భారతదేశం, ఇంటర్‌నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఎ) లు హెడ్ క్వార్టర్స్ (హోస్ట్ కంట్రీ) అగ్రిమెంట్ ను కుదుర్చుకొనేందుకు మరియు హెడ్ క్వార్టర్ అగ్రిమెంట్ పైన సంతకం చేసే అధికారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు ఇచ్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తన ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలియజేసింది. ఈ ఒప్పందం పై 2018 మార్చి నెల 26వ తేదీన సంతకాలయ్యాయి.
హెడ్ క్వార్టర్స్ అగ్రిమెంట్ భారతదేశానికి మరియు ఐఎస్ఎ కు మధ్య కార్యకలాపాల పరమైనటువంటి సర్దుబాట్లకు వ్యవస్థాగత రూపును సంతరిస్తుంది. ఒక అంతర్జాతీయ స్థాయి కలిగిన అంతర్ ప్రభుత్వ సంస్థగా ఐఎస్ఎ సాఫీగా పరివర్తన చెందడంలో ఈ అగ్రిమెంట్ తోడ్పడుతుంది. సౌర శక్తి సంబంధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచే ప్రక్రియను, అటువంటి పరిజ్ఞానాన్ని భారతదేశంతో పాటు ఐఎస్ఎ లో సభ్యత్వం కలిగివున్న దేశాలలో మోహరించే ప్రక్రియ ను ఐఎస్ఎ వేగిరపరుస్తుంది.
***