Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత శాంతి పరిరక్షక దళం (ఐపికెఎఫ్‌) స్మారకం వద్ద ప్రధానమంత్రి నివాళి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలోని శ్రీ జయవర్ధనేపుర కొట్టేలోగల ‘భారత శాంతి పరిరక్షక దళం’ (ఐపికెఎఫ్‌) స్మారకం వద్ద సైనిక సిబ్బందిని స్మరిస్తూ నివాళి అర్పించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

   “శ్రీలంక ఐక్యత, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ కర్తవ్య దీక్షలో అసమాన త్యాగం చేసిన ఐపీకేఎఫ్‌ సైనికుల ధైర్యసాహసాలను ఈ స్మారక చిహ్నం సదా స్మరించుకుంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు

.