Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గౌరవ తులసీ గబ్బార్డ్ భేటీ

భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గౌరవ తులసీ గబ్బార్డ్ భేటీ


అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గౌరవ తులసీ గబ్బార్డ్ ఈ రోజు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

గత నెలలో తన వాషింగ్టన్ డీసీ పర్యటననుఅధ్యక్షుడు ట్రంప్ తో అత్యంత ఫలవంతంగా సాగిన చర్చలను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషంగా గుర్తు చేసుకున్నారు.

తన అమెరికా పర్యటన సందర్భంగా గౌరవ తులసీ గబ్బార్డ్ తో చర్చలను కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారురక్షణకీలక సాంకేతికతలుఉగ్రవాద నిరోధకతఅంతర్జాతీయ సవాళ్ల పరిష్కారం విషయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.

అధ్యక్షుడిగా ట్రంప్ రెండో దఫా పదవీ కాలంలో అమెరికా నుంచి భారత్ కు తొలి జరిగిన పర్యటనగా.. ఆమె సందర్శన ఎంతో విశేషమైనదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భారత ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారుఈ ఏడాదిలో అదీ సత్వరమే ఆయనను భారత్ కు స్వాగతించడం కోసం తనతోపాటు 140 కోట్ల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారని చెప్పారు.