Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భాషా గౌరవ్ సప్తాహ్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు


అసోం ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేస్తూ, భాషా గౌరవ్ సప్తాహ్ ( #BhashaGauravSaptah) ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానంగా పేర్కొన్నారు. సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని ఇస్తూ, అస్సామీ భాషకు శాస్త్రీయ భాష హోదాను ఇటీవలే ప్రకటించిన సంగతిని గుర్తుకు తీసుకు వచ్చారు. ఈ హోదా తో, భాష పరంగా, సాంస్కృతిక వారసత్వం పరంగా అసోం ప్రాంతానికి ఉన్న సంపన్నతకు ముఖ్య గుర్తింపు దక్కింది. దీంతో సర్వత్రా ఉత్సాహభరిత వాతావరణం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

అసోం కు భాషాపరంగా ఉన్న ఘన వారసత్వాన్ని ఉత్సవ రూపంలో జరుపుకొనేందుకు భాషా గౌరవ్ సప్తాహ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ పెట్టిన ఒక పోస్టుకు ప్రధాని ఈ రోజు స్పందించి ఒక ట్వీట్ లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘అస్సామీ భాషకు శాస్త్రీయ భాష హోదా లభించడంతో, భాషాగౌరవ్ సప్తాహ్ ( #BhashaGauravSaptah ) ను జరుపుకోనుండడం అసోం ప్రజల్లో ఎనలేని ఉత్సాహాన్ని నింపేటటువంటి ఓ గుర్తుంచుకోదగ్గ ప్రయత్నం. ఇవిగో, అందుకోండి నా శుభాకాంక్షలు. ఏడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని రూపొందించిన ప్రణాళిక రాష్ట్ర ప్రజలకు, అసోం సంస్కృతికి మధ్య బంధాన్ని ఇంకా ఇంకా బలపరచాలని నేను కోరుకుంటున్నాను. అసోం రాష్ట్రానికి బయట నివసిస్తున్న అస్సామీయులు కూడా ఈ ఉత్సవ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాల్సిందంటూ వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’

 

 

 

***

MJPS/SS