అమెరికా జాతీయ భద్రతా సలహాదారు శ్రీ జేక్ సల్లివాన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సోమవారం కలిశారు.
భారత్–అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంపైనా… ముఖ్యంగా సాంకేతికత, రక్షణ, అంతరిక్షం, పౌర వినియోగం కోసం అణు రంగం, శుద్ధ ఇంధనం, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ అంశాల్లో గత నాలుగేళ్లుగా సాధించిన విశేష పురోగతినీ వారు చర్చించారు.
క్వాడ్ లీడర్స్ సదస్సు కోసం గతేడాది సెప్టెంబరులో అమెరికా పర్యటన సహా అధ్యక్షుడు బిడెన్‌తో వివిధ సందర్భాల్లో తన సమావేశాలను భారత ప్రధానమంత్రి గుర్తు చేశారు. భారత్–అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అధ్యక్షుడు బిడెన్ కృషి అమితమైన ప్రభావం చూపిందని ఆయన ప్రశంసించారు.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సల్లివాన్ ద్వారా అమెరికా అధ్యక్షుడు బిడెన్ తనకు అందించిన లేఖ పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తంచేశారు.
రెండు దేశాల ప్రజల ప్రయోజనాలతోపాటు అంతర్జాతీయ శ్రేయస్సు కోసం రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని పెంపొందించడంపట్ల తన నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
****
It was a pleasure to meet the US National Security Advisor @JakeSullivan46. The India-US Comprehensive Global Strategic Partnership has scaled new heights, including in the areas of technology, defence, space, biotechnology and Artificial Intelligence. Look forward to building… pic.twitter.com/GcU5MtW4CV
— Narendra Modi (@narendramodi) January 6, 2025