Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు

మజాగే  యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని సందర్శించిన భారత ప్రధానమంత్రి, ఫ్రాన్స్ అధ్యక్షుడు


 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ఉదయం మాసే లోని మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రాన్ని  సందర్శించి మొదటి, రెండో  ప్రపంచ యుద్ధాల్లో అసువులు  బాసిన భారత వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. యుద్ధవీరుల త్యాగాలకు నివాళిగా ఇరువురు నేతలూ పుష్ప గుచ్ఛాలను ఉంచారు.

ఐరోపా ఖండంలో శాంతి ప్రయత్నాల్లో భాగంగా జరిగిన యుద్ధాల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్ల సాహస గాధలను మజాగే యుద్ధవీరుల స్మృతి కేంద్రం భద్రపరుస్తోంది. ఆనాటి వీరుల శౌర్య గాధలు నేటికీ అనేకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.  భారత్-ఫ్రాన్స్ దేశాల ప్రజల మధ్య గల సన్నిహిత, సుహృద్భావ సంబంధాలకు ఈ స్మారక కేంద్రం ఒక తార్కాణంగా నిలుస్తోంది.