Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భూటాన్ రాజు, రాణి భారత పర్యటన సందర్భంగా స్వాగతం పలికిన ప్రధానమంత్రి మార్చ్ 2024 భూటాన్ అధికారిక పర్యటన సందర్భంగా తనకు లభించిన అపూర్వ ఆతిథ్యాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని భారత్-భూటాన్ విలక్షణ భాగస్వామ్య బలోపేతం కోసం కృషి చేస్తామన్న ఇరువురు నేతలు

భూటాన్ రాజు, రాణి భారత పర్యటన సందర్భంగా స్వాగతం పలికిన ప్రధానమంత్రి మార్చ్ 2024 భూటాన్ అధికారిక పర్యటన సందర్భంగా తనకు లభించిన అపూర్వ ఆతిథ్యాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని భారత్-భూటాన్  విలక్షణ భాగస్వామ్య బలోపేతం కోసం కృషి చేస్తామన్న ఇరువురు నేతలు


భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యల్ వాంగ్‌చుక్, రాణి జెట్సన్ పెమా వాంగ్‌చుక్ ల
భారత పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ఇరువురికీ స్వాగతం పలికారు. మార్చ్ 2024లో భూటాన్ అధికారిక పర్యటన సందర్భంగా నేపాల్ ప్రభుత్వం, ప్రజలు తనకు అపూర్వ ఆతిథ్యాన్ని అందించారని  ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు.

అభివృద్ధి దిశగా పరస్పర సహకారం, పర్యావరణ హిత ఇంధన భాగస్వామ్యం, వాణిజ్యం, పెట్టుబడులు, అంతరిక్షం, నూతన సాంకేతికత వంటి రంగాల్లో సహకారం, ఇరుదేశాల ప్రజల మధ్య గల స్నేహపూర్వక సంబంధాలు సహా, రెండు దేశాల మధ్య నెలకొన్న అద్వితీయ ద్వైపాక్షిక సంబంధాల పట్ల ప్రధానమంత్రి, భూటాన్ రాజు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ  విలక్షణ భాగస్వామ్యాన్ని అన్ని రంగాల్లో బలోపేతం చేస్తామని ఇరువురు నేతలూ తమ నిబద్ధతను వెల్లడించారు.

భారత్-భూటాన్ దేశాల మధ్య ఆర్థిక అనుసంధాన పురోగతిని సమీక్షించిన ఇరు దేశాల నేతలూ, ‘గెలెఫూ మైండ్ ఫుల్ నెస్ సిటీ’ పథకాన్ని గురించి చర్చించారు. భూటాన్ అభివృద్ధి వేగవంతం, భారత్ తో గల సరిహద్దుల వద్ద బంధాల బలోపేతం అన్న రెండు లక్ష్యాలతో రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యల్ వాంగ్‌చుక్ నేతృత్వంలో ఈ వినూత్న పథకం రూపుదిద్దుకుంది.  

భూటాన్ ఆర్దిక పురోగతి పట్ల భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. భూటాన్ 13వ పంచవర్ష ప్రణాళిక నిమిత్తం భారత్ సహాయాన్ని రెండింతలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రీ మోదీ ప్రకటించారు. సంతోషం, సౌభాగ్యం, ప్రగతి కోసం భూటాన్ దేశ ఆకాంక్షలకు మద్దతునందిస్తున్న భారత ప్రధానమంత్రి, ప్రజలకు ఈ సందర్భంగా నేపాల్ రాజు ధన్యవాదాలు తెలియజేశారు.

సమావేశం అనంతరం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో భూటాన్ రాజు రాణి గౌరవార్థం విందు ఏర్పాటయ్యింది.

భారత్-భూటాన్ దేశాల మధ్య చిరకాలంగా నెలకొన్న పరస్పర విశ్వాసం, సహకారం, లోతైన అవగాహనకు అద్దం పట్టే రీతిలో,  ఇరుదేశాల మధ్య జరిగే ఉన్నతస్థాయి సమావేశాల పరంపరకు నేటి భేటీ నిదర్శనంగా నిలిచింది.

 

***