Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మంఘర్ ధామ్ కి గౌరవ్ గాథ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి

మంఘర్ ధామ్ కి గౌరవ్ గాథ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి నరేంద్రమోదీ  మంఘర్ ధామ్ గౌరవ్ గాథ కార్యక్రమానికి హాజరై  స్వాతంత్రసమరంలో పాల్గొన్న ఆదివాసీ వీరులను వారి త్యాగాలను స్మరించుకుని వారికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి ధుని దర్శనం చేసుకుని గోవింద్ గురు విగ్రహంవద్ద పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన త్యాగమూర్తులైన ఆదివాసీ వీరుల తపస్సు, త్యాగం, ధైర్యానికి ప్రతీకగా ఉన్న పవిత్ర మంఘర్ ఎల్లప్పుడూ ప్రేరణగా నిలుస్తూ ఉంటుందని అన్నారు. మంఘర్ రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్  రాష్ట్రాల ప్రజల ఉమ్మడి సంస్కృతికి ప్రతీక అని ప్రధానమంత్రి అన్నారు. ఆదివాసీ యోధుడు గోవిందగురు కు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. అక్టోబర్ 30 గోవింద గురు వర్ధంతి.

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ,మంఘర్ ప్రాంతానికి సేవలు అందించే అవకాశం లభించినట్టు ప్రధానమంత్రి తెలిపారు.మంఘర్ గుజరాత్లో భాగం. గోవింద్ గురు తన చివరి రోజులలో ఇక్కడే గడిపారు. వారి శక్తి, జ్ఞానం ఈ గడ్డనుంచి ప్రేరణనిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.ఒకప్పుడు ఈ ప్రాంతమంతా బీడు భూమిగా ఉండేదని, మొక్కలు నాటాల్సిందిగా ప్రతిఒక్కరిని తాను వనమహోత్సవం వేదికగా పిలుపునిచ్చాననని, ఇప్పుడు ఈ ప్రాంతం హరితమయంగా ఉందని అన్నారు. వనమహోత్సవ ప్రచారానికి నిస్వార్థంగా కృషిచేస్తున్న ఆదివాసీలకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పరిణామం స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా, గోవింద గురు బోధనల ప్రచారానికి ఉపకరించిందని ప్రధానమంత్రి అన్నారు. గోవిందగురు వంటి గొప్ప స్వాతంత్ర సమరయోధులు భారత సంప్రదాయానికి, ఆదర్శాలకు  ప్రతీకలని ఆయన అన్నారు. గోవింద గురు తన కుటుంబాన్ని కోల్పోయారు కాని, హృదయాన్ని కాదని అంటూ ప్రధానమంత్రి గోవింద గురు ప్రతి  గిరిజనుడిని తన కుటుంబంగా భావించారని అన్నారు. గిరిజనుల హక్కుల కోసం గోవింద గురు బ్రిటిష్ వారితో పోరాటం చేసినట్టుగానే, తన సమాజంలోనేగల దురాచారాలపైనా ఆయన పోరాడారని సామాజిక సంస్కర్తగా, ఆథ్యాత్మిక నాయకుడిగా, ఒక రుషిగా, ఒక నాయకుడిగా ఆయన మార్గనిర్దేశం వహించారని ప్రధానమంత్రి అన్నారు.వారి మేధ, తాత్విక చింతన , వారి సాహసం, సామాజిక క్రియాశీలత గొప్పవని ప్రధానమంత్రి అన్నారు.

1913 నవంబర్ 17న మంఘర్ లో జరిగిన ఊచకోతను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇండియాలో బ్రిటిష్ పాలన క్రూరత్వానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ఒకవైపు అమాయక గిరిజనులు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తుండగా, మరోవైపు బ్రిటిష్ వలస పాలకులు మంఘర్ కొండప్రాంతాన్ని చుట్టుముట్టి వెయ్యిమందికిపైగా అమాయక  గిరిజనులను వృద్ధులు, మహిళలు, పిల్లలు అని చూడకుండా పట్టపగలు ఊచకోత కోశారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఈ దారుణోదంతానికి, గిరిజనుల స్వాతంత్రపోరాటం చూపిన ప్రభావానికి చరిత్ర పుస్తకాలలో సముచిత స్థాన దక్కలేదని ఆయన అన్నారు. ఈ ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేళ ఇండియా దశాబ్దాల క్రితం జరిగిన తప్పులను సరిదిద్ది,శూన్యతను భర్తీ చేస్తున్నదని అన్నారు.

గిరిజనులు లేకుండా భారతదేశ గతం,చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు సంపూర్ణం కావని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. స్వాతంత్ర సంగ్రామ చరిత్రలోని ప్రతి పేజీ గిరిజనుల వీరోచిత ఘట్టాలతో నిండినదని ప్రధానమంత్రి అన్నారు.  తిల్కా మంజి నాయకత్వంలో 1780లలో జరిగిన సంతాల్ సంగ్రామ్ దగ్గర నుంచి ఎన్నో వీరోచిత పోరాటాలు సాగాయని ప్రధానంత్రి గుర్తు చేశారు. 1830‌‌32 లలో బుధు భగత్ నాయకత్వంలో దేశం లర్కా ఆందోళన్ను చేపట్టిందని ఆయన అన్నారు. 1855లో సిద్దు ‌‌–కన్హు క్రాంతి దేశానికి ప్రేరణనిచ్చిందన్నారు. భగవాన్ బిర్సా ముండా తన దేశభక్తి, శక్తి ద్వారా ప్రతి ఒక్కరిలో ప్రేరణ నింపారన్నారు. శతాబ్దాల క్రితం బానిసత్వం సాగిన రోజుల నుంచి 20 వ శతాబ్దం రకు స్వాతంత్రజ్వాలను ఆరిపోకుండా గిరిజనులు చూశారని ప్రధానమంత్రి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై సాగించిన
పోరాటం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. అలాగే రాజస్థాన్లో ఆదివాసీ సమాజ్ మహారాణా ప్రతాప్కు అండగా నిలిచిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. గిరిజన తెగలకు మనం ఎంతో రుణపడిఉన్నాం. వీరు భారతదేశ స్వభావాన్ని పర్యావరణాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారని, వారి త్యాగాల రుణం తీర్చుకోలేనిదని ప్రధానమంత్రి అన్నారు. వారికి సేవ చేయడం ద్వారా ఇవాళ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకునే సమయం వచ్చిందని ప్రధానమంత్రి అన్నారు.

నవంబర్ 15వ తేదీ నాడు, అంటే భగవాన్ బిర్ సా ముండా యొక్క జయంతి సందర్భం లో, దేశం జనజాతీయ గౌరవ్ దివస్ ను జరుపుకోనుందని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘స్వాతంత్ర్య పోరాటం లో ఆదివాసిల చరిత్ర ను గురించి సామాన్యుల కు తెలియజెప్పే ప్రయాస యే ఈ జనజాతీయ గౌరవ్ దివస్’’ అని ఆయన అన్నారు. ఆదివాసి సమాజం యొక్క చరిత్ర ను సాధారణ ప్రజానీకానికి చాటిచెప్పడం కోసం దేశం అంతటా ఆదివాసి స్వాతంత్ర్య యోధుల కు అంకితం చేస్తూ ప్రత్యేకం గా మ్యూజియం లను నిర్మించడం జరుగుతోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ఈ భవ్యమైనటువంటి వారసత్వం ఇక ఆలోచన ప్రక్రియ లో ఒక భాగం గా అవుతుందని, అంతేకాక యువ తరాల కు ప్రేరణ ను అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.

దేశం లో ఆదివాసీ సమాజం యొక్క పాత్ర ను విస్తరింపచేయడం కోసం సమర్పణ భావం తో కృషి చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. రాజస్థాన్ మరియు గుజరాత్ మొదలు ఈశాన్యం మరియు ఒడిశా ల వరకు చూస్తే దేశం లోని అన్ని ప్రాంతాల లో ఉనికి విస్తరించి ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి సేవ చేసేందుకు దేశం స్పష్టమైన విధానాల తో పాటుపడుతోందని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. వనబంధు కల్యాణ్ యోజన ద్వారా ఆదివాసి జనాభా కు నీరు, విద్యుత్తు, విద్య, ఆరోగ్య సేవ లు మరియు ఉపాధి అవకాశాల ను కల్పించడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రస్తుతం, దేశం లో అడవుల విస్తీర్ణం సైతం పెరుగుతున్నది, వనరుల ను పరిరక్షించడం జరుగుతున్నది అని ఆయన చెప్పారు. అదే కాలం లో, ఆదివాసి నివాస ప్రాంతాల ను డిజిటల్ ఇండియా కు జోడించడం కూడా జరుగుతున్నది’’ అని ఆయన అన్నారు. ఏకలవ్య సాంప్రదాయిక నైపుణ్యాల తో పాటు గా ఆధునిక విద్య ను కూడా ఆదివాసి యువత కు చేరువ గా తీసుకు వస్తున్న ఆశ్రమ పాఠశాలల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. గోవింద్ గురు జీ పేరు తో ఏర్పాటు చేసిన భవ్యమైన పరిపాలన కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించడం కోసం తాను జంబుఘోడా కు వెళ్తున్న సంగతి ని కూడా ప్రధాన మంత్రి వెల్లడించారు.

అహమదాబాద్ఉదయ్ పుర్ బ్రాడ్ గేజ్ మార్గం లో ఒక రైలు ను తాను నిన్నటి రోజు సాయంత్రమే ప్రారంభించిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. ఆ 300 కిలోమీటర్ మేర సాగే రైలు మార్గం రాజస్థాన్ ప్రజల కు ఎంత ముఖ్యమైందో ఆయన తెలియజేస్తూ, ఆ మార్గం గుజరాత్ లోని అనేక ఆదివాసి ప్రాంతాల ను రాజస్థాన్ లోని ఆదివాసి ప్రాంతాల తో కలపడం తో పాటు గా ఆయా ప్రాంతాల లో పారిశ్రామిక అభివృద్ధి కి మరియు ఉపాధి కల్పన కు ఊతం గా నిలవనుందని ఆయన అన్నారు.

మాన్ గఢ్ ధామ్ యొక్క సంపూర్ణ అభివృద్ధి తాలూకు చర్చ ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మాన్ గఢ్ ధామ్ ను పెద్ద ఎత్తున విస్తరించాలనే బలమైన కోరిక ను వెలిబుచ్చారు. The రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్ మరియు మహారాష్ట్ర ల రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేయాలి అని ప్రధాన మంత్రి అభ్యర్థిస్తూ, ఒక మార్గ సూచీ ని రూపొందించడాన్ని గురించి ఒక సమగ్రమైన చర్చ ను చేపట్టాలన్నారు. అదే జరిగితే గోవింద్ గురు జీ యొక్క స్మారక స్థలం ప్రపంచ పటం లో ఒక జాగా ను సంపాదించుకొంటుందని పేర్కొన్నారు. ‘‘మాన్ గఢ్ ధామ్ యొక్క అభివృద్ధి ఈ ప్రాంతాన్ని నవ తరానికి ఒక ప్రేరణ స్థలి గా తప్పక మార్చగలదని నేను తలుస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి చెప్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్, మధ్య ప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయి పటేల్, సంస్కృతి శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘ్ వాల్, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింహ్ కులస్తే, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తదితరులు ఉన్నారు.

పూర్వరంగం

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగం గా, స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని తెర వెనుకనే ఉండిపోయినటువంటి ఆదివాసి నాయకుల ను స్మరించుకొనేందుకు ప్రభుత్వం అనేక నిర్ణయాల ను తీసుకోవడం మొదలుపెట్టింది. వాటిలో నవంబర్ 15వ తేదీ ని (ఆదివాసి స్వతంత్రత సేనాని బిర్ సా ముండా జయంతి) ని జన జాతీయ గౌరవ్ దివస్ గా జరపనున్నట్లు ప్రకటించడం ఒకటి. సమాజం లో ఆదివాసి వ్యక్తుల తోడ్పాటుల కు గుర్తింపు ను ఇవ్వడం మరియు స్వాతంత్ర్య సంగ్రామం లో వారి బలిదానాల ను ప్రజల కు పరిచయం చేయడం కోసం దేశ వ్యాప్తం గా ఆదివాసి మ్యూజియమ్ లను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ దిశ లో మరొక అడుగు గానా అన్నట్లు, స్వాతంత్ర్య ఉద్యమం లో పేరు ప్రచారం లోకి రానటువంటి ఆదివాసి నాయకులు మరియు అమరులైన వారి యొక్క బలిదానానికి నమస్కరిస్తూ వారికి శ్రద్ధాంజలి ని సమర్పించడం కోసం ప్రధాన మంత్రి రాజస్థాన్ లోని మాన్ గఢ్ పర్వతం (బాంస్ వాడ) లో ఏర్పాటైన సార్వజనిక కార్యక్రమం ‘మాన్ గఢ్ ధామ్ కీ గౌరవ్ గాథ’ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి భీల్ స్వతంత్రత సేనాని శ్రీ గోవింద్ గురు కు శ్రద్ధాంజలి ని ఘటించడం తో పాటు గా ఆ ప్రాంతాని కి చెందిన భీల్ మరియు ఇతర ఆదివాసి జన సమూహం హాజరు అయిన ఒక సభ ను ఉద్దేశించి ప్రసంగించారు.

 

మాన్ గఢ్ లోని పర్వత ప్రాంతం భీల్ సముదాయం మరియు రాజస్థాన్, గుజరాత్ మరియు మద్య ప్రదేశ్ లో ఇతర తెగల కు చాలా ముఖ్యమైనవి. స్వాతంత్ర్య పోరాటం కాలం లో ఇక్కడ భీల్ మరియు ఇతర తెగలు దీర్ఘ కాలం పాటు ఆంగ్లేయుల ను ఎదిరించి పోరాటం సలిపారు. 1913వ సంవత్సరం లో నవంబర్ 17వ తేదీ నాడు శ్రీ గోవింద్ గురు యొక్క నాయకత్వం లో 1.5 లక్షల మంది కి పైగా భీలు లు మాన్ గఢ్ పర్వతం పైన సభ ను నిర్వహించారు. ఆ సభ పై ఆంగ్లేయులు తుపాకి కాల్పులు జరిపారు, దీనితో మాన్ గఢ్ లో నర సంహారం చోటు చేసుకొంది. మరి సుమారు 1500 మంది ఆదివాసి వ్యక్తులు అమరులు అయ్యారు.

 

***