Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త ర‌త్న‌ శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ గౌర‌వార్థం స్మారక నాణేన్ని విడుద‌ల చేసిన ప్ర‌ధాన మంత్రి

పూర్వ ప్ర‌ధాని, భార‌త ర‌త్న శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ గౌర‌వార్థం ఒక స్మారక నాణేన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేడు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భం గా ఆయ‌న మాట్లాడుతూ, శ్రీ వాజ్‌పేయీ మ‌న మ‌ధ్య లేర‌ని న‌మ్మేందుకు మ‌న మ‌స్తిష్కాలు సిద్ధంగా లేవ‌న్నారు. ఆయ‌న ప్రేమాస్ప‌దుడైన ప్ర‌ముఖుడ‌ని, ఆయ‌న‌ ను స‌మాజం లోని అన్ని వ‌ర్గాల వారు గౌర‌వించార‌ని శ్రీ మోదీ పేర్కొన్నారు.

శ్రీ వాజ్‌పేయీ స్వ‌రం ద‌శాబ్దుల త‌ర‌బ‌డి ప్ర‌జాస్వరం గా నిల‌చింద‌ని ఆయ‌న అన్నారు. ఒక వ‌క్త‌ గా ఆయ‌న‌ కు సాటి లేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. మ‌న దేశం లోని అత్యుత్త‌మ మహోపన్యాసకుల లో ఆయ‌న ఒక‌ర‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

శ్రీ వాజ్‌పేయీ వృత్తి జీవ‌నం లో సుదీర్ఘ కాలం ప్ర‌తిప‌క్ష స్థానాల లో గ‌డచిన‌ప్ప‌టికీ ఆయ‌న ఎల్ల‌ప్పుడూ దేశ హితం గురించే మాట్లాడార‌ని శ్రీ న‌రేంద్ర మోదీ తెలిపారు. ప్ర‌జాస్వామ్యం స‌ర్వోన్న‌తం గా ఉండాల‌ని శ్రీ వాజ్‌పేయీ ఆకాంక్షించార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. శ్రీ వాజ్‌పేయీ మ‌న అంద‌రికీ ఒక ప్రేర‌ణ‌ గా ఉంటూనే వుంటార‌ని ఆయ‌న విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు.