Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత మాజీ క్రికెటర్‌ సలీం దురానీ మృతిపై ప్రధానమంత్రి సంతాపం


   భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు సలీం దురానీ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“సలీమ్‌ దురానీ ఓ క్రికెట్‌ దిగ్గజం.. ఒక్కమాటలో చెబితే క్రికెట్‌ క్రీడకే ప్రతీక. ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ అగ్రశ్రేణి జట్టుగా రూపొందడంలో ఆయన తనవంతు పాత్ర పోషించారు. మైదానంలోనే కాకుండా వెలుపల కూడా ఆయన శైలి ప్రసిద్ధం. అటువంటి ప్రముఖ క్రీడాకారుడి మరణం నన్నెంతో బాధిస్తోంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

   అలాగే “గుజరాత్‌తో దురానీకి ఓ ప్రత్యేక, చిరకాల అనుబంధం ఉంది. ఆయన కొన్నేళ్లపాటు రాష్ట్రంలోని సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు గుజరాత్‌లోనే నివసించారు. ఓ సందర్భంలో ఆయనను కలుసుకుని ముచ్చటించే అవకాశం నాకు లభించింది. దురానీ బహుముఖ వ్యక్తిత్వంపట్ల నేనెంతో ఆకర్షితుడనయ్యాను. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిదే” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఆయనను తాను కలుసుకున్నప్పటి కొన్ని దృశ్యాలను కూడా ఈ సందర్భంగా ప్రధాని ప్రజలతో  పంచుకున్నారు.

*****