Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త‌దేశంలో ఫ్రాన్స్ అధ్య‌క్షుని ఆధికారిక ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సంతకాలైన ఎమ్ఒయు లు / ఒప్పందాల జాబితా (మార్చి 10, 2018)


Release id 177257

 

 

1.

 మ‌త్తుమందులు, సైకోట్రాపిక్ సబ్ స్టన్సె స్ మరియు కెమికల్ ప్రికర్సర్స్ అక్ర‌మ వినియోగాన్ని నిరోధించడంతో పాటు  వాటికి సంబంధించిన నేరాలను త‌గ్గించ‌డానికి ఇండియా,  ఫ్రాన్స్ ల మ‌ధ్య‌ కుదిరిన ఒప్పందం

శ్రీ రాజ్ నాధ్ సింగ్, హోం శాఖ మంత్రి

 శ్రీ జీన్ యెవ్స్ లెడ్రియాన్‌, యూర‌ప్ మ‌రియు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి

 ఈ ఒప్పందం కార‌ణంగా మ‌త్తుమందుల అక్ర‌మ ర‌వాణా పైన, వాటి వినియోగం పైన  ఇరు దేశాలు పోరాటం చేస్తాయి. త‌ద్వారా అది ఉగ్ర‌వాదానికి ఆర్ధిక సాయం అంద‌కుండా ప్ర‌భావం చూపుతుంది.

2.

భారతదేశం-ఫ్రాన్స్ ల మధ్య వ‌ల‌స మ‌రియు

రాక‌పోక‌ల భాగ‌స్వామ్య ఒప్పందం

శ్రీమ‌తి సుష్మాస్వ‌రాజ్‌, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి

శ్రీ జీన్ యెవ్స్ లెడ్రియాన్‌, యూర‌ప్ మ‌రియు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి

 

ఈ ఒప్పందం కార‌ణంగా ఇరు దేశాల మ‌ధ్య‌ రాక‌పోక‌ల ఆధారంగా తాత్కాలిక స‌ర్క్యుల‌ర్ వ‌ల‌స‌లకు వీల‌వుతుంది. స్వ‌దేశానికి నైపుణ్యాలను తిరిగి తెప్పించుకోవ‌డం వీల‌వుతుంది.

3.

విద్యారంగ సంబంధిత అర్హ‌త‌ల‌ను ఇరు దేశాలు ప‌ర‌స్ప‌రం గుర్తించ‌డానికి వీలుగా ఇండియా, ఫ్రాన్స్ ల మ‌ధ్య‌ ఒప్పందం

 

శ్రీ ప్రకాశ్ జావ‌డేక‌ర్‌, మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి

శ్రీమ‌తి ఫ్రెడ‌రిక్ విడాల్‌, ఉన్న‌త విద్య‌, ప‌రిశోధ‌న‌, నూతన ఆవిష్క‌ర‌ణ‌ రంగాల మంత్రి

ఈ ఒప్పందం ఫలితంగా విద్యార్హ‌త‌లను ఇరు దేశాలు ప‌ర‌స్ప‌రం గుర్తించ‌డానికి వీలు క‌ల్పించం ఈ ఒప్పందం ఉద్దేశం.

4.

రైల్వే రంగంలో సాంకేతిక స‌హ‌కారానికి సంబంధించిన అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం. భార‌తదేశ రైల్వే మంత్రిత్వ‌శాఖ‌కు, ఫ్రాన్స్ లోని ఎస్ ఎన్ సి ఎఫ్ మోటిలిటీస్ సంస్థ‌కు మ‌ధ్య‌న కుదిరింది.

శ్రీ పీయూష్ గోయల్‌, రైల్వే శాఖ మంత్రి 

శ్రీ జీన్ యెవ్స్ లెడ్రియాన్‌, యూర‌ప్ మ‌రియు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి

అత్య‌ధిక వేగంతోను, మ‌ధ్య‌త‌ర‌హా వేగంతోను ప్ర‌యాణం చేసే రైళ్ల విష‌యంలో ప‌ర‌స్ప‌ర స‌హకారాన్ని పెంపొందించుకొని, బ‌లోపేతం చేసుకోవ‌డం ఈ ఎమ్ఒయు ఉద్దేశం. స్టేష‌న్ ల పునరుద్ద‌ర‌ణ‌, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌నులలో, మౌలిక సదుపాయాలల్లో ఆధునికీకరణను చేప‌ట్టడం, న‌గ‌ర‌ శివార్ల రైళ్ల‌ను అభివృద్ధి ప‌ర‌చ‌డం చేస్తారు.

5.

భారతదేశం, ఫ్రాన్స్ శాశ్వ‌త ఇండో- ఫ్రెంచ్ రైల్వేల వేదికను ఏర్పాటు చేసుకోవ‌డానికి సంబంధించిన లెట‌ర్ ఆఫ్ ఇంటెంట్‌.

శ్రీ పీయూష్ గోయల్‌, రైల్వే శాఖ మంత్రి

శ్రీ జీన్ యెవ్స్ లెడ్రియాన్‌, యూర‌ప్ మ‌రియు విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి

 

ఇండో- ఫ్రెంచ్ శాశ్వ‌త రైల్వే వేదిక‌ను ఏర్పాటు చేసుకోవ‌డం ద్వారా ఇదివ‌ర‌కే ఇరు దేశాల మ‌ధ్య‌ ఉన్న స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకోవ‌డం ఈ లెటర్ ఆప్ ఇంటెంట్ ఉద్దేశం

6.

సాయుధ ద‌ళాల లాజిస్టిక్స్ కు సంబంధించి భారతదేశం, ఫ్రాన్స్ ప‌ర‌స్ప‌రం స‌హాయం చేసుకొనేందుకు వీలుగా ఒప్పందం

 

శ్రీమ‌తి నిర్మల సీతారమ‌ణ్, ర‌క్ష‌ణ శాఖ మంత్రి

శ్రీమ‌తి ఫ్లోరెన్స్ పార్లే, సాయుధ ద‌ళాల మంత్రి

ఇరు దేశాల మ‌ధ్య‌ అధికృత‌ నౌకాదళ సంద‌ర్శ‌న‌లు, ఉమ్మ‌డి క‌వాతులు, ఉమ్మ‌డి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, మాన‌వీయ స‌హాయం, విప‌త్తు స‌హాయ చ‌ర్య‌లు మొద‌లైన కార్య‌క్ర‌మాలలో ప‌ర‌స్ప‌ర లాజిస్టిక్స్ స‌హ‌కారం, స‌ర‌ఫ‌రా ల‌కు ఈ ఒప్పందం వీలు క‌ల్పిస్తుంది

 

7.

ప‌ర్యావ‌ర‌ణ రంగంలో స‌హ‌కారానికి సంబంధించి భారతదేశం, ఫ్రాన్స్ మ‌ధ్య‌ అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం (ఎమ్ఒయు)

డాక్ట‌ర్ మ‌హేశ్ శ‌ర్మ‌, ప‌ర్యావ‌ర‌ణ‌ం, అడవులు మరియు జల వాయు పరివర్తన శాఖ సహాయ మంత్రి

శ్రీమ‌తి బ్రూనే పాయిర్స‌న్‌, ఈకొలాజిక‌ల్ అండ్ ఇంక్లూసివ్ ట్రాన్షిశన్ శాఖ స‌హాయ మంత్రి

 

ప‌ర్యావ‌ర‌ణ‌, వాతావ‌ర‌ణ మార్పుల రంగాల‌లో రెండు దేశాల సాంకేతిక నిపుణ‌ల మ‌ధ్య, రెండు దేశాల మ‌ధ్య‌ స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌డానికి వీలు క‌ల్పించేలా ఈ ఎమ్ఒయు ఒక ప్రాతిప‌దిక‌ను ఏర్ప‌రుస్తుంది

8.

సుస్థిర‌మైన న‌గ‌ర అభివృద్ధి రంగంలో భారతదేశం, ఫ్రాన్స్ ల మ‌ధ్య‌ ఒప్పందం

శ్రీ హ‌ర్ దీప్ సింగ్ పురీ, గృహ నిర్మాణ‌ం, న‌గ‌ర మరియు ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)

 

శ్రీమ‌తి బ్రూనే పాయిర్స‌న్‌, ఈకొలాజిక‌ల్ అండ్ ఇంక్లూసివ్ ట్రాన్షిశన్ శాఖ స‌హాయ మంత్రి

స్మార్ట్ సిటీ స్ అభివృద్ధి, న‌గ‌ర ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు, వ‌ల‌సదారుల నివాసాలు, సౌక‌ర్యాలు మొద‌లైన వాటికి సంబంధించి స‌మాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవ‌డానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.

9.

భారతదేశం, ఫ్రాన్స్ ల మ‌ధ్య‌ భ‌ద్ర‌ప‌రచిన లేదా గోపనీయ స‌మాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకొని దానికి భ‌ద్ర‌తను క‌ల్పించ‌డానికి సంబంధించి ఒప్పందం

శ్రీ అజీత్ డోభాల్, ఎన్ఎస్ఎ

శ్రీ ఫిలిప్ ఎతియెనె,  దౌత్య‌ వ్య‌వ‌హారాలలో ఫ్రాన్స్ అధ్య‌క్షునికి స‌ల‌హాదారు

 

 

 

ఇరు దేశాల‌కు సంబంధించిన భ‌ద్ర‌ప‌రచిన స‌మాచారాన్ని ఇచ్చి పుచ్చున్న సంద‌ర్బాల్లో ఆ స‌మాచారానికి భ‌ద్ర‌త క‌ల్పించే ఉమ్మ‌డి భ‌ద్ర‌త నియ‌మ నిబంధ‌న‌లను ఈ ఒప్పందం నిర్వచిస్తుంది.

 

10.

సముద్ర ప్రాంతం పైన చైత‌న్యం క‌లిగించే మిశన్ కు సంబంధించి ముందస్తు అధ్య‌య‌నాల రూప‌క‌ల్ప‌న విష‌యంలో భార‌తీయ అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఐఎస్ఆర్ఒ), సెంట్ర‌ల్ నేష‌నల్ డి’ఎట్యూడ్స్ స్పేశియ‌ల్స్ ( సిఎన్ ఇ ఎస్‌) మ‌ధ్య‌ ఏర్పాటు అమ‌లు కు సంబంధించిన ఒప్పందం

శ్రీ కె. శివ‌న్‌, కార్య‌ద‌ర్శి,  అంత‌రిక్ష విభాగం మరియు చైర్మ‌న్, ఐఎస్ఆర్ఒ

శ్రీ జీన్ యెవెస్ లె గాల్, ప్రెసిడెంట్, సిఎన్ ఇ ఎస్‌

ఫ్రాన్స్‌ కు, భార‌త‌దేశానికి మ‌ధ్య‌ ప్రాధాన్య‌ం కలిగిన ప్రాంతాలలో నౌక‌ల గుర్తింపునకు, ప‌ర్య‌వేక్ష‌ణ‌కు సంబంధించి ఆద్యంతం ప‌రిష్క‌రాలను అందించ‌గ‌లిగే ఒప్పందం

11.

భారతదేశానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేశన్, ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు, ఫ్రాన్స్ కు చెందిన ఇడిఎఫ్ కు మ‌ధ్య‌ ఇండస్ట్రియల్ వే ఫార్బర్డ్ ఒప్పందం

శ్రీ శేఖ‌ర్ బ‌సు, కార్య‌ద‌ర్శి, అణు శక్తి విభాగం

శ్రీ జీన్ బెర్నార్డ్ లెవీ, సిఇవో, ఇడిఎఫ్‌

జైతాపూర్ పరమాణు విద్యుత్తు ప్రాజెక్టు అమ‌లుకు ఒక బాటను  ఈ ఒప్పందం సూచిస్తుంది.

12.

హైడ్రోగ్ర‌ఫీ, మేరిటైమ్ కార్టోగ్ర‌ఫీలకు సంబంధించి  భారతదేశం, ఫ్రాన్స్ ల మ‌ధ్య‌ ద్వైపాక్షిక ఒప్పందం

శ్రీ విన‌య్ క్వాత్రా, భార‌తదేశం రాయ‌బారి 

శ్రీ అలెగ్జాండ‌ర్ జీగ్ల‌ర్‌, ఫ్రాన్స్ రాయ‌బారి

హైడ్రోగ్ర‌ఫీ, నాటిక‌ల్ డాక్యుమెంటేష‌న్‌, మేరిటైమ్ భ‌ద్ర‌తా స‌మాచారం రంగాల‌కు సంబంధించి స‌హ‌కారాన్ని ఈ ఒప్పందం ప్రోత్స‌హిస్తుంది

13.

స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల‌కు నిధుల‌ను అందించ‌డానికి వీలుగా భారతదేశం, ఫ్రాన్స్ ల‌కు మ‌ధ్య‌ రుణ సౌక‌ర్య ఒప్పందం. ఈ ప్రాజెక్టులు ఛాలెంజ్ విధానంలో చేప‌ట్టిన‌వై ఉండాలి.

శ్రీ విన‌య్ క్వాత్రా, భార‌తదేశం రాయ‌బారి 

శ్రీ అలెగ్జాండ‌ర్ జీగ్ల‌ర్‌, ఫ్రాన్స్ రాయ‌బారి 

స్మార్ట్ సిటీస్ కార్య‌క్ర‌మానికి కేటాయించిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిధుల మ‌ధ్య‌ వ‌చ్చే అంతరాన్ని భర్తీ చేయ‌డానికి ఈ ఒప్పందం ఉప‌యోగ‌ప‌డుతుంది.

14.

నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జి (ఎన్ఐఎస్ఇ), నూత‌న మ‌రియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ ఇంకా ఫ్రాన్స్ కు చెందిన నేశనల్ సోలార్ ఎనర్జి ఇన్ స్టిట్యూట్ (ఐఎన్ఇఎస్) కు మధ్య‌ అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందం

శ్రీ విన‌య్ క్వాత్రా, భార‌తదేశం రాయ‌బారి  

శ్రీ డేనియ‌ల్ వెర్వాయెర్దె, అడ్మినిస్ట్రేట‌ర్‌, ది కమిశన్ ఫర్ అటామిక్ అండ్ ఆల్టర్నేట్ ఎనర్జి (సిఇఎ)

అంత‌ర్జాతీయ సౌర కూటమి ( ఐఎస్‌ఎ) స‌భ్య‌త్వ దేశాలలో ఇరు దేశాలు ప‌ని చేయ‌డానికి ఈ ఒప్పందం వీలు క‌ల్పిస్తుంది.  సౌర శక్తి (సోలార్ ఫోటో వోల్టాయిక్‌, స్టోరేజ్ టెక్నాల‌జీస్ మొద‌లైన‌) రంగాలలో సాంకేతిక విజ్ఞ‌ానం బ‌దిలీ, ప‌ర‌స్ప‌ర స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది.

 
వ.సం.
 
ఎమ్ఒయు/ ఒప్పందం
భార‌త‌దేశం పక్షాన‌  
ఫ్రెంచ్ పక్షాన
 
ఉద్దేశం