ఉపాధి కల్పన సామర్థ్యంతో సహా ప్రధాన ప్రభావం
పిఎం– ఎం కె ఎస్ ఎస్ వై ఉద్దేశాలు, లక్ష్యాలు:
అమలు వ్యూహం:
సబ్ స్కీమ్ ఈ క్రింది ప్రధాన భాగాలను కలిగి ఉంది:
ఎ)కాంపోనెంట్ 1-ఎ: ఫిషరీస్ రంగాన్ని క్రమబద్ధీకరించడం , వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సింగ్ కోసం భారత ప్రభుత్వ కార్యక్రమాలకు ఫిషరీస్ మైక్రోఎంటరైజ్ ల ప్రాప్యతను సులభతరం చేయడం:
మత్స్య రంగం అసంఘటిత రంగం కావడంతో చేపల ఉత్పత్తిదారులు, చేపల కార్మికులు, విక్రేతలు, ప్రాసెసర్లు జాతీయ స్థాయిలో ఈ రంగంలో పనిచేస్తున్న సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలతో సహా చేపల ఉత్పత్తిదారులు, ఇతర సహాయదారుల రిజిస్ట్రీలను సృష్టించడం ద్వారా చేపల పెంపకాన్ని క్రమంగా క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం..నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ ఫాం (ఎన్ ఎఫ్ డి పి) సృష్టించబడుతుంది దానిపై నమోదు చేయడానికి భాగస్వాములందరినీ సమీకరిస్తారు. వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రోత్సహిస్తారు. ఆర్థిక ప్రోత్సాహకాల పంపిణీ సహా బహుళ విధులను ఎన్ ఎఫ్ డి పి నిర్వహిస్తుంది. శిక్షణ, విస్తరణ మద్దతు, ఆర్థిక అక్షరాస్యతను మెరుగుపరచడం, ఆర్థిక సహాయం ద్వారా ప్రాజెక్టు తయారీ , డాక్యుమెంటేషన్ ను సులభతరం చేయడం, ప్రాసెసింగ్ ఫీజు , ఇతర ఛార్జీలు ఏవైనా ఉంటే వాటిని తిరిగి చెల్లించడం , ఇప్పటికే ఉన్న మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేయడం వంటి కార్యకలాపాలను చేపట్టాలని ప్రతిపాదించారు
బి)కాంపోనెంట్ 1-బి: ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని సులభతరం చేయడం:
తగిన బీమా ప్రొడక్ట్ ను సృష్టించడానికి , ప్రాజెక్ట్ కాలంలో కనీసం లక్ష హెక్టార్ల ఆక్వాకల్చర్ పొలాలను కవర్ చేయడాన్ని ఇది ప్రతిపాదిస్తున్నది. 4 హెక్టార్లు, అంతకంటే తక్కువ విస్తీర్ణం నీరు పారే భూములతో బీమా కొనుగోలు చేసే రైతులకు వన్ టైమ్ ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆక్వాకల్చర్ ఫామ్ లోని వాటర్ స్ప్రెడ్ ఏరియాకు హెక్టారుకు రూ.25,000 పరిమితికి లోబడి ప్రీమియం వ్యయంలో 40 శాతం చొప్పున ‘వన్ టైమ్ ఇన్సెంటివ్ ‘ ఉంటుంది. ఒక రైతుకు చెల్లించాల్సిన గరిష్ట ప్రోత్సాహకం రూ.1,00,000, ప్రోత్సాహకానికి అర్హులైన వారి గరిష్ట వ్యవసాయ పరిమాణం 4 హెక్టార్ల నీటి వ్యాప్తి ప్రాంతం. కేజ్ కల్చర్, రీ–సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టం (ఆర్ఏఎస్), బయో–ఫ్లోక్, రేస్ వేస్ వంటి పొలాలు కాకుండా ఆక్వాకల్చర్ మరింత ఇంటెన్సివ్ రూపానికి చెల్లించాల్సిన ప్రోత్సాహకం ప్రీమియంలో 40%. చెల్లించాల్సిన గరిష్ట ప్రోత్సాహకం ఒక లక్ష కాగా గరిష్ట యూనిట్ పరిమాణం 1800 m3. ఒక పంటకు అంటే ఒక పంట కాలానికి మాత్రమే కొనుగోలు చేసిన ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ కు ‘వన్ టైమ్ ఇన్సెంటివ్ ‘ ప్రయోజనాన్ని అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా లబ్ధిదారులకు జనరల్ కేటగిరీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకంలో 10 శాతం అదనపు ప్రోత్సాహకం అందిస్తారు. దీనివల్ల ఆక్వాకల్చర్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులకు బలమైన మార్కెట్ ఏర్పడుతుందని, భవిష్యత్తులో బీమా కంపెనీలు ఆకర్షణీయమైన బీమా ఉత్పత్తులను తీసుకురావడానికి వీలవుతుందని భావిస్తున్నారు.
సి)కాంపోనెంట్ 2: మత్స్య రంగ విలువ గొలుసు సామర్థ్యాలను మెరుగుపరచడానికి సూక్ష్మ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం:
అనుబంధ విశ్లేషణలు , అవగాహన ప్రచారాలతో పనితీరు గ్రాంట్ల వ్యవస్థ ద్వారా మత్స్య రంగంలో విలువ గొలుసు సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ భాగం ప్రయత్నిస్తుంది. మహిళలకు ప్రాధాన్యమిస్తూ ఉద్యోగాల ఉత్పత్తి, సృష్టి, నిర్వహణలో సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించాలని, కొలవదగిన పారామీటర్ల కింద ఎంపిక చేసిన విలువ గొలుసుల్లో పనితీరు గ్రాంట్ల ద్వారా విలువ గొలుసు సామర్థ్యాలను పెంపొందించాలని ప్రతిపాదించారు.
పనితీరు గ్రాంట్ పరిమాణం,పనితీరు గ్రాంట్లను అందించడానికి ప్రమాణాలు క్రింద సూచించబడ్డాయి:
i. జనరల్ కేటగిరీకి మైక్రోఎంటర్ప్రైజ్కు పనితీరు గ్రాంట్ మొత్తం పెట్టుబడిలో 25% లేదా రూ.35 లక్షలు, ఏది తక్కువైతే అది. ఎస్ సి, ఎస్ టి, మహిళలకు మొత్తం పెట్టుబడిలో 35% లేదా రూ.45 లక్షలు, ఏది తక్కువైతే అది.
ii. గ్రామ స్థాయి సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, ఎఫ్ ఎఫ్ పి ఒ లు, సహకార సంఘాల సమాఖ్యలకు పెర్ఫార్మెన్స్ గ్రాంట్ మొత్తం పెట్టుబడిలో 35% లేదా రూ.200 లక్షలకు మించరాదు.
iii. పైన పేర్కొన్న ప్రయోజనం కోసం మొత్తం పెట్టుబడిలో (i, ii & iii) సాంకేతిక సివిల్ / ఎలక్ట్రికల్ పనులు సహా కొత్త ప్లాంట్ , యంత్రాలపై చేసిన మూలధన పెట్టుబడులు, అనుబంధ మౌలిక సదుపాయాలు, రవాణా, పంపిణీ మౌలిక సదుపాయాలు, పునరుద్ధరణ ఇంధన పరికరాలతో సహా ఇంధన సామర్థ్య పరికరాలు, సాంకేతిక జోక్యాలు, విలువ గొలుసు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి దారితీసే ఇతర జోక్యాలు; ఇంకా ఈ పథకం కింద దరఖాస్తు చేసిన సంవత్సరంలో సృష్టించబడిన అదనపు ఉద్యోగాలకు వేతన బిల్లులు చేరి ఉన్నాయి.
డి)కాంపోనెంట్ 3: చేపలు , మత్స్య ఉత్పత్తుల భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థల స్వీకరణ – విస్తరణ:
చేపలు, మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్ లో భద్రతా, నాణ్యతా హామీ వ్యవస్థలను అవలంబించడానికి మత్స్య రంగ సూక్ష్మ చిన్న పరిశ్రమలను ప్రమాణికాల ఆధారంగా పని తీరు గ్రాంట్ లతో ప్రోత్సహించాలని ప్రతిపాదించారు. ఇది చేపల మార్కెట్ ను విస్తరించడంతో పాటు ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాలను సృష్టించి నిర్వహించగలదని భావిస్తున్నారు. సురక్షితమైన చేపలు, మత్స్య ఉత్పత్తుల సరఫరాను పెంచడం ద్వారా చేపలకు దేశీయ మార్కెట్ ను విస్తరించడానికి ఇది దోహదపడుతుందని, ఇది కొత్త వినియోగదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. పనితీరు గ్రాంట్లను అందించడానికి ప్రమాణాలను అందించే స్కేల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ గ్రాంట్లు ఈ క్రింద సూచించబడ్డాయి:
ఇ) కాంపోనెంట్ లు 2 , 3 కోసం పెర్ఫార్మెన్స్ గ్రాంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రమాణాలు
ఎ)కల్పించిన, నిర్వహిస్తున్న ఉద్యోగాల సంఖ్య; మహిళల కోసం కల్పించిన, నిర్వహిస్తున్న ఉద్యోగాలతో సహా. ఒక మహిళ కోసం సృష్టించి నిర్వహించే ప్రతి ఉద్యోగానికి సంవత్సరానికి రూ.15,000 చెల్లిస్తారు, అదేవిధంగా, పురుషుడి కోసం సృష్టించి నిర్వహించే ప్రతి ఉద్యోగానికి సంవత్సరానికి రూ.10,000 చెల్లిస్తారు, మొత్తం అర్హత గ్రాంట్ లో 50% పరిమితికి లోబడి.
బి) కాంపోనెంట్ 2 కోసం విలువ గొలుసు సామర్థ్యాన్ని పెంచడానికి వాల్యూ చైన్ లో చేసిన పెట్టుబడులు, కాంపోనెంట్ 3 కింద చేపలు, మత్స్య ఉత్పత్తుల భద్రత ,నాణ్యత హామీ వ్యవస్థలను స్వీకరించడానికి ,విస్తరించడానికి చేసిన పెట్టుబడి, చేసిన పెట్టుబడులకు పనితీరు గ్రాంట్ అర్హత గ్రాంట్ లో 50% పరిమితికి లోబడి పంపిణీ చేయబడుతుంది.
ఎఫ్) కాంపోనెంట్ 4: ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్:
ఈ కాంపోనెంట్ కింద, ప్రాజెక్ట్ కార్యకలాపాలను నిర్వహించడానికి, అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి , మదింపు చేయడానికి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు (పిఎంయులు) ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చారు.
నేపథ్యం:
***
The Pradhan Mantri Matsya Kisan Samridhi Sah-Yojana, which has been approved by the Cabinet will boost the fisheries sector, especially MSMEs associated with the sector. https://t.co/J3kFL4Fmi4
— Narendra Modi (@narendramodi) February 8, 2024