భారత రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్న అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలిని ఘటించారు. ముసాయిదా రూపకల్పన సంఘం అధ్యక్షుడుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన కృషికి ఆయన ప్రణామాలు అర్పించారు.
“మన రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావులు అందరికీ ఇదే నా శ్రద్ధాంజలి. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం అధ్యక్షుడుగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన కృషికి ప్రణామాలు అర్పిస్తున్నాను” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Tributes to all great personalities who framed our Constitution. I salute Dr. Ambedkar for his efforts as Chairman of Drafting Committee.
— Narendra Modi (@narendramodi) January 26, 2016