Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మణిపూర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.. ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


భారతదేశం అభివృద్ధి పథంలో పురోగమిస్తుండడంలో మణిపూర్ ప్రజలు పోషిస్తున్న పాత్రను చూస్తే గర్వంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు మణిపూర్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘మణిపూర్ ప్రజలకు వారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా పురోగమిస్తుండడంలో మణిపూర్ ప్రజానీకం పోషిస్తున్న పాత్రను చూసి మేమంతా చాలా గర్వపడుతున్నాం. మణిపూర్ మరింతగా ప్రగతిని సాధించాలని నేను కోరుకుంటూ, మీకు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.’’

 

 

***

 

MJPS/SR