Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భూకంప విషాదం నేపథ్యంలో మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి


భూకంప విషాదం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడారుఈ క్లిష్ట సమయంలో మయన్మార్‌కు అండగా నిలవడంలో సన్నిహిత మిత్రదేశంగాపొరుగుదేశంగా భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారుఈ విపత్తుకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించినట్లు తెలిపిన ప్రధానమంత్రి.. బాధిత ప్రాంతాలకు తక్షణ ఉపశమనాన్నిఅవసరమైన సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.

ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు:

మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడానువిధ్వంసకరమైన భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టం పట్ల మన ప్రగాఢ సానుభూతిని తెలియజేశానుసన్నిహిత మిత్రదేశంగాపొరుగుదేశంగా ఈ క్లిష్ట సమయంలో యావత్ భారత్ మయన్మార్‌కు అండగా ఉంటుంది#ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా విపత్తు సహాయ సామాగ్రిమానవతా సాయంసెర్చ్రెస్క్యూ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వెంటనే పంపిస్తున్నాం’’.

 

 

 

***

MJPS/SR