Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారికి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


భారత రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు గాను శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

“శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారూ, మీరు భారత రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు అభినందనలు. మీ పదవీ కాలం ఫలప్రదంగాను, స్ఫూర్తిని ఇచ్చేదిగాను ఉండాలని కోరుకుంటున్నాను.

శ్రీ రామ్ నాథ్ కోవింద్ గారికి పార్లమెంటు సభ్యులలోను, వివిధ రాష్ట్రాలలోను విస్తృత మద్దతు లభించడం సంతోషంగా ఉంది. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మీరా కుమార్ గారు చేసిన ప్రచారానికి గాను ఆమెకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామిక సంస్కృతికి మరియు మనమంతా గర్వపడే విలువలకు బలాన్ని ఇచ్చే విధంగా ఆమె ప్రచారం సాగింది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

****