లా కమిషన్ తన 158వ నివేదికలో చేసిన సిఫార్సు మేరకు – సేవించే మద్యం ( పాటబుల్ ఆల్కహాల్ ) తయారీపై నియంత్రణ అధికారాలను రాష్ట్రాలకు బదలాయించే విధంగా పరిశ్రమలు, ( అభివృద్ధి, నియంత్రణ ) చట్టం- 1951లో మొదటి షెడ్యూల్లో సవరణకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
`పారిశ్రామిక అభివృద్ధి, నియంత్రణ చట్టం 1951, మొదటి షెడ్యూల్లో ప్రస్తుతం ఉన్న` 26- ఫెర్మంటేషన్ ఇండస్ట్రీస్ `కు బదులుగా `26- ఫెర్మంటేషన్ ఇండస్ట్రీస్ ` (పాటబుల్ ఆల్కహాల్ కాకుండా ) అనే సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణతో ఆల్కహాల్
– సేవించేందుకు వినియోగించే మద్యం,పాటబుల్ ఆల్కహాల్ – పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ తయారీకి
సంబంధించి దీర్ఘకాలంగా కేంద్ర – రాష్ట్రాలకు మధ్య గల పరిధిలపై ఉన్న గందరగోళానికి తెరపడి ఈ సమస్యకు పరిష్కారం
లభించినట్లయింది. ఈ సవరణతో కేంద్ర` రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమతుల్యం ఏర్పడుతుంది. చట్ట ఉల్లంఘనకు ఆస్కారం ఉండదు.
ఆల్కహాల్ను దుర్వినియోగపరచే అవకాశం ఏ మాత్రం ఉండదు. సేవిత ప్రయోజనాల కోసం తయారు చేసే మద్యం ఉత్పత్తి నియంత్రణ
ప్రత్యేకంగా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. అదే విధంగా సేవిత ప్రయోజనాల కోసం వినియోగించే మద్యం తయారీకి పూర్తి జవాబుదారీ
కూడా రాష్ట్రాలదే అవుతుంది.
నేపథ్యం ;
1997వ సంవత్సరంలో బీహార్ డిస్టిల్లరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఒక కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన
ఒక తీర్పు ఆధారంగా , పరిశ్రమలు, ( అభివృద్ధి, నియంత్రణ ) చట్టం- 1951లో మొదటి షెడ్యూల్లో సవరణను తీసుకు రావలసిన
అవసరం ఏర్పడింది. త్రాగు మద్యం – సాటబుల్ ఆల్కహాల్ తయారీ చేసే పరిశ్రమలు రాష్ట్ర పరిధిలోనే ఉండాలని, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉత్పత్తి చేసే పరిశ్రమల నియంత్రణ కేంద్ర పరిధిలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది.. తదనంతరం
లా కమిషన్ తన 158వ నివేదికలో తనంతట తానుగా సుప్రీం కోర్టు నిర్ణయం దృష్ట్యా ఆచరణలో ఉత్పన్నం కాబోయే సమస్యలను
వివరిస్తూ చట్టంలో సవరణకు వీలుగా సిఫార్సు చేసింది. మొదటి షెడ్యూల్లో 26 వ అంశం బదులుగా ` యు- ఫెర్మంటేషన్
ఇండస్ట్రీస్ ( అల్కహాల్ ను చేర్చకుండా ) సవరణ ఉండాలని సిఫార్సు చేసింది.
అయితే ప్రస్తుతం అమలులో ఉన్న లైసెన్సింగ్ అవసరాలు, సుప్రీం కోర్టు తీర్పు అంశాలను దృష్టిలో ఉంచుకుని – పారిశ్రామిక
విధానం, ప్రమోషన్ విభాగం ఇతర సంబంధిత శాఖలతోను, మంత్రిత్వ శాఖలతోను సంప్రదింపులు జరిపిన మీదట ఈ చట్ట సవరణను
ఆమోదించింది.