Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త ప్ర‌భుత్వ ఎమ్ఇఐటివై లో భాగం గా ఉన్న‌టువంటి బిఐఎస్ఎజి యొక్క హోదా ను బిఐఎస్ఎజి(ఎన్‌)గా పెంపు చేసేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి


భార‌త ప్ర‌భుత్వంలోని ఇలెక్ట్రానిక్స్ ఎండ్ ఇన్ఫ‌ర్మేశ‌న్ టెక్నాల‌జీ (ఎమ్ఇఐటివై)లో భాగ‌మైన భాస్క‌రాచార్య ఇన్స్ టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేశ‌న్స్ ఎండ్ జియోఇన్‌ఫ‌ర్మేటిక్స్ (బిఐఎస్ఎజి), గుజ‌రాత్ హోదా ను భాస్క‌రాచార్య నేశ‌న‌ల్ ఇన్స్ టిట్యూట్ ఫ‌ర్ స్పేస్ అప్లికేశ‌న్స్ ఎండ్ జియో-ఇన్‌ఫ‌ర్మేటిక్స్ (బిఐఎస్ఎజి[ఎన్‌]) గా పెంచేందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న జ‌రిగి న కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

లాభాలు

1.
ఎ) బిఐఎస్ఎజి ద‌క్ష‌త ను కొన‌సాగించేందుకు, సేవ‌ల ను న‌వీనీక‌రించేందుకు ఆ సంస్థ లోని నిపుణులైన సిబ్బంది ఏయే పదవుల లో ఉంటున్న వారు అవే పదవుల లో జాతీయ స్థాయి సంస్థ లో చేరేందుకు;

బి) కార్య‌క‌లాపాల ప‌రిధి విస్త‌ర‌ణ కు మార్గాన్ని సుగ‌మం చేయ‌డానికి;

సి) జిఐఎస్ ప్రాజెక్టుల ను స‌మ‌ర్ధ‌మైన రీతి లో ఆచ‌ర‌ణ లోకి తీసుకు రావ‌డానికి;

డి) ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి (ఆర్ & డి)ని, ఇంకా సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అభివృద్ధి ప‌ర‌డానికి తోడ్ప‌డ‌డానికి;

ఇ) స్పేశియ‌ల్ డెసిశ‌న్ స‌పోర్ట్ సిస్ట‌మ్స్ ద్వారా ప్ర‌ణాళిక ర‌చ‌న ను మరియు సుప‌రిపాల‌న ను అభివృద్ధి ప‌ర‌చ‌డానికి
మార్గాన్ని సుగ‌మం చేసేందుకు

ఈ హోదా పెంపు దోహ‌దం చేయ‌నుంది.

**********