Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భూటాన్ ను 2024మార్చి 21 వ , 22 వ తేదీల లో  సందర్శించనున్న ప్రధాన మంత్రి  


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 21 వ మరియు 22 వ తేదీల లో భూటాన్ లో ఆధికారికంగా పర్యటించనున్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.

 

 

యాత్ర కాలం లో ప్రధాన మంత్రి భూటాన్ యొక్క రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యెల్ వాంగ్ చుక్ తోను, భూటాన్ కు నాలుగో రాజు అయిన శ్రీ జిగ్మే సింగ్యే వాంగ్ చుక్ తోను సమావేశం కానున్నారు. ప్రధాన మంత్రి భూటాన్ యొక్క ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్ గే తో కూడా చర్చిస్తారు.

 

 

పరస్పర విశ్వాసం, అవగాహన మరియు సద్భావన ల పైన ఆధారపడ్డ ఒక విశిష్టమైనటువంటి మరియు చిరకాలిక భాగస్వామ్యం భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య చాలా కాలం గా కొనసాగుతున్నది. మన ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వం తో పాటు ప్రజల మధ్య పరస్పర సంబంధాలు మన అసాధారణమైన సంబంధాల కు విస్తృతి ని మరియు చైతన్యశీలత్వాన్ని జోడిస్తున్నాయి. ఈ యాత్ర ఇరు పక్షాల హితం ముడిపడ్డ ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ స్థాయి అంశాల లో అభిప్రాయాల ను ఇవతలి వారు అవతలి వారి కి, అవతలి వారు ఇవతలి వారికి తెలియ జేసుకొనేందుకు, అలాగే ఉభయ దేశాల ప్రజల మేలు కు దోహద పడుతున్న మార్గదర్శక ప్రాయమైనటువంటి మన భాగస్వామ్యాన్ని విస్తరించుకొనే మరియు ముమ్మరం చేసుకొనే పద్ధతుల ను గురంచి చర్చించే అవకాశాన్ని ఇవ్వనుంది.

 

 

***