Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భోపాల్ లో శౌర్య‌స్మార‌క్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; బహిరంగ సభలో ప్రసంగించారు

భోపాల్ లో శౌర్య‌స్మార‌క్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; బహిరంగ సభలో ప్రసంగించారు

భోపాల్ లో శౌర్య‌స్మార‌క్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; బహిరంగ సభలో ప్రసంగించారు

భోపాల్ లో శౌర్య‌స్మార‌క్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; బహిరంగ సభలో ప్రసంగించారు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఈ రోజు భోపాల్ లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. శౌర్య‌ స్మార‌క్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాజీ సైనికులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

భార‌తదేశ సైనికులను మాన‌వ‌తా ప్రతీకగా ప్ర‌ధాన మంత్రి అభివర్ణించారు. ప్ర‌కృతి విపత్తు వచ్చిన ప్రతి సారీ భార‌తీయ సాయుధ ద‌ళాల‌కు చెందిన జ‌వానులు వారి ప్రాణాల‌ను ఎలా పణంగా పెట్టిందీ ఆయ‌న గుర్తు చేశారు.

క్ర‌మ‌శిక్ష‌ణ‌, ప్ర‌వ‌ర్త‌న కొల‌బద్దలుగా చూస్తే భార‌తీయ సాయుధ బలగాలు ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ స్థానంలో నిలుస్తాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డకు శాంతిద‌ళాన్ని మోహ‌రించాల్సివ‌చ్చినా దానికి ప్ర‌ప్ర‌థ‌మంగా సేన‌ల‌ను అందించే దేశాల్లో భార‌తదేశం ఒక‌ట‌ని ఆయ‌న చెప్పారు. ఇటీవ‌ల యెమెన్ లో సంక్షోభం చెల‌రేగిన‌ప్పుడు భార‌తీయ సాయుధ ద‌ళాలు యెమెన్ పౌరుల‌నే కాకుండా ప‌లు దేశాల పౌరుల‌ను కూడా అక్క‌డ నుండి ఖాళీ చేయించిన విష‌యం ఆయ‌న గుర్తు చేశారు.

భార‌తీయులు ఎప్పుడూ ఇత‌ర దేశాల భూభాగాలను ఆశించలేదు అని ప్రధాన మంత్రి చెప్పారు. మానవీయ విలువలను పరిరక్షించవలసివచ్చిన సమయాలలో భారతీయ సాయుధ దళాలు సందర్భానికి తగినట్లుగా నడచుకోవడంలో ఎన్నడూ విఫలం కాలేదు అని ఆయన స్పష్టంచేశారు. ప్ర‌పంచ యుద్ధాలు భార‌త‌దేశం ప్ర‌క‌టించిన యుద్ధాలు కావు, కానీ భార‌తీయ సైనికులు ఎందరో విదేశీ భూభాగాలను కాపాడడం కోసం వారి ప్రాణాలను సైతం త్యాగం చేశార‌ని ప్ర‌ధాన మంత్రి గుర్తు చేశారు. మ‌న జ‌వానులు చేసిన త్యాగాల‌ను మ‌నం మరచిపోకూడదు, వారు చేసిన త్యాగాలను ప్రపంచం సైతం మరువకుండా మనం చూడవలసి ఉంది అని ఆయన చెప్పారు. జవానుల్లోని నైతిక స్థైర్య‌మే భార‌తీయ సాయుధ ద‌ళాలకున్న బ‌లం. ఆ బ‌లం 125 కోట్ల మంది భార‌తీయుల మ‌ద్ద‌తు నుండి సంక్ర‌మిస్తోందని ఆయన అన్నారు.

నిరంతర నిఘా యే స్వేచ్ఛకు చెల్లించవలసిన మూల్యం అని ప్రధాన మంత్రి పేర్కొంటూ, దేశ సరిహద్దులను కాపాడుతున్న జవానుల పరాక్రమాన్ని అభినందించారు.

భార‌తీయ సాయుధ దళాల త్యాగాల‌ ఘనమైన సంప్రదాయాలను కొనియాడుతూ హిందీ క‌వులు శ్రీ మ‌ఖ‌న్ లాల్ చ‌తుర్వేది, శ్రీ రాంధారీ సింగ్ దిన‌క‌ర్ లు రాసిన క‌విత‌లను ప్ర‌ధాన మంత్రి ఉటంకించారు.

కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిన మేరకు ‘ఒక ర్యాంకు-ఒక పింఛ‌ను’ ను నెరవేర్చినట్లు ప్ర‌ధాన మంత్రి తెలిపారు. అలాగే, మాజీ సైనికుల శ్రేయం కోసం తీసుకున్న ఇతర చ‌ర్య‌ల‌ను గురించి కూడా ఆయ‌న వివ‌రించారు.