భారతదేశాని కి చెందిన రైల్వేల మంత్రిత్వ శాఖ కు మరియు యూరోపియన్ కమిశన్ కు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఫర్ మొబిలిటీ ఎండ్ టాన్స్‌పోర్ట్ కు మధ్య రైల్వేల రంగం లో సహకారాని కి ఉద్దేశించినటువంటి పరిపాలన పరమైన సర్దుబాటు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. భవిష్యత్ కాలం లో సాంకేతిక విజ్ఞాన సంబంధిత సహకారాని కి మరియు ఆ రంగాని కి చెందిన బృందాల రాక పోక లను పటిష్టపరచేందుకే ఈ సర్దుబాటు.
అమలు కు సంబంధించిన వ్యూహం మరియు లక్ష్యాలు
పరిపాలన పూర్వకమైనటువంటి సర్దుబాటు పత్రం పై 2019వ సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీ నాడు సంతకాలయ్యాయి. ఈ క్రింద పేర్కొన్న కీలకమైన రంగాల పై శ్రద్ధ తో కూడిన సహకారాని కి ఒక ఫ్రేమ్ వర్క్ ను ఈ పత్రం సమకూర్చుతుంది:-
1. రైల్వేల యొక్క భద్రత, ఇంటర్ ఆపరబిలిటీ ఆర్థిక సంబంధ అంశాల పరిపాలన మరియు విత్తీయ విషయాల లో స్థిరత్వం అంశాల లో ఇయు లెజిస్లేటివ్ ఫ్రేమ్ వర్క్ యొక్క ప్రభావం పై ప్రత్యేక శ్రద్ధ తో కూడిన రైలు రంగ సంస్కరణలు మరియు నియంత్రణ లు;
2. రైల్వే సంబంధిత భద్రత;
3. రైల్వేల ఆర్థిక పని తీరు కు సంబంధించి కొనుగోలు విధి విధానాలు మరియు ప్రమాణీకరణం తాలూకు ప్రయోజనాలు;
4. సిగ్నలింగ్/ కంట్రోల్ సిస్టమ్స్ (యూరోపియన్ ఇఆర్‌టిఎమ్ఎస్ వ్యవస్థ తో సహా) ;
5. రవాణా సంబంధిత మౌలిక సదుపాయాల నెట్ వర్క్ లు మరియు ఇంటర్ మొడాలిటీ;
6. నూతన ఆవిష్కరణలు మరియు డిజిటలైజేశన్;
7. అంతర్జాతీయ రైల్ సమ్మేళనాలు మరియు సంస్థల ప్రమాణీకరణాని కి సంబంధించిన అనుభవాన్ని ఒక పక్షం తో మరొక పక్షం వెల్లడి చేసుకోవడం;
8. ఆర్థిక, సామాజిక మరియు పర్యావరణ కోణాల తో సహా రైల్వేల లో సుస్థిర విధానాలు;