తపాలా బిళ్ళలను సంయుక్తంగా జారీ చేసేందుకు సంబంధించి భారతదేశానికి చెందిన తపాలా విభాగానికి మరియు రష్యా పోస్ట్ (రష్యా ఫెడరేశన్ యొక్క జాయింట్ స్టాక్ కంపెనీ అయినటువంటి ‘‘మర్కా’’) కు మధ్య సంతకాలైన ఒప్పందం వివరాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది. ఈ ఒప్పందం తపాలా సంబంధిత సహకారాన్ని నెలకొల్పుకోవడానికి మరియు తపాలా బిళ్లల జారీ రంగంలో ఇరు పక్షాలకు లాభదాయకంగా ఉండే విధంగా కార్యకలాపాల నిర్వహణపరంగా ప్రావీణ్యాన్ని సంపాదించే దిశగా కృషి చేయడానికి గాను ఉద్దేశించింది.
భారతదేశం మరియు రష్యా ల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలు పరస్పర ప్రయోజనాలతో ముడిపడ్డ అంశాలపై స్థూలమైన అవగాహనతో కూడుకున్న సంబంధాలు. ద్వైపాక్షిక సంబంధం తాలూకు దాదాపు అన్ని రంగాలలోను భారతదేశం మరియు రష్యా ల మధ్య సహకారం ప్రస్తుతం ఇదివరకటితో పోలిస్తే అధిక స్థాయిలకు చేరుకొంది.
***