ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు గుజరాత్ లోని భుజ్ లో రూ.4400 కోట్ల విలువ గల ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అంతకు ముందు భుజ్ జిల్లాలోనే ఆయన స్మృతి వన్ మెమోరియల్ ను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ భుజ్ లోని స్మృతి వన్ మెమోరియల్, అంజర్ లోని వీర్ బాల్ స్మారక్ గుజరాత్ లోని కచ్ ప్రజలు, యావత్ భారత ప్రజలు అనుభవిస్తున్న బాధలను ప్రజలందరూ పంచుకుంటున్నారనేందుకు సంకేతమన్నారు. అంజర్ లో స్మారకం నిర్మించాలన్న ఆలోచన వచ్చినప్పుడే స్వచ్ఛంద పని అంటే “కర్ సేవ” ద్వారా దాని నిర్మాణం పూర్తి చేయాలన్న సంకల్పం చేసుకున్నారు. భారీ వినాశాన్ని మిగిల్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా ఈ మెమోరియల్ ను అంకింతం చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలందించిన హృదయపూర్వక స్వాగతానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నేడు తన హృదయంలో వచ్చిన పలు భావేద్వేగాలను ఆయన గుర్తు చేసుకుంటూ మరణించిన వారందరికీ గుర్తుగా నిర్మించిన స్మృతి వన్ మెమోరియల్ గతంలో హిరోషిమాలో నిర్మించిన 9/11 మెమోరియల్ కు సమానమైనదన్నారు. ఈ మెమోరియల్ ను సందర్శించాలని ప్రజలు, పాఠశాల విద్యార్థులను ఆయన అభ్యర్థిస్తూ అప్పుడే ప్రకృతికి సంబంధించిన ప్రవర్తన, సమతుల్యత ప్రతీ ఒక్కరికీ తెలుస్తుందని చెప్పారు.
భారీ విధ్వంసాన్ని మిగిల్చిన భూకంపం గురించి ప్రధానమంత్రి గుర్తు చేస్తూ “ఆ భూకంపం ఏర్పడిన రెండో రోజునే నేను ఇక్కడకు చేరాను. నేను అప్పటికి ముఖ్యమంత్రిని కూడా కాను, ఒక సాధారణ పార్టీ కార్యకర్తను ఎంత మంది ప్రజలకు నేను ఏ విధంగా సహాయం అందించగలననేది కూడా స్పష్టం కాలేదు. ఈ దుఃఖ సమయంలో నేను మీతో ఉన్నాను అనే భరోసా ఇవ్వాలని మాత్రమే నిర్ణయించుకున్నాను. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సేవానుభవం నాకు ఎంతో ఉపయోగపడింది” అని చెప్పారు. ఈ ప్రాంతంతో తను గల లోతైన, సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ సంక్షోభంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఆయన నివాళి అర్పించారు.
“కచ్ కు ఎల్లప్పుడూ గల ఒక ప్రత్యేకతను నేను తరచు ప్రస్తావిస్తూ ఉంటాను. ఒక మనిషి రోడ్డు మీద నడుస్తూ ఒక కలను పంచుకుంటే దాన్ని మహావృక్షంగా తయారుచేసేందుకు మొత్తం కచ్ అంతా ఆ కృషిలో పాల్గొంటుంది. కచ్ లో కనిపించే ఈ ఆచరణీయ విధానాలే ఆ ప్రాంతంపై గల ప్రతీ ఒక్క అనుమానం, అంచనా తప్పు అని నిరూపిస్తాయి. అలాగే కచ్ ఎప్పటికీ తన కాళ్ల మీద తాను నిలబడలేదు అన్న వారున్నారు. కాని కచ్ ప్రజలు ఆ ఆలోచనను పూర్తిగా మార్చి వేశారు” అని ప్రధానమంత్రి అన్నారు. భూకంపం అనంతరం వచ్చిన తొలి దీపావళి పండుగ నాడు ఈ ప్రాంత ప్రజలకు సంఘీభావంగా తాను, తన కేబినెట్ సహచరులు ఆ ప్రాంతంలో గడిపినట్టు చెప్పారు. “సవాలుతో కూడిన ఆ సమయంలో ఆ వైపరీత్యాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని (ఆపదా సే అవసర్) సంకల్పం ప్రకటించాం. 2047 సంవత్సరం నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఎర్రకోట బురుజుల నుంచి నేను ప్రకటించానంటే వైపరీత్యానికి, మరణానికి మధ్యన మనం చేసుకున్న తీర్మానాల గురించి కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆ తీర్మానాలు నేడు సాకారం అయ్యాయి. అదే విధంగా ఈ రోజు మనం చేసుకున్న సంకల్పాలు 2047 నాటికి తప్పకుండా సాకారం అవుతాయి” అన్నారు.
2001లో భూకంపం సృష్టించిన భారీ విధ్వంసం అనంతరం కచ్ లో జరిగిన అద్భుతమైన పని గురించి మాట్లాడుతూ 2003 సంవత్సరంలో అక్కడ ఏర్పాటైన క్రాంతిగురు శ్యామ్ జీ కృష్ణ వర్మ విశ్వవిద్యాలయం నిర్వహణలో 35 పైగా కొత్త కళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. భూకంపాలను తట్టుకునే జిల్లా ఆస్పత్రి, 200 క్లినిక్ లు ఏర్పాటయ్యాయని, నీటి కొరత కారణంగా ఆ రోజుల్లో వినిపించే ఆర్తనాదాలకు భిన్నంగా పవిత్ర నర్మదా నది నుంచి స్వచ్ఛమైన మంచినీరు అందుతోందని ఆయన చెప్పారు. “ఆ ప్రాంతంలో నీటి భద్రతకు తీసుకున్న చర్యలను వివరించారు. కచ్ ప్రజల ఆశీస్సులతో ఆ ప్రాంతంలోని అన్ని కీలక ప్రదేశాలను నర్మదా నదితో అనుసంధానం చేయడం జరిగింది. కచ్-భుజ్ కెనాల్ ఆ ప్రాంతంలోని రైతులు, ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది” అన్నారు. గుజరాత్ లో పళ్ల ఉత్పత్తిలో అగ్రగామిగా మారినందుకు ఆయన కచ్ ప్రజలను అభినందించారు. అలాగే పశువుల పెంపకం, పాల ఉత్పత్తిలో సాధించిన అసాధారణ విజయాలను అభినందించారు. “కచ్ సొంతంగా కోలుకోవడమే కాదు, గుజరాత్ మొత్తాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది” అన్నారు.
ఒకదాని వెనక ఒకటిగా గుజరాత్ ఎదుర్కొన్న సంక్షోభాల గురించి ఆయన గుర్తు చేశారు. “ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడిన నష్టం నుంచి బయటపడేందుకు గుజరాత్ కృషి చేస్తుండగా కుట్రల పర్వం ప్రారంభమయింది. దేశంలోను, ప్రపంచంలోను గుజరాత్ ను అప్రతిష్ఠ పాలు చేసి పెట్టుబబడులు రాకుండా నిరోధించేందుకు ఒక దాని వెనుక ఒకటిగా కుట్రలు పన్నారు” అని చెప్పారు. “అంత ప్రతికూల వాతావరణాన్ని ఒక పక్క ఎదుర్కొంటూనే మరోపక్క గుజరాత్ వైపరీత్య నిర్వహణ చట్టం ఆమోదించి, అలాంటి చట్టం రూపొందించిన తొలి రాష్ట్రంగా గుజరాత్ ఏ విధంగా నిలిచింది” అని ప్రధానమంత్రి తెలియచేశారు. ఆ చట్టం స్ఫూర్తితోనే దేశం మొత్తంలో అదే తరహా చట్టాలు రూపొందించాయి. ఆ చట్టమే నేడు మహమ్మారి కాలంలో ప్రతీ ఒక్క ప్రభుత్వానికి సహాయకారిగా నిలిచింది అన్నారు. గుజరాత్ ను అప్రతిష్ఠ పాలు చేసే అలాంటి ప్రయత్నాలన్నింటినీ ఎదుర్కొంటూనే గుజరాత్ పారిశ్రామికాభివృద్ధిలో కొత్త శకాన్ని రచించిందని, ఆ కృషిలో అతి పెద్ద లబ్ధిదారు కచ్ ప్రాంతమని ఆయన వివరించారు.
కచ్ లో నేడు ప్రపంచంలోనే భారీ సిమెంట్ ప్లాంట్లున్నాయని, పైప్ ల తయారీలో కూడా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నదని, కచ్ లో ప్రపంచంలోనే రెండో పెద్ద టెక్స్ టైల్ ప్లాంట్ ఉన్నదని, ఆసియాలోనే తొలి సెజ్ కచ్ లోనే ఏర్పాటయిందని ఆయన అన్నారు. భారతదేశం రవాణా చేస్తున్న వస్తువుల్లో 30 శాతం వస్తువులు కాండ్లా, ముంద్రా పోర్టుల నుంచే రవాణా అవుతాయని, దేశం ఉత్పత్తి చేసే ఉప్పులో 30 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు. కచ్ లో 2500 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, అతి పెద్ద హైబ్రిడ్ సోలార్ పార్క్ కూడా కచ్ లోనే ఏర్పాటవుతోందని అన్నారు. దేశంలో ప్రస్తుతం సాగుతున్న హరిత వాయు ప్రచారంలో గుజరాత్ పెద్ద పాత్ర పోషిస్తోందని చెప్పారు. గుజరాత్ ప్రపంచంలో హరిత రాజధానిగా అభివృద్ధి చెందుతున్నప్పుడు దానిలో కచ్ అతి పెద్ద వాటా అందిస్తుందన్నారు.
తాను ఎర్రకోట బురుజుల నుంచి ప్రకటించిన పంచప్రాణాల్లో ఒకటైన వారసత్వ సంపద పట్ల గర్వపడడం గురించి ప్రస్తావిస్తూ కచ్ సుసంపన్నత, సమున్నత స్థితి గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ధోలావిరా నిర్మాణానికి నగరంలోని నైపుణ్యాల గురించి ప్రస్తావిస్తూ “ధోలావిరాకు ప్రపంచ వారసత్వం ప్రదేశంగా గత ఏడాది గుర్తింపు లభించింది. ధోలావిరాలోని ప్రతీ ఒక్క ఇటుక అక్కడి నైపుణ్యాలు, జ్ఞానం, ప్రాచీనుల శాస్త్రవిజ్ఞానం గురించి చాటి చెబుతాయి” అన్నారు. దీర్ఘకాలంగా విస్మరించిన స్వాతంత్ర్య సమర యోధులను గౌరవించుకోవడం కూడా ఈ వారసత్వంలో భాగమేనన్నారు. శ్యామ్ జీ కృష్ణ వర్మ జ్ఞాపకాలు తిరిగి తీసుకురావడం, మాండ్విలో మెమోరియల్ నిర్మాణం, ఐక్యతా విగ్రహ నిర్మాణం కూడా ఈ దిశగా తీసుకున్న ప్రధాన చర్యలేనని చెప్పారు.
“సబ్ కా ప్రయాస్” ద్వారా అర్ధవంతమైన మార్పునకు కచ్ అభివృద్ధి చక్కని ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు. “కచ్ ఒక ప్రాంతం కాదు, ఒక స్ఫూర్తి, సజీవ భావం. ఆజాదీ కా అమృత్ కాల సంకల్పాల సిద్ధికి కచ్ ఒక మార్గం చూపుతుంది” అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు శ్రీ సిఆర్ పాటిల్, శ్రీ వినోద్ ఎల్ చావ్ డా, గుజరాత్ అసెండ్లీ స్పీకర్ డాక్టర్ నిర్మాబెన్ ఆచార్య, రాష్ట్ర మంత్రులు శ్రీ కిరీట్ సింగ్ వాఘేటా, శ్రీ జితూ భాయ్ చౌధరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
ప్రాజెక్టుల వివరాలు
భుజ్ జిల్లాలో స్మృతివన్ మెమోరియల్ ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి మానస పుత్రిక అయిన ఈ స్మృతివనం ఒక సానుభూతికి గుర్తుగా నిర్మించిన ఒక నిర్మాణం. భుజ్ కేంద్రంగా 2001లో వచ్చిన పెను భూకంపంలో13000 మంది మరణించిన అనంతరం ప్రజలు ప్రదర్శించిన సంయమన శక్తికి గుర్తింపుగా 470 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. భూకంపంలో మరణించిన వారి పేర్లన్నీ ఈ స్మారకంపై చెక్కారు.
స్మృతివనం భూకంప మ్యూజియంను ఏడు విభాగాలుగా విభజించారు. అవి రీ బర్త్, రీ డిస్కవర్, రెస్టోర్, రీబిల్డ్, రీ థింక్, రిలీవ్, రెన్యూ. రీబర్త్ పేరిట నిర్మించిన మొదటి బ్లాక్ భూమి పరిణామక్రమం, ప్రతీ సారి సంక్షోభాన్ని తట్టుకోగలిగిన భూమి సామర్థ్యం తెలియచేస్తుంది. రెండో బ్లాక్ గుజరాత్ భౌగోళిక స్వభావాన్ని , రాష్ట్రం ఏ విధంగా ప్రకృతి వైపరీత్యాలకు ఆలవాలం అనేది వివరిస్తుంది. మూడో బ్లాక్ 2001 భూకంపం అనంతరం గుజరాత్ లో జరిగిన సహాయ చర్యల గురించి తెలియచేస్తుంది. భూకంపం ఏర్పడిన వెనువెంటనే భారీ ఎత్తున వ్యక్తులు, సంస్థలు చేపట్టిన భారీ సహాయ చర్యలకు సంబంధించిన చిత్రాలు ఆ గ్యాలరీలో ఉంటాయి. నాలుగో బ్లాక్ లో గుజరాత్ పునర్మిర్మాణ చొరవలు, 2001 భూకంపం అనంతర విజయ గాథలు వివరిస్తుంది. ఐదవ బ్లాక్ వివిధ రకాల వైపరీత్యాలు, ఎలాంటి సందర్భంలో అయినా ఏదైనా వైపరీత్యం ఎదురయితే భవిష్యత్ సంసిద్ధత చర్యలకు ఎలా సిద్ధం కావాలి అనేది సందర్శకులకు సూచిస్తుంది. ఆరో బ్లాక్ ఒక సిమ్యులేటర్ సహాయంతో భూకంపం అనుభవం నుంచి మనకి ఊరట కల్పిస్తుంది. ఇందులోని 5డి సిమ్యులేటర్ అంత భారీ భూకంపం ఏర్పడితే కనిపించే క్షేత్ర స్థాయి వాస్తవాల గురిచి సజీవ అనుభవం అందిస్తుంది. ఏడో బ్లాక్ లో భూకంపం నాటి వైపరీత్యంలోని మృతులను సందర్శకులు గుర్తు చేసుకుని శ్రద్ధాంజలి ఘటించే స్థలం ఉంటుంది.
భుజ్ లో రూ.4400 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు చెందిన కచ్ బ్రాంచ్ కాల్వను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కాల్వ పొడవు 357 కిలోమీటర్లు. ఈ కాల్వలో కొంత భాగాన్ని ప్రధానమంత్రి 2017లో ప్రారంభించగా మిగిలిన భాగాన్ని ఇప్పుడు ప్రారంభించారు. ఇది కచ్ ప్రాంతంలో నీటి పారుదల వసతిని కల్పించడంతో పాటు కచ్ జిల్లాలోని 948 గ్రామాలకు మంచినీరు కూడా అందిస్తుంది. ప్రధానమంత్రి ప్రారంభిస్తున్న ఇతర ప్రాజెక్టుల్లో సర్హద్ డెయిరీలో ఆటోమేటిక్ పాల ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్; భుజ్ లో రీజినల్ సైన్స్ సెంటర్; గాంధీధామ్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కన్వెన్షన్ సెంటర్; అంజర్ లో వీర్ బాల్ స్మారక్; నఖత్రానాలో 2 సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి కాకుండా భుజ్-భీమ్ సాగర్ రోడ్డు సహా రూ.1500 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
Gratitude to the people of Bhuj for their warm reception. Speaking at launch of development projects. https://t.co/FuMn5oM1kH
— Narendra Modi (@narendramodi) August 28, 2022
आज मन बहुत सारी भावनाओं से भरा हुआ है।
भुजियो डूंगर में स्मृतिवन मेमोरियल, अंजार में वीर बाल स्मारक का लोकार्पण कच्छ की, गुजरात की, पूरे देश की साझी वेदना का प्रतीक है।
इनके निर्माण में सिर्फ पसीना ही नहीं लगा बल्कि कितने ही परिवारों के आंसुओं ने इसके ईंट-पत्थरों को सींचा है:PM
— PMO India (@PMOIndia) August 28, 2022
मुझे याद है, भूकंप जब आया था तो उसके दूसरे दिन ही यहां पहुंच गया था।
तब मैं मुख्यमंत्री नहीं था, साधारण सा कार्यकर्ता था।
मुझे नहीं पता था कि मैं कैसे और कितने लोगों की मदद कर पाउंगा।
लेकिन मैंने ये तय किया कि मैं यहां आप सबके बीच में रहूँगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 28, 2022
कच्छ की एक विशेषता तो हमेशा से रही है, जिसकी चर्चा मैं अक्सर करता हूं।
यहां रास्ते में चलते-चलते भी कोई व्यक्ति एक सपना बो जाए तो पूरा कच्छ उसको वटवृक्ष बनाने में जुट जाता है।
कच्छ के इन्हीं संस्कारों ने हर आशंका, हर आकलन को गलत सिद्ध किया: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 28, 2022
ऐसा कहने वाले बहुत थे कि अब कच्छ कभी अपने पैरों पर खड़ा नहीं हो पाएगा।
लेकिन आज कच्छ के लोगों ने यहां की तस्वीर पूरी तरह बदल दी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 28, 2022
2001 में पूरी तरह तबाह होने के बाद से कच्छ में जो काम हुए हैं, वो अकल्पनीय हैं।
कच्छ में 2003 में क्रांतिगुरू श्यामजी कृष्णवर्मा यूनिवर्सिटी बनी तो वहीं 35 से भी ज्यादा नए कॉलेजों की भी स्थापना की गई है: PM
— PMO India (@PMOIndia) August 28, 2022
एक दौर था जब गुजरात पर एक के बाद एक संकट आ रहे थे।
प्राकृतिक आपदा से गुजरात निपट ही रहा था, कि साजिशों का दौर शुरु हो गया: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 28, 2022
देश और दुनिया में गुजरात को बदनाम करने के लिए, यहां निवेश को रोकने के लिए एक के बाद एक साजिशें की गईं।
ऐसी स्थिति में भी एक तरफ गुजरात देश में डिजास्टर मैनेजमेंट एक्ट बनाने वाला पहला राज्य बना।
इसी एक्ट की प्रेरणा से पूरे देश के लिए भी ऐसा ही कानून बना: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 28, 2022
देश में आज जो ग्रीन हाउस अभियान चल रहा है, उसमें गुजरात की बहुत बड़ी भूमिका है।
इसी तरह जब गुजरात, दुनिया भर में ग्रीन हाउस कैपिटल के रूप में अपनी पहचान बनाएगा, तो उसमें कच्छ का बहुत बड़ा योगदान होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 28, 2022
हमारे कच्छ में क्या नहीं है।
नगर निर्माण को लेकर हमारी विशेषज्ञता धौलावीरा में दिखती है।
पिछले वर्ष ही धौलावीरा को वर्ल्ड हैरिटेज साइट का दर्जा दिया गया है। धौलावीरा की एक-एक ईंट हमारे पूर्वजों के कौशल, उनके ज्ञान-विज्ञान को दर्शाती है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 28, 2022
कच्छ का विकास, सबका प्रयास से सार्थक परिवर्तन का एक उत्तम उदाहरण है।
कच्छ सिर्फ एक स्थान नहीं है, बल्कि ये एक स्पिरिट है, एक जीती-जागती भावना है।
ये वो भावना है, जो हमें आज़ादी के अमृतकाल के विराट संकल्पों की सिद्धि का रास्ता दिखाती है: PM
— PMO India (@PMOIndia) August 28, 2022
*****
DS/TS