భారతదేశం మరియు లిథువానియా ల మధ్య (పరదేశీ) దోషులను అప్పగించేందుకు ఉద్దేశించిన ఒక ఒడంబడిక పై సంతకాలకు మరియు అనుమోదానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తన ఆమోదం తెలిపింది.
లిథువానియా నుండి ఉగ్రవాదులు, ఆర్థిక నేరగాళ్ళు మరియు ఇతర నేరస్తుల అప్పగింతను కోరేందుకు మరియు లిథువానియా కు ఉగ్రవాదులు, ఆర్థిక నేరగాళ్ళు మరియు ఇతర నేరస్తుల అప్పగించేందుకు ఒక చట్టబద్ధమైన ఫ్రేమ్ వర్క్ రూపకల్పనకు ఈ ఒడంబడిక వీలు కల్పిస్తుంది.
అంతేకాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులు సహా, పారిపోయిన నేరగాళ్ళ మీద విచారణను చేపట్టేందుకు వారి అప్పగింత ప్రక్రియలోనూ ఈ ఒడంబడిక సహాయపడనుంది. ఈ ఒడంబడిక జన బాహుళ్యంలో శాంతిని, స్థిరతను నెలకొల్పే ఉద్దేశంతో నేరగాళ్లను చట్టానికి పట్టి ఇవ్వడానికి దోహదం చేయగలదు.