరువాత ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది.

మిత్రులారా,  

బడ్జెటు స్థానిక సరఫరా వ్యవస్థ (లోకల్ సప్లయ్ చైన్)ను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేస్తోందిఅదే జరిగితే మనం తయారీ రంగంలో సంపూర్ణంగా స్వయంసమృద్ధం కాగలుగుతాంసూక్ష్మ లఘు మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎంఎస్ఎంఈఅవకాశాలకు ఇదివరకటి ప్రభుత్వాలు గిరి గీసిన కాలమంటూ ఒకటి ఉండిందిఇది భారత్‌లో స్థానిక సరఫరా వ్యవస్థ పూర్తి స్థాయిలో రూపుదాల్చకుండా అడ్డుకొందిప్రస్తుతంమేం ఎంఎస్ఎంఈల నాయకత్వంలో స్థానిక సరఫరా హారాన్ని తయారు చేయడానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నాంఎంఎస్ఎంఈల పరిధిని మరింత మెరుగుపరిచిరుణ సదుపాయంతో ముడిపెట్టిన ప్రోత్సాహకాలను అందిస్తూమునుపటితో పోలిస్తే రుణ ప్రాప్తి అవకాశాల్ని సరళతరం చేసివిలువ జోడింపునకు మరింతగా మద్దతిచ్చి ఎగుమతులను పెంచే చర్యలను తీసుకున్నాం.

మిత్రులారా,

గత పది సంవత్సరాలుగామేం జాతీయ స్థాయిలో ప్రధాన సంస్కరణల జోరును పెంచాంప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోస్థానిక స్థాయిలలో కూడా సంస్కరణలను ప్రోత్సహిస్తున్నాంబడ్జెటులో ప్రస్తావించిన స్టేట్ డీరెగ్యులేషన్ కమిషనును గురించి నేను ప్రధానంగా చెప్పదలచుకొన్నానుమేం రాష్ట్రాలతో అదేపనిగా సంప్రదింపులు జరుపుతున్నాంగత కొన్ని సంవత్సరాల్లోరాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 40,000 కన్నా ఎక్కువ నియమపాలన షరతుల్ని తగ్గించాంఇటీవలి సంవత్సరాల్లోసుమారు 1,500 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాంఆ చట్టాలు వాటిని ప్రవేశపెట్టిన ప్రయోజనాలను ఇక ఎంతమాత్రం నెరవేర్చడంలేదువ్యాపార నిర్వహణలో సౌలభ్యానికి అడ్డుపడుతున్న నిబంధనలను గుర్తించాలన్నదే మా ధ్యేయంరాష్ట్రాలలో పెట్టుబడులకు అనుకూలంగా ఉండే నియంత్రణల సంబంధి విస్తారిత అనుబంధ వ్యవస్థ (రెగ్యులేటరీ ఇకోసిస్టమ్)ను ఏర్పాటుచేయడంలో డీరెగ్యులేషన్ కమిషన్ తోడ్పడుతుంది.

మిత్రులారా,

ఈ సారి బడ్జెటులోమేం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ స్వరూపాన్ని కూడా సులభతరంగా చేశాంపరిశ్రమలకు అత్యవసరమయ్యే అనేక ఇన్‌పుట్స్‌ రేట్లను తగ్గించాందీనికి అదనంగాప్రైవేటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికీపెట్టుబడులు పెరగడానికీ కొత్త కొత్త రంగాలను అనుమతిస్తూ వస్తున్నాంఈ ఏడాదిలోపెట్టుబడులకు అనేక నూతన రంగాలను మేం అనుమతించాంవాటిలో పరమాణు శక్తిబయోమాన్యుఫాక్చరింగ్కీలక ఖనిజాల ప్రాసెసింగ్లిథియం అయాన్ బ్యాటరీల తయారీ రంగాలు ఉన్నాయిఇది మా ప్రభుత్వ ఉద్దేశాలనునిబద్ధతను చాటిచెబుతోంది.

మిత్రులారా,

భారత్‌కు అభివృద్ధి ప్రధానమైన భవిష్యత్తును అందించడంలో మూడు రంగాలది కీలక పాత్రఈ మూడు రంగాలు లక్షల కొద్దీ కొత్త కొలువులను సృష్టించగలుగుతాయిఇవే.. వస్త్రాలుపర్యాటకంటెక్నాలజీ రంగాలుమనం వస్త్ర రంగంపై దృష్టి సారిస్తే భారత్ పత్తిపట్టుపాలియెస్టర్విస్కోస్‌ల రెండో అతి పెద్ద తయారీదారు దేశంగా ఉందిజౌళి పరిశ్రమ లక్షలాది ప్రజలకు బతుకుతెరువును చూపుతోందివస్త్రాల తయారీలో భారత్‌కు బలమైన పరంపరచేయితిరిగిన శ్రామికలోకంతోపాటు ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తి ఉందిమా దేశంలో ఉత్పత్తి అవుతున్న ఆర్గానిక్ కాటన్‌లో దాదాపుగా నాలుగో వంతు మధ్య ప్రదేశ్ నుంచే అందుతోంది.  దేశంలోనే అతి ప్రధాన మల్బరీ రకం పట్టు ఉత్పత్తిదారుగా ఈ రాష్ట్రం వర్ధిల్లుతోందిఇక్కడ ఉత్పత్తి చేసే ప్రఖ్యాత చందేరిమహేశ్వరి చీరలు అమిత ప్రజాదరణకు నోచుకోవడంతోపాటు జీఐ ట్యాగ్ హోదాను కూడా చేజిక్కించుకొన్నాయిఈ రంగంలో మీరు పెట్టే పెట్టుబడులు మధ్య ప్రదేశ్‌లో తయారయ్యే వస్త్రాలు ప్రపంచ శ్రేణి ప్రభావాన్ని ప్రసరించడంలో సార్థక మద్దతును అందించగలుగుతాయి.

మిత్రులారా,

సాంప్రదాయక వస్త్రాలకు తోడుభారత్ కొత్త దారులను సైతం వెతుకుతోందిమేం అగ్రో టెక్స్‌టైల్స్‌కుమెడికల్ క్స్‌టైల్స్‌కుజియోటెక్స్‌టైల్స్‌కు సాయపడుతున్నాంఇవి సాంకేతిక వస్త్రాల వర్గంలోకి వస్తాయిదీనికోసం ఒక జాతీయ ఉద్యమాన్ని మొదలుపెట్టాంమరి మేం దీనికి బడ్జెటులో ప్రోత్సాహకాలను ప్రకటించాంమీరు ‘పీఎం మిత్ర స్కీము’ గురించి కూడా తెలుసుకొనే ఉంటారు.. దీనిలో భాగంగా దేశం నలుమూలలా ఏడు ప్రధాన టెక్స్‌టైల్ పార్కులను తీర్చిదిద్దుతారుఈ పార్కులలో ఒక పార్కును మధ్య ప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్నారుఇది జౌళి రంగం వ‌ృద్ధి చెందడానికి మరింతగా ఊతాన్నందిస్తుందిజౌళి పరిశ్రమ కోసం ప్రకటించిన పీఎల్ఐ స్కీము తాలూకు పూర్తి ప్రయోజనాలను పొందాలంటూ నేను మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

మిత్రులారా,

వస్త్రాలలో మాదిరిగానేభారత్ తన పర్యాటక రంగానికి కూడా కొత్త కోణాలను జోడిస్తోందిమధ్య ప్రదేశ్ టూరిజంలో ఓ ప్రచార ఉద్యమం ‘‘ఎంపీ అజబ్ భీ హైసబ్‌సే గజబ్ భీ హై’’ అని సూచించేది.. ఈ మాటలకు– మధ్య ప్రదేశ్ అద్వితీయమైందిఅలాగే అత్యంత అపరూపమైంది– అని భావంమధ్య ప్రదేశ్ ‌లోనర్మద నది చుట్టుపక్కలఇంకా ఆదివాసీ ప్రాంతాలలో పర్యాటక రంగ సంబంధి మౌలిక సదుపాయాల కల్పనలో విశేషమైన ప్రగతి చోటు చేసుకొంది.  ఈ రాష్ట్రం అనేక జాతీయ ఉద్యానాలకు నిలయంఅంతేకాక ఆరోగ్య ప్రధాన పర్యాటక రంగానికీవెల్‌నెస్ టూరిజానికీ ఎన్నో అవకాశాలను అందిస్తోంది‘‘హీల్ ఇన్ ఇండియా’’ అనే మాటలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకొంటున్నాయిఆరోగ్యంవెల్‌నెస్ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు నిరంతరాయంగా అధికం అవుతూ ఉన్నాయిఈ కారణంగానే మా ప్రభుత్వం ఈ రంగంలో పబ్లిక్ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తోందిభారత్ సాంప్రదాయక వైద్య చికిత్స పద్ధతులనుఅలాగే ఆయుష్‌ను కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తోందిమేం ఆయుష్ వీజాలంటూ ప్రత్యేక వీజాలను సైతం జారీ చేస్తున్నాంఈ కార్యక్రమాలు అన్నీ మధ్య ప్రదేశ్‌కు కూడా ఎంతో ప్రయోజనకారిగా మారుతాయి.

అన్నట్టుమిత్రులారా,

మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టిఉజ్జయినిలో మహాకాలుని మహాలోకాన్ని చూడాల్సిందిగా నేను మీకు సూచిస్తున్నానుమీరు మహాకాలుని ఆశీర్వాదాలను అందుకోవడంతోపాటు మా దేశం తన పర్యాటకఆతిథ్య రంగాలను ఎలా విస్తరిస్తోందో కూడా తెలుసుకోగలుగుతారు

మిత్రులారా,

నేను ఎర్ర కోట మీద నుంచి మాట్లాడుతూ ‘‘ఈ కాలంసరైన కాలం’’ అని చెప్పానుమీరు మధ్య ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికీపెట్టిన పెట్టుబడులను విస్తరించడానికీ ఇదే సరైన తరుణంమరోసారిమీకందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.

గమనికఇది ప్రధాని ఉపన్యాసానికి భావానువాదంఆయన హిందీలో ప్రసంగించారు.

 

***