Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త‌దేశం మార్పున‌ కు లోన‌వుతోంది; దీని కి కార‌ణం మార్పు కావాల‌ని భార‌తీయులు నిర్ణ‌యించుకోవ‌డ‌మే: ప్ర‌ధాన మంత్రి

భార‌త‌దేశం మార్పున‌ కు లోన‌వుతోంది; దీని కి కార‌ణం మార్పు కావాల‌ని భార‌తీయులు నిర్ణ‌యించుకోవ‌డ‌మే:  ప్ర‌ధాన మంత్రి

భార‌త‌దేశం మార్పున‌ కు లోన‌వుతోంది; దీని కి కార‌ణం మార్పు కావాల‌ని భార‌తీయులు నిర్ణ‌యించుకోవ‌డ‌మే:  ప్ర‌ధాన మంత్రి

భార‌త‌దేశం మార్పున‌ కు లోన‌వుతోంది; దీని కి కార‌ణం మార్పు కావాల‌ని భార‌తీయులు నిర్ణ‌యించుకోవ‌డ‌మే:  ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సూర‌త్ లో న్యూ ఇండియా యూత్ కాన్ క్లేవ్ పేరిట ఏర్పాటైన ఒక పుర మందిర కార్య‌క్ర‌మం లో యువ వృత్తి నిపుణుల తో సంభాషించారు. ఆహ్వానితులు ఆయ‌న కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

దేశం ప‌రివ‌ర్త‌న కు లోన‌వుతోంద‌ని, ఒక మెరుగైన భార‌త‌దేశం కోసం మార్పు ను తీసుకు రావాల‌ని ప్ర‌జ‌లు నిర్ణ‌యించుకొన్న కార‌ణం గానే ఇది సాధ్య‌ం అయింద‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. ఏదీ జ‌ర‌గ‌దు, లేదా ఏదీ మార‌దు అనేది ఇదివ‌ర‌క‌టి వైఖ‌రి. అయితే ఆలోచ‌న దృక్ప‌థం మారింది. మ‌రి ప్రస్తుతం అది కంటి కి క‌నిపిస్తోంది అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ‘‘ఒక‌ప్పుడు ప్ర‌జ‌ల లో ఏదీ మార‌దు అనే దృక్ప‌థం ఉండింది. మేం వ‌చ్చాం మరి ముందు గా ఆ దృష్టి కోణాన్ని మార్చివేశాం– ప్ర‌స్తుతం ప్ర‌తి దాని లోను మార్పు చోటు చేసుకొంటోంది. మారాలి అని భార‌తీయులు నిర్ణయించుకొన్నందువల్ల భార‌త‌దేశం మారుతోంది’’ అని ఆయ‌న చెప్పారు.

భార‌త‌దేశం యొక్క బ‌లాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ఉగ్ర‌వాదులు ముంబ‌యి పై దాడి చేశారు. ఆ త‌రువాత జ‌రిగిందేంటి ? మా ప్ర‌భుత్వం లో ఉడీ చోటు చేసుకొంది. దాని త‌రువాత జ‌రిగిందేంటి ? ఇదిగో ఇదే మార్పు. మ‌న జ‌వాను ల గుండె లలో ఉన్న జ్వాలే ప్ర‌ధాన మంత్రి హృద‌యం లో కూడా ర‌గిలింది. స‌ర్జిక‌ల్ స్ట్రయిక్ దాని ఫ‌లిత‌మే. ఉడీ ఉగ్ర‌వాద దాడి న‌న్ను నిద్ర పోనివ్వ‌లేదు. మ‌రి ఆ త‌రువాత జ‌రిగిందేంటో ప్ర‌తి ఒక్క‌రి కి తెలుసును. ఇదిగో ఇదే మార్పు’’ అన్నారు.

న‌ల్లధ‌నానికి వ్య‌తిరేకం గా త‌న ప్ర‌భుత్వ చ‌ర్య‌లు సాహ‌సోపేత‌మైన‌ మ‌రియు నిర్ణ‌యాత్మ‌క‌మైన చర్య అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

నోట్ల‌ చ‌ట్ట‌బ‌ద్ధ‌త ర‌ద్దు అనంతరం మూడు ల‌క్ష‌ల కంపెనీ లను మూసివేయడం జరిగింది; మరి న‌ల్ల‌ధ‌నాన్ని అడ్డుకోవచ్చ‌ని ఎవ్వరూ అనుకోలేదు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘భార‌తీయుల లో సెంటిమెంట్ మారింది, మ‌రి ఇది దేశాన్ని కూడా మార్చి వేస్తుంది, ఇది జరుగుతుందని నేను న‌మ్ముతున్నాను. ప్ర‌తిదీ చేసేది ప్ర‌జ‌లే అని ప్రజలు ఇంతకు ముందు భావించారు. కానీ, మేం దీని ని మార్చివేశాం. దేశం మ‌న‌లో ఏ ఒక్క‌రి క‌న్నా పెద్దది’’ అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ఈ రోజు న ఇది తాను పాలుపంచుకొన్న నాలుగో జ‌నస‌మూహ సంబంధిత కార్య‌క్ర‌మ‌ం అని, అయితే తాను అల‌సిపోలేద‌ని, అంత‌టి తో ఆగ‌క- మీరేమైనా అల‌సిపోయారా ? అంటూ తాను ప్ర‌జ‌ల‌ ను అడిగితే దానికి లేదు అంటూ చాలా పెద్ద సంఖ్య లో తనకు స‌మాధానం వ‌చ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి స‌ర‌దా గా వ్యాఖ్యానించారు.

ఒక రోజంతా సాగిన గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న లో ప్ర‌ధాన మంత్రి సూర‌త్ విమాశ్ర‌య ట‌ర్మిన‌ల్ భ‌వ‌నం విస్త‌ర‌ణ ప‌నుల‌ కు శంకుస్థాప‌న చేశారు. అలాగే, సూర‌త్ లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌ ను కూడా ఆయ‌న ప్రారంభించారు. సూర‌త్ లో అత్యంత ఆధునికమైనటువంటి రసీలాబెన్ సేవంతీలాల్ వీనస్ ఆసుపత్రి ని దేశ ప్ర‌జ‌ల కు ఆయ‌న అంకితమిచ్చారు. జాతీయ ఉప్పు స‌త్యాగ్ర‌హ స్మార‌కాన్ని దండి లో దేశ ప్ర‌జ‌ల కు ప్ర‌ధాన మంత్రి అంకిత‌ం చేశారు.