‘‘భూ విజ్ఞాన శాస్త్రం మరియు ఖనిజ వనరుల రంగం లో సహకారం’’ కోసం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా గనుల మంత్రిత్వ శాఖ పరిధి లోని భారత భూ వైజ్ఞానిక్ సర్వేక్షణ్ (జిఎస్ఐ) మరియు ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ కు చెందిన జియాలజికల్ సర్వే ఆఫ్ బ్రెజిల్- సిఆర్ పిఎమ్ సంతకాలు చేయవలసి ఉన్న ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి (ఎంఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఎంఒయు భూ విజ్ఞాన శాస్త్రం మరియు ఖనిజ వనరుల రంగం లో సహకారం కోసం ఉద్దేశించిన ఒక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా గనుల మంత్రిత్వ శాఖ కు చెందిన భారతీయ భూవైజ్ఞానిక్ సర్వేక్షణ్ సంస్థ కు మరియు ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ కు చెందిన గనులు మరియు శక్తి మంత్రిత్వ శాఖ లోని సిపిఆర్ఎమ్ కు మార్గాన్ని సుగమం చేస్తుంది.
**********